Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కొత్తగా బంధం ఏర్పరుచుకునేటప్పుడు అమ్మాయి/అబ్బాయి చేసే పొరపాట్లు...

ఒక వ్యక్తి ప్రేమలో ఉన్నప్పుడు ప్రతి చిన్న విషయం నాటకీయంగా అనిపిస్తుంది. వర్షం పడినప్పుడు వారితో డ్యాన్స్ చేస్తున్నట్లు ప్రతి క్షణం వారి తలపుల్లోనే తన్మయత్వం చెందుతుంటారు. కానీ భాగస్వామి నుండి అతిగా ఆశ

Advertiesment
romance tips
, మంగళవారం, 25 ఏప్రియల్ 2017 (16:38 IST)
ఒక వ్యక్తి ప్రేమలో ఉన్నప్పుడు ప్రతి చిన్న విషయం నాటకీయంగా అనిపిస్తుంది. వర్షం పడినప్పుడు వారితో డ్యాన్స్ చేస్తున్నట్లు ప్రతి క్షణం వారి తలపుల్లోనే తన్మయత్వం చెందుతుంటారు. కానీ భాగస్వామి నుండి అతిగా ఆశించడం మరియు ఊహల్లో అనుకున్నవి వాస్తవ జీవితంలో జరగాలని కోరుకోవడం వలన బంధానికి బీటలు వారడం ఖాయం. సాధారణంగా ప్రతి ఒక్కరూ చేసే ఈ పొరపాట్లను వీలైనంత వరకు నివారిస్తే ప్రేమ బంధం పది కాలాల పాటు పచ్చగా ఉంటుంది.
 
* భాగస్వామితో భవిష్యత్తు గురించి ఎక్కువగా ఊహించుకోవడం
భాగస్వామి స్వభావం ఏమిటి, వారికి ఏవి నచ్చుతాయి మరియు ఏవి నచ్చవు అనే విషయాలను తెలుసుకోవడం కోసం సమయం కేటాయించాలి. అలా కాకుండా భవిష్యత్తు గురించి ఊహలతో వర్తమానాన్ని నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు. ఒక బంధాన్ని ఏర్పరుచుకోవడం సులభం, కానీ దాన్ని నిలబెట్టుకోవడం కష్టం.
 
* వ్యక్తిగత స్వేచ్ఛ ఉండాలి
ప్రతి చిన్న కదలిక గురించి ఆరా తీయడం లేదా ప్రతి చిన్న నిర్ణయం గురించి చెప్పాలనుకోవడం తప్పు. ఒకరిపై మరొకరు అధికారం చెలాయించుకోకుండా అర్థం చేసుకుంటూ ఎవరి పరిధుల్లో వారు ఉన్నంత వరకు ఆ బంధానికి ఎలాంటి ఢోకా ఉండదు.
 
* కుటుంబ సభ్యులు మరియు స్నేహితులను దూరం పెట్టడం
భాగస్వామితో గడపటం ఎంత ముఖ్యమో కుటుంబ సభ్యులు మరియు స్నేహితులకు సమయాన్ని కేటాయించడం కూడా అంతే ముఖ్యం. ఈ కొత్త బాంధవ్యం కారణంగా వారిని నిర్లక్ష్యం చేస్తున్న భావన వారికి రాకూడదు మరియు మీ మధ్య ఉన్న బంధం దెబ్బ తినకూడదు.
 
* ఒకరిని మరొకరు మార్చాలనుకోవడం
మీరు కావాలనుకునే అన్ని లక్షణాలతో భాగస్వామి దొరకడం కష్టం (అసాధ్యం కూడా కావచ్చు). వారిని మీకు నచ్చినట్లుగా మార్చాలనుకోవడం పొరపాటు, ఈ కారణంగానే చాలా జంటలు మధ్యలో విడిపోతున్నాయి. పరస్పర అభిరుచులను తెలుసుకుని, వారి భావాలను గౌరవించడం కూడా ప్రేమించడంలో భాగమే.
 
ప్రతి బంధం ప్రత్యేకమైనది, ఎవరికి వారే తమ బంధం మరింత ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటారు. ఈ జాగ్రత్తలను మనస్సులో పెట్టుకుని మసలుకుంటే మీ బంధం కలకాలం పదిలంగా ఉంటుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మలేరియా దోమతో తమాషా కాదు... ప్రతి 45 సెకన్లకు...