22-10-2017 నుంచి 28-10-2017 వరకు మీ వార రాశి ఫలితాలు...
కర్కాటకంలో రాహువు, కన్యలో శుక్ర, కుజులు, తులలో రవి, బుధ, గురువు, వృశ్చికంలో శని, మకరంలో కేతువు. తుల, వృశ్చిక, ధనస్సు, మకరంలలో చంద్రుడు. 26న శని మకర ప్రవేశం. ముఖ్యమైన పనులకు సప్తమి, శుక్రవారం అనుకూలం. ఈశ్వరుని ఆరాధన సర్వదా శుభదాయకం.
కర్కాటకంలో రాహువు, కన్యలో శుక్ర, కుజులు, తులలో రవి, బుధ, గురువు, వృశ్చికంలో శని, మకరంలో కేతువు. తుల, వృశ్చిక, ధనస్సు, మకరంలలో చంద్రుడు. 26న శని మకర ప్రవేశం. ముఖ్యమైన పనులకు సప్తమి, శుక్రవారం అనుకూలం. ఈశ్వరుని ఆరాధన సర్వదా శుభదాయకం.
మేషం : అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం.
ఆర్థికస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది. ఖర్చులు సామాన్యం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ఆలోచనలు ఫలిస్తాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. గృహంలో స్తబ్ధత తొలగుతుంది. ఆహ్వానం అందుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మంగళ, బుధవారాల్లో అవకాశాలు అందినట్టే చేజారిపోతాయి. పనుల సానుకూలతకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు అనుకూలం. పెట్టుబడులపై దృష్టి సారిస్తారు. భాగస్వామిక చర్చలు ఫలిస్తాయి. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. యాదృచ్ఛికంగా తప్పులు దొర్లే ఆస్కారం ఉంది. ధనప్రలోభం, ఒత్తిళ్లకు తలొగ్గవద్దు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలు భర్తీ చేసుకోగలుగుతారు. విద్యార్థులు పోటీల్లో రాణిస్తారు.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు.
ఒక వ్యవహారంలో ధనం అందుతుంది. రుణ బాధలు తొలగుతాయి. తాకట్టు విడిపించుకుంటారు. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి కలుగుతుంది. లక్ష్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. ఆది, గురువారాల్లో పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. అనవసర విషయాల్లో జోక్యం తగదు. మీ సేవలకు ప్రశంసలు లభిస్తాయి. ఉన్నత పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. సాధ్యం కాని హామీలివ్వవద్దు. మీ అభిప్రాయాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. కుటుంబీకుల ఆరోగ్యం మందగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. లైసెన్స్‌ల రెన్యువల్‌లో అలక్ష్యం తగదు. ఉద్యోగస్తుల కృషి ఫలిస్తుంది. అధికారులకు సాదర వీడ్కోలు పలుకుతారు.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు. ఆర్థ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు.
లావాదేవీలు, సంప్రదింపులు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఖర్చులు విపరీతం, ప్రయోజనకరం. శుభకార్యాలను ఘనంగా చేస్తారు. మీ ఉన్నతిని చూసి కొంతమంది అపోహపడే ఆస్కారం ఉంది. పనులు నిదానంగా సానుకూలమవుతాయి. విలువైన వస్తువులు జాగ్రత్త. పరిచయం లేని వారికి దగ్గరకు రానీయకండి. మంగళ, శనివారాల్లో మీ ఏమరుపాటుతనం వల్ల ఇబ్బందులు తప్పవు. ఆత్మీయులతో సంప్రదింపులు జరుపుతారు. ఆరోగ్యం సంతృప్తికరం. సంతానం గురించి ఆలోచిస్తారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. గృహ నిర్మాణాలు చురుకుగా సాగుతాయి. ఉద్యోగస్తులకు యూనియన్‌లో గుర్తింపు లభిస్తుంది. సాంకేతిక, వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. తీర్థయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కార్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. ఆదాయానికి తగ్గట్లు ఖర్చులుంటాయి. పొదుపు చేయాలనే ఆలోచన ఫలించదు. ధనలాభం, వస్త్రప్రాప్తి, వాహన యోగం పొందుతారు. బంధుత్వాలు బలపడతాయి కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. పెట్టుబడుల విషయంలో నిర్ణయానికి వస్తారు. టెండర్లు, ఏజెన్సీలకు అనుకూలం. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ అవసరం. ఆరోగ్యం నిలకడగా వుంటుంది. పదవులు, బాధ్యతల నుంచి తప్పుకుంటారు. గురు, శుక్రవారాల్లో ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ఉద్యోగస్తులకు ఉన్నత పదవీయోగం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. సరుకు నిల్వలో జాగ్రత్త.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం.
యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఖర్చులు సామాన్యం. ధనానికి ఇబ్బంది ఉండదు. పొదుపు పథకాలపై దృష్టి సారిస్తారు. పెద్దమొత్తం ధనసహాయం, ప్రైవేట్ సంస్థల్లో మదుపు క్షేమం కాదు. అవిశ్రాంతంగా శ్రమించి పనులు పూర్తి చేస్తారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. కొన్ని విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి తగదు. వేడుకలు, శుభకార్యాలకు సన్నాహాలు సాగిస్తారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. శనివారం నాడు బాధ్యతలు స్వయంగా చూసుకోండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. విదేశీ విద్యాయత్నం ఫలిస్తుంది. ప్రకటనల పట్ల అవగాహన ప్రధానం. దళారులను విశ్వసించవద్దు. వ్యాపారాల్లో నిలదొక్కుంటారు. వ్యాపారాల విస్తరణలకు అనుకూలం. దైవదీక్షలు స్వీకరిస్తారు. వాహన చోదకులకు దూకుడు తగదు.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు.
ఈ వారం ఖర్చులు అధికం, అవసరాలు అతికష్టంమ్మీద నెరవేరుతాయి. నిర్దిష్ట ప్రణాళికలు రూపొందించుకుంటారు. ఆత్మీయుల కలయికతో కుదుటపడతారు. ఏ సమస్యనైనా ధీటుగా ఎదుర్కొంటారు. యత్నాలకు పరిస్థితులు అనుకూలిస్తాయి. పనులు సానుకూలమవుతాయి. ఒక ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. అప్రియమైన వార్త వినవలసి వస్తుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. దంపతుల మధ్య దాపరికం తగదు. మీ ఇష్టాయిష్టాలను సున్నితంగా వ్యక్తం చేయండి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. అధికారులకు హోదా మార్పు, స్థానచలనం. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. చిరువ్యాపారులకు ఆదాయాభివృద్ధి. సేవా, పుణ్యకార్యాల్లో పాల్గొంటారు.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు.
యత్నాలకు పరిస్థితులు అనుకూలిస్తాయి. శుభకార్యాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. మీ రాక బంధువులకు సంతోషం కలిగిస్తుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పట్టుదలతో శ్రమించిన గాని పనులు పూర్తి కావు. దుబారా ఖర్చులు అధికం. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ఆత్మీయులతో సంప్రదింపులు జరుపుతారు. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. వైద్య సేవలు అవసరమవుతాయి. సంతానం కదలికలపై దృష్టి సారించండి. వ్యవహార ఒప్పందాలకు అనుకూలం. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. దీక్షలు స్వీకరిస్తారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు ఏమంత సంతృప్తినీయవు. నూతన వ్యాపారాలు, ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ప్రయాణం కలసివస్తుంది.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట.
ఆత్మీయుల ఆహ్వానం సంతోషపరుస్తుంది. దంపతుల మధ్య సఖ్యత లోపం. చికాకులు తలెత్తుతాయి. అనునయంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. బంధువుల మాటతీరు కష్టమనిపిస్తుంది. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవం. ఆది, సోమవారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. తొందరపడి హామీలివ్వవద్దు. పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది. ఎవరి సాయం ఆశించవద్దు. పనులు మొండిగా పూర్తి చేస్తారు. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన ఫథకాలు సామాన్య ఫలితాలే ఇస్తాయి. హోల్‌సేల్ వ్యాపారులకు ఆశాజనకం. సరకు నిల్వలో జాగ్రత్త వహించండి. వృత్తుల వారికి ప్రజాసంబంధాలు బలపడతాయి. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. విదేశీ యత్నంలో ఆటంకాలు ఎదుర్కొంటారు.
