ప్రదోషం రోజున లింగార్చన చేయడం విశేష ఫలితాలను ఇస్తుంది. ధనప్రాప్తి కోసం శివపూజలో తామరపత్రాలను ఉపయోగించాలి. ధనం నిలవడానికి బిల్పపత్రాలతో శివార్చన చేయాలి. మోక్షానికి దర్బలతో శివార్చన చేయాలి. భోగభాగ్యాల కోసం చంధనతైలంతో శివార్చన చేయాలి.
వంశాభివృద్ధి, పేరు ప్రతిష్టల కోసం ఆవు నేతితో శివార్చన చేయాలి. పాడి పంటలు వృద్ధి కోసం నూకలు లేదా బియ్యంతో శివార్చన చేయాలి. సుఖ, సంతోష సంపదల కోసం నూకలు లేని బియ్యంతో శివార్చన చేయడం మంచిది. వస్తు, వాహనం కోసం మల్లెపువ్వుతో లింగాన్ని అర్చించాలి.
సంతానం, సౌభాగ్యం కోసం ఉమ్మెత్త పువ్వులతో అర్చన చేయాలి. కోరికలు నెరవేరేందుకు, దీర్ఘాయుష్షు కోసం గరికతో శివార్చన చేయాలని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.