Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

01-10-2018 నుండి 31-10-2018 వరకు మీ మాస రాశిఫలితాలు

గృహంలో మార్పులకు శ్రీకారంచుడతారు. బంధుత్వాలు, పరిచయాలు విస్తరిస్తాయి. వ్యవహారాలలో హడావుడిగా ఉంటారు. అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. ధనలాభం, వస్త్రప్రాప్తి, కుటుంబసౌఖ్యం ఉన్నాయి. శుభవార్తలు వింటారు.

Advertiesment
01-10-2018 నుండి 31-10-2018 వరకు మీ మాస రాశిఫలితాలు
, ఆదివారం, 30 సెప్టెంబరు 2018 (15:53 IST)
6వ తేదీ బుధుడు తుల యందు, 11వ తేదీ గురువు వృశ్చికం నందు, 17వ తేదీ రవి తలయందు, 26వ తేదీ బుధుడు వృశ్చికం నందు ప్రవేశం. 5వ తేదీ నుండి శుక్రునికి వక్రం ప్రారంభం. 
 
7వ తేదీ మాసశివరాత్రి, 10వ తేదీ శరన్నవరాత్రులు ప్రారంభం. 12 భీరమధి నది పుష్కరాలు ప్రారంభం. 15వ తేదీ సరస్వతి పూజ. 17 వతేదీ దుర్గాష్టమి, 18వ తేదీ మహార్ణమి, 18వ తేదీ విజయదశమి, 20వ తేదీ సర్వఏకాదశి. 20వ తేదీ నుండి శుక్రమౌడ్యమి ప్రారంభం. 26వ తేదీ అట్ల తద్ది, 28వ తేదీ సంకటహరచతుర్థి, 31వ తేదీ శుక్రమౌడ్యమి త్యాగం.
 
మేషరాశి: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
గృహంలో మార్పులకు శ్రీకారంచుడతారు. బంధుత్వాలు, పరిచయాలు విస్తరిస్తాయి. వ్యవహారాలలో హడావుడిగా ఉంటారు. అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. ధనలాభం, వస్త్రప్రాప్తి, కుటుంబసౌఖ్యం ఉన్నాయి. శుభవార్తలు వింటారు. పనులు సానుకూలమవుతాయి. ఖర్చులు విపరీతం. ఆభరణాలు, నగదు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. సంతానంరాక ఉత్సాహాన్నిస్తుంది. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. పదవులు దక్కకపోవచ్చు. గుట్టుగా యత్నాలు సాగించండి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. పెట్టుబడులు లాభిస్తాయి. వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఉద్యోగస్తులకు పదవీయోగం. ప్రశంసలు అందుకుంటారు. దైవదర్శనాలు సంతృప్తినిస్తాయి. సన్మాన, సాహిత్య సభల్లో పాల్గొంటారు. వాహనచోదకులకు దూకుడు తగదు.
 
వృషభరాశి: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
వ్యవహార ఒప్పందాలకు అనుకూలం. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. పెద్దల సలహా పాటించండి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఖర్చులు అంచనాలను మించుతాయి. పొదుపు మూలక ధనం గ్రహిస్తారు. యత్నాలు ఫలిస్తాయి. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సంతానం దూకుడు అదుపు చేయండి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. పెట్టుబడులకు అనుకూలం. గృహమార్పు కలిసివస్తుంది. నిర్మాణాలు, మరమ్మత్తులు చేపడతారు. ఆత్మీయులకు ముఖ్య సమాచారం అందిస్తారు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. అవివాహితుల్లో సంతోషం నెలకొంటుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. దైవదర్శనాల్లో ఒకింత అవస్థలు తప్పవు.  
 
మిధునరాశి: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఈ మాసం శుభదాయకమే. వ్యవహారాలను సమర్థంగా నిర్వహిస్తారు. అసాధ్యమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. కష్టం ఫలిస్తుంది. సమస్యల నుండి బయటపడుతారు. గృహం సందడిగా ఉంటుంది. ఆదాయానికి తగ్గట్టే ఖర్చులుంటాయి. పొదుపునకు అవకాశం లేదు. వస్త్రాలు, విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. రశీదులు, పత్రాలు జాగ్రత్త. శుభకార్యం నిశ్చయమవుతుంది. వివాహ వేదికలు అన్వేషిస్తారు. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం తగదు. ఒక ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్పురిస్తాయి. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాల్లో లాభాలు, అనుభవం గడిస్తారు. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. క్రీడాపోటీల్లో విజయం సాధిస్తారు. 
 
