Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పడకగదిలో కష్టపడి అది కలిగించానంటే స్త్రీకి చిర్రెత్తుకొస్తుందట...

తమ భాగస్వామి భావప్రాప్తి పొందిన తర్వాత పురుషులకు తమ సామర్థ్యం గురించి గొప్పలు చెప్పుకోవడం అలవాటు అని, కానీ అది స్త్రీలకు ఏమాత్రం నచ్చదు అని అంటోంది ఓ అధ్యయనం. వివరాల్లోకి వెళ్తే... జర్నల్ ఆఫ్ సెక్స్ రీసెర్చ్ పేపర్ ప్రకారం పురుషుల్లో చాలా మంది స్త్రీక

Advertiesment
పడకగదిలో కష్టపడి అది కలిగించానంటే స్త్రీకి చిర్రెత్తుకొస్తుందట...
, మంగళవారం, 25 ఏప్రియల్ 2017 (20:29 IST)
తమ భాగస్వామి భావప్రాప్తి పొందిన తర్వాత పురుషులకు తమ సామర్థ్యం గురించి గొప్పలు చెప్పుకోవడం అలవాటు అని, కానీ అది స్త్రీలకు ఏమాత్రం నచ్చదు అని అంటోంది ఓ అధ్యయనం. వివరాల్లోకి వెళ్తే... జర్నల్ ఆఫ్ సెక్స్ రీసెర్చ్ పేపర్ ప్రకారం పురుషుల్లో చాలా మంది స్త్రీకి భావప్రాప్తి కలిగించడంలో తమ సామర్థ్యం గురించి, పడకపై తమ ప్రతాపం గురించే ఎక్కువ మాట్లాడుతారట. 
 
సుమారు 800 మంది పురుషులను వారి లైంగిక అలవాట్లు, వారి భాగస్వామి భావప్రాప్తి పొందిన తర్వాత తమ మగతనం గురించి వారు ఏమనుకుంటారు అని ఈ అధ్యయనకర్తలు ప్రశ్నించారు. పడకగదిలో తమ సామర్థ్యం గురించి, మగతనం గురించి మాట్లాడుతుంటారు అని తేలింది. 
 
కానీ ఇక్కడ సమస్య ఏమిటంటే, భావప్రాప్తి పొందిన అనుభూతిలో ఉన్న స్త్రీలకు తమ భాగస్వామి యొక్క అహంకారపూరితమైన వ్యాఖ్యలు, తామేదో కష్టపడి భావప్రాప్తి కలిగించాను అనే విధమైన అసందర్భ చర్చ పంటి కింద రాయిలా ఉంటుందట. వారి ఆనందమైన సమయాన్ని పూర్తిగా ఆస్వాదించనీయకుండా ఇలాంటి చర్చలు చేయకపోవడమే మంచిదని మనస్తత్వ శాస్త్రవేత్తలు అంటున్నారు. 
 
ఇలాంటి ప్రత్యేక సందర్భాల్లో తమ భాగస్వామి అందం గురించి, ఆమె అందించిన సహకారం గురించి చర్చిస్తే సహజంగానే స్త్రీలకు ఉన్న సిగ్గు, బిడియాలు తగ్గుముఖం పట్టి శృంగారం పట్ల ఆసక్తి పెరుగుతుందని, అలాగే భార్యాభర్తల మధ్య సాన్నిహిత్యం మెరుగవుతుందని కూడా అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొత్తగా బంధం ఏర్పరుచుకునేటప్పుడు అమ్మాయి/అబ్బాయి చేసే పొరపాట్లు...