Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కొత్తగా ఉద్యోగంలో చేరారా? అయితే ఈ చిట్కాలు మీ కోసం...

కొత్తగా జాబ్‌లో చేరి ఉద్యోగులు మెుదట్లో కొన్ని రోజులు బెరుకుబెరుకుగా ఉంటారు. అలాంటి వారు విధిగా కొన్ని సూచనలు, చిట్కాలు పాటించడం వలన ఆ బెరుకును అధికమించువచ్చును. ఆ చిట్కాలేంటో ఓసారి పరిశీలిద్ధాం.

కొత్తగా ఉద్యోగంలో చేరారా? అయితే ఈ చిట్కాలు మీ కోసం...
, శనివారం, 30 జూన్ 2018 (11:42 IST)
కొత్తగా జాబ్‌లో చేరిన ఉద్యోగులు మెుదట్లో కొన్ని రోజులు బెరుకుబెరుకుగా ఉంటారు. అలాంటి వారు విధిగా కొన్ని సూచనలు, చిట్కాలు పాటించడం వలన ఆ బెరుకును అధికమించువచ్చును. ఆ చిట్కాలేంటో ఓసారి పరిశీలిద్దాం.
 
పని గురించిన రకరకాల విషయాలు, నియమనిబంధనలు ముందుగానే స్పష్టంగా అడిగి తెలుసుకోవాలి. అలా తెలుసుకుంటేనే ఆ వాతావరణంలో బాగా పనిచేయగలుగుతారు. ఆఫీసు మీటింగ్స్‌కు తప్పకుండా హాజరవ్వాలి. పనిచేసే విభాగం మాత్రమే కాకుండా ఇతర డిపార్ట్‌మెంట్‌లో పనిచేసే ఇతరులతో కూడా కలివిడిగా మాట్లాడటం అలవరచుకోవాలి.
 
దుస్తుల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. చూసే వారికి మంచి ఇంప్రెషన్ కలగాలి. ఆఫీసులో వ్యక్తులతో మిమ్మలను మీరే పరిచయం చేసుకోవాలి. తోటి ఉద్యోగులతో సంభాషించాలి. స్నేహపూరితంగా మెలగాలి. కొన్ని విషయాల పట్ల చర్చిండం వంటివి చేస్తుండాలి.
 
వర్క్ విషయంలో ఎప్పుడు ఎటువంటి సందేహం వచ్చిన కోలీగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని అడిగి తెలుసుకుంటే మంచిది. టీమ్ మీటింగ్‌లో మీ ఆలోచనల్ని, అభిప్రాయాలను చెప్పడానికి సంకోచించవద్దు. ముఖ్యంగా గతంలో చేసిన ఉద్యోగంతో కొత్తగా చేరిన ఉద్యోగాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ పోల్చుకోకూడదు. ఏదైనా సమస్య ఉంటే మాట్లాడి పరిష్కరించుకోవాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హిమాలయాలు ఎక్కడున్నాయిరా?