కర్కాటకరాశి: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
శుభకార్యానికి తీవ్రంగా యత్నాలు సాగిస్తారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. కొత్త పనులు ప్రారంభిస్తారు. నిర్దిష్ట ప్రణాళికలు రూపొందించుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ఉన్నత పదవులు అందుకుంటారు. పరిచయాలు, వ్యాపకాలు పెంపొందుతాయి. ఖర్చులు విపరీతం. విలాసాలకు వ్యయం చేస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పోగొట్టుకున్న పత్రాలు తిరిగి పొందుతారు. సంతానం విషయంలో శుభపరిణాలు సంభవం. వేడుకలకు హాజరవుతారు. బంధువుల ఆతిధఅయం ఆకట్టుకుంటుంది. గృహమార్పు అనివార్యం. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ ఇష్టాయిష్టాలను సున్నితంగా వ్యక్తం చేయండి. తీర్థయాత్రాలకు సన్నాహాలు సాగిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వైద్యరంగాల వారికి ఆదాయాభివృద్ధి.
 
సింహరాశి: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
గృహం సందడిగా ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలుపై దృష్టి సారిస్తారు. సంప్రదింపులకు అనుకూలం. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. వ్యవహారానుకూలత ఉంది. అవకాశాలు కలిసివస్తాయి. ఖర్చులు అధికం, ధనానికి ఇబ్బంది ఉండదు. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. అపరిచితులతో మితంగా సంభాషించండి. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. సంతానం విజయం ఉత్సాహాన్నిస్తుంది. ఉద్యోగస్తులకు ధనలాభం. అధికారులకు బాధ్యతల మార్పు, స్థానచలనం. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నష్టాలు, ఆటంకాలను దీటుగా ఎదుర్కుంటారు. సరుకు నిల్వలో జాగ్రత్త. దైవదర్శనాలు సంతృప్తినిస్తాయి. పందాలు, జూదాల వలన చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది.  
 
కన్యరాశి: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఖర్చులు విపరీతం. రాబడిపై దృష్టి పెడతారు. అతికష్టంమ్మీద అవసరాలు తీరుతాయి. సంతానం అత్యుత్సాహం ఇబ్బంది కలిగిస్తుంది. సౌమ్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. కార్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. మనస్థిమితం ఉండదు. వ్యవహారాల్లో ప్రతికూలతలెదురవుతాయి. ఆత్మీయుల సలహా పాటించండి. ఏకపక్షంగా వ్యవహరించవద్దు. పెద్దల మాటతీరు కష్టం కలిగిస్తుంది. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. మీ పథకాలు ఏమంత ఫలితాన్నీయవు. వృత్తుల వారికి ఆశాజనకం. నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. కళ, క్రీడాకారులకు ప్రోత్సాహకరం. దైవదర్శనం సంతృప్తినిస్తుంది. ప్రయాణంలో జాగ్రత్త. 
 
తులారాశి: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
గృహంలో మార్పుచేర్పులకు అనకూలం. ఒక ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. వేడుకలు, విందుల్లో పాల్గొంటారు. బంధుత్వాలు, పరిచయాలు బలపడుతాయి అప్రమత్తంగా వ్యవహరించాలి. ఎవరినీ తక్కువ అంచనాలు వేయెుద్దు. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. దుబారా ఖర్చులు విపరీతం. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. ప్రియతముల ఆరోగ్యం మెరుగుపడుతుంది. సన్నిహితులకు సాయం అందిస్తారు. అవివాహితుల్లో ఉత్సాహం నెలకొంటుంది. విదేశీ విద్యాయత్నం ఫలించదు. ప్రకటనల పట్ల అవగాహన ప్రధానం. తొందరపడి చెల్లింపులు జరుపవద్దు. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. ప్రత్యర్థులతో జాగ్రత్త. వ్యాపారాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. పెట్టుబడులకు అనుకూలం. 
 