ధనస్సు : మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం.
యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఆప్తులని చక్కని సలహాలిస్తారు. ఆర్థిక ఇబ్బందులు తొలుగుతాయి. మానసికంగా కుదుటపడతారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. ఒక వ్యవహారంలో జోక్యం చేసుకోవాల్సి వస్తుంది. పనుల సానుకూలతకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. నూతన దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. గృహ నిర్మాణాలు వేగవంతమవుతాయి. నోటీసులు అందుకుంటారు. మంగళ, బుధవారాల్లో విలువైన వస్తువులు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. సాంకేతిక, వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. టెండర్లు, ఏజెన్సీలు చేజిక్కించుకుంటారు. అధికారులకు ధనప్రలోభం తగదు. దైవదీక్షలు స్వీకరిస్తారు. పరిచయాలు బలపడతాయి. ప్రయాణం ఉల్లాసంగా సాగుతుంది.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు.
కొన్ని పనులు అనుకోకుండా పూర్తి చేస్తారు. అనవసర విషయాల్లో జోక్యం తగదు. విందులు, వేడుకల్లో ఉల్లాసంగా గడుపుతారు. చిన్ననాటి పరిచయస్తుల కలయిక సంతృప్తినిస్తుంది. ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. ఖర్చులు విపరీతం. లౌక్యంగా బాకీలు వసూలు చేసుకోవాలి. గురు, శుక్రవారాల్లో ఆధిపత్యం ప్రదర్శించవద్దు. సంతానం చదువులపై శ్రద్ధ వహిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పెట్టుబడుల విషయంలో నిర్ణయానికి వస్తారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆకర్షణీయమైన పథకాలు రూపొందిస్తారు. మార్కెట్ రంగాల వారికి మార్పులు అనుకూలిస్తాయి. అధికారులకు కిందిస్థాయి సిబ్బందితో చికాకులు తప్పవు. ఉద్యోగస్తులకు ఓర్పు, ఏకాగ్రత ప్రధానం. వాహన చోదకులకు దూకుడు తగదు.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు. శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు.
ఆప్తుల హితవు మీ పై మంచి ప్రభావం చూపుతుంది. ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. కుటుంబ విషయాలపై శ్రద్ధ వహిస్తారు. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. కార్యసాధనకు ఓర్పు ప్రధానం. యత్నాలు మందకొడిగా సాగుతాయి. శనివారం నాడు ఆలోచనలతో మనస్థిమితం ఉండదు బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. నమ్మకస్తులే తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. పెట్టుబడులకు సమయం కాదు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. పదవుల నుంచి తప్పుకుంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. తీర్థయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు. వివాదాలు కొలిక్కివస్తాయి. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు.
మీనం : పూర్వాభాద్ర 4వ పాదం. ఉత్తరాభాద్ర, రేవతి.
ఒక వ్యవహారంలో పెద్దల జోక్యం అనివార్యం. కుటుంబీకుల ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆహ్వానం అందుకుంటారు. కీలక పత్రాలు జాగ్రత్త. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఖర్చులు అంచనాలను మించుతాయి. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. యత్నాలు సామాన్యంగా సాగుతాయి. ఆదివారం నాడు ప్రముఖుల కలయిక అనుకూలించదు. ఒకేసారి అనేక పనులతో సతమతమవుతారు. గృహ నిర్మాణాలు మందకొడిగా సాగుతాయి. విందులు, వినోదాల్లో అత్యుత్సాహం తగదు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటంకాలు, నష్టాలను అధిగమిస్తారు. పెట్టుబడులకు సమయం కాదు. ఉద్యోగ ప్రకటనల వల్ల ఏకాగ్రత వహించండి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి కలుగుతుంది. పుణ్యకార్యాలు చేస్తారు.