వాస్తుశాస్త్రాన్ని మనం అనాది నుండి అనుసరిస్తూ వస్తున్నాం. కొంత మందికి దీని గురించి తెలియక ఇబ్బందులలో పడతారు. అలాంటి వారు నిపుణుల దగ్గర సూచనలు తీసుకోవడం మంచిది. వాస్తు ఇంటికే కాదు, మనం ఆచరించే పద్ధతులను బట్టి కూడా ఉంటుంది. మన ఆర్ధికాభివృద్ధి, ఆరోగ్యం, విద్య తదితర అంశాలపై ఇది ప్రభావం చూపుతుంది.
మన పిల్లలు బాగా చదువుకుని ప్రయోజకులు అవ్వాలని మనం ఆశిస్తాం. పిల్లల ప్రయత్నంతోపాటు మనం వారికి వెసులుబాట్లు కల్పించాలి. వారి పురోభివృద్ధికి దోహదపడాలి. దానికి అనుగుణంగా మనం గృహాన్ని నిర్మించుకోవాలి. వాస్తు శాస్త్రాన్ని పాటించాలి లేకపోతే పిల్లలకు సబ్జెక్ట్‌లు కష్టమవుతాయి. తెలివితేటలపై ప్రభావం పడుతుంది. ఏకాగ్రత నశిస్తుంది.
కష్టపడి చదివినా మంచి ఫలితాలు రాకపోవచ్చు. సక్రమమైన వాస్తు అభివృద్ధిని ఇస్తుంది. విద్యార్థులు చదువుకునేటప్పుడు ఇంట్లో నాల్గవ అనుకూలమైన దిక్కులో కూర్చోవాలి. తద్వారా ఏకాగ్రత పెంపొందించబడుతుంది. ముఖ్యంగా ఇంట్లో సరస్వతీ స్థానం ఎక్కడ ఉందో తెలుసుకోవాలి. సరస్వతి స్థానంలో ఏవైనా లోపాలు ఉంటే స్కిల్స్‌పై ప్రభావం పడుతుంది.
పరోక్షంగా ఆర్థికాభివృద్ధి, వ్యాపారాభివృద్ధి సన్నగిల్లుతుంది. దీని కోసం నిపుణులను సంప్రదించాలి. చదువుకునేటప్పుడు మంచంపై కూర్చోకూడదు. మంచంపై కూర్చుంటే తగిన విధంగా దృష్టి సారించలేరు.