వృశ్చికరాశి: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట
ఆర్థికస్థితి సామాన్యం. ఏ పురోగతి లేక నిరుత్సాహం చెందుతారు. ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. ఆదాయ మార్గాల అన్వేషిస్తారు. అయిన వారి మాటతీరు కష్టమనిపిస్తుంది. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. వ్యవహారాల్లో ప్రతికూలతలెదురవుతాయి. పట్టుదలతో యత్నాలు సాగించండి. ఒక సమాచారం ఆందోళన కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ప్రియతముల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. సంతానం ద్వారా శుభవార్తలు వింటారు. ఆరోగ్యం సంతృప్తికరం. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. కొనుగోలుదార్లతో జాగ్రత్త. వైద్య, సాంకేతిక రంగాల వారికి ఆశాజనకం. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు. దైవదర్శనం సంతృప్తినిస్తుంది.  
 
ధనర్‌రాశి: మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం
ఈ మాసం ఆశాజనకమే. సమస్యలను సమర్థంగా పరిష్కరిస్తారు. కష్టం ఫలిస్తుంది. ప్రతిభాపాటవాలు వెలుగులోని వస్తాయి. పదవులు, పురస్కారాలు అందుకుంటారు. వ్యాపకాలు పెంపొందుతాయి. ఖర్చులు విపరీతం. ఆలయాలు, సేవా సంస్థలకు సాయం అందిస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. అతిగా ఆలోచింపవద్దు. వేడుకలను ఆడంబరంగా చేస్తారు. మీ ఆతిధ్యం ఆకట్టుకుంటుంది. మీ ఉన్నతి కొంత మందికి అపోహ కలిగిస్తుంది. సంతానం దూకుడు అదుపు చేయండి. స్థిరాస్తి కొనుగోలు దిశగా ఆలోచిస్తారు. ప్రకటనలు, దళారులను విశ్వసించవద్దు. పత్రాలు, ఆభరణాలు జాగ్రత్త. వ్యాపారాల్లో లాభాలు, అనుభవం గడిస్తారు. భాగస్వామిక చర్చలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త. 
 
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఈ మాసం ద్వితీయార్థం ఆశాజనకం. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. ఒక సమాచారం ఉల్లాసాన్నిస్తుంది. ఆత్మీయులను విందులకు ఆహ్వానిస్తారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడుతాయి. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం. ఆదాయానికిమించి ఖర్చులుంటాయి. రాబడిపై దృష్టి పెడతారు. సన్నిహితుల సాయం అందుతుంది. ఆందోళన తొలగి కుదుటపడుతారు. ఆరోగ్యం జాగ్రత్త. వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. నష్టాలు, ఆటంకాలను అధిగమిస్తారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. క్రీడాకారులకు నిరుత్సాహం. ప్రయాణాలు సజావుగా సాగుతాయి.  
 
కుంభరాశి: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
అన్ని రంగాలవారికి ఆశాజనకమే. సర్వత్రా అనుకూలతలున్నాయి. వ్యవహారాలను సమర్థంగా నిర్వహిస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. వస్త్రప్రాప్తి, వాహన యోగం పొందుతారు. ప్రేమానుబంధాలు బలపడుతాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. ఖర్చులు అధికం. ప్రయోజనకరం. ధనానికి ఇబ్బంది ఉండదు. ఆప్తులకు సాయం అందిస్తారు. పనులు నిదానంగా సానుకూలమవుతాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. పరిచయాలు బలపడుతాయి. పత్రాలు, నగదు జాగ్రత్త. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఉద్యోగస్తుల పదోన్నతి, ధనలాభం. విందులు, వేడుకల్లో పాల్గొంటారు. వృత్తుల వారికి ఆశాజనకం. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. 
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఆదాయవ్యయాలకు పొంతన ఉండదు. ధనమూలక సమస్యలెదురవుతాయి. సాయం చేసేందుకు అయిన వారే సందేహిస్తారు. అవసరాలు అతికష్టంమ్మీద తీరుతాయి. కార్యసాధనకు ఓర్పు, కృషి ప్రధానం. పరిస్థితులు అనుకూలించవు. యత్నాలు విరవించుకోవద్దు. ఆదాయ దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. గృహమార్పు అనివార్యం. ఆరోగ్యం సంతృప్తికరం. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ అవసరం. శుభకార్యాలకు హాజరవుతారు. బంధువుల ఆతిధ్యం ఆకట్టుకుంటుంది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తులకు పనిభారం, విశ్రాంతిలోపం. న్యాయ, వైద్య, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. దైవదర్శనాలు, ప్రయాణంలో అవస్థలెదుర్కుంటారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

30-09-2018 - ఆదివారం దినఫలాలు - అతిగా మాట్లాడడం మీ శ్రీమతికి...