కలియుగ వైకుంఠం శ్రీవారి వేంకటేశ్వర ఆలయం తిరుమల తరహాలోనే దేశంలోని పలు ప్రాంతాల్లో టీటీడీ శ్రీవారి ఆలయాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా తమిళనాడులో నిర్మించే శ్రీవారి ఆలయానికి భక్తులు భూరి విరాళం అందజేశారు.
ఉలుందూరుపేలో నిర్మించే శ్రీవారి ఆలయానికి రూ.3.16 కోట్లతో పాటు రూ.20 కోట్ల విలువైన భూమిని విరాళంగా తమిళనాడు భక్తులు అందజేశారు. టీటీడీ పాలక మండలి సభ్యులు కుమారగురు ఆధ్వర్యంలో విరాళాన్ని భక్తులు అందజేశారు.
స్వర్ణ తిరుమల అతిథి గృహంలో శనివారం టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి విరాళ డీడీని పాలక మండలి సభ్యులు కుమారగురు అందించారు. ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ మాట్లాడుతూ, త్వరలో ఉల్లందూరుపేట, జమ్మూకశ్మీర్‌లో శ్రీవారి ఆలయాలు నిర్మిస్తామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.