కష్టమొచ్చినప్పుడు అందరం దేవున్ని తలుచుకుంటాం. మనకు దేవుడు వివిధ రూపాల్లో మార్గాల్లో సహాయం చేస్తాడు. మానన ప్రయత్నం ఉంటే తాను కూడా ఓ చెయ్యి వేస్తాడు. కష్టాల్లో చిక్కుకున్నప్పుడు తప్పకుండా కాపాడతాడు. దేవుడు కలలో కనిపించి మనకు కొన్ని సందేశాలు అందిస్తాడు. మనకు దేవుడు కలలో కనిపిస్తే అది శుభ సూచకం.
మీరు ప్రయత్నాలు చేసి ఏ విషయంలోనైనా నమ్మకాన్ని కోల్పోయుంటే అది నెరవేరబోతోందని అర్థం. మీ పనులు నిరాటంకంగా పూర్తవుతాయి. మీరు నిర్ణయాన్ని తీసుకోలేక సతమతమవుతుంటే దేవుడు కలలో కనిపించి సందేశం ఇస్తాడు. మీ అంతరంగాన్ని నమ్మండి అని సూచిస్తాడు. మీ అంతరాత్మ ఏది చెబితే అది చేయాలి. దేవుడు కలలో కనిపిస్తే మీపై, మీ కుటుంబంపై దేవుని కరుణా కటాక్షాలు ఉన్నట్లు లెక్క.
మీ సమస్యలన్నీ త్వరలో పరిష్కారమవుతాయని అర్థం. దేవుడు కలలో కనిపించినప్పుడల్లా ఏదో మంచే అని భావిస్తే తప్పు. దేవునికి కోపం వచ్చినప్పుడు కూడా కలలో కనిపిస్తాడు. ఏదైనా మ్రొక్కుబడి తీర్చకపోతే వెంటనే తీర్చమని గుర్తు చేస్తాడు. మీ కర్తవ్యం మీరు నెరవేర్చాల్సి ఉంటుంది.