Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పుష్యమి నక్షత్రాన పుట్టిన జాతకులకు..?

పుష్యమి నక్షత్రాన పుట్టిన జాతకులకు..?
, సోమవారం, 4 ఫిబ్రవరి 2019 (14:53 IST)
పుష్యమి నక్షత్రం నాలుగవ పాదంలో పుట్టిన జాతకులు జన్మించిన 5 సంవత్సరాల నుంచి నీలమును వెండితో పొదిగించుకుని మధ్య వ్రేలుకు ధరించగలరు. అలానే 5 సంవత్సరాల నుండి 22 సంవత్సరాల వరకు ఈ నక్షత్రంలో పుట్టిన జాతకులకు బుధ మహర్దశ కావున పచ్చను బంగారముతో చిటికెన వ్రేలుకు ధరించడం మంచిదని రత్నాలశాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. 
 
పుష్యమి నక్షత్రం, నాలుగవ పాదంలో పుట్టిన జాతకుల 22-29 సం.ల వరకు కేతు మహర్ధశ వైఢూర్యమును వెండితో చిటికెన వ్రేలుకు ధరించగలరు. 29-49 సం.లు వరకు శుక్ర మహర్దశ కావున వజ్రమును బంగారముతో ఉంగరపు వేలుకు ధరించగలరు. 49-55 సం.లు వరకు రవి మహర్దశ కావున కెంపును వెండిలో ఉంగరపు వేలుకు ధరించడం ద్వారా సుఖసంతోషాలు, ఆర్థిక వృద్ధి వంటి మంచి ఫలితాలుంటాయి.
 
అలాగే 55-65 సం.లు వరుకు చంద్ర మహర్ధశ కావున ముత్యమును వెండితో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించాలి. ఇంకా 65-72 సంవత్సరాల వరకు కుజ మహర్దశ కావున పగడమును బంగారముతో ఉంగరపు వేలుకు ధరించడం శుభప్రదమని రత్నాల శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తులసి మొక్కను నాటక పోతే.. ఏమవుతుంది..?