Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

11-06-17 రాశి ఫలాలు : ప్రేమికుల ఆలోచనలు ఇలా వుంటాయి...

భాగస్వామిక చర్చలు ప్రశాంతంగా ముగుస్తాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. పండ్లు, పూలు, కొబ్బరి, చల్లనిపానీయ, చిరు వ్యాపారులకు కలిసివస్తుంది. ప్రముఖుల ఇంట

11-06-17 రాశి ఫలాలు : ప్రేమికుల ఆలోచనలు ఇలా వుంటాయి...
, శనివారం, 10 జూన్ 2017 (17:22 IST)
మేషం:
భాగస్వామిక చర్చలు ప్రశాంతంగా ముగుస్తాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. పండ్లు, పూలు, కొబ్బరి, చల్లనిపానీయ, చిరు వ్యాపారులకు కలిసివస్తుంది. ప్రముఖుల ఇంటర్వ్యూల కోసం అధిక సమయం వేచి ఉండాల్సి వస్తుంది.
 
వృషభం:
విద్యుత్, ఏసీ, కూలర్లు, మెకానికల్ రంగాలలో వారికి పురోభివృద్ధి, సంతృప్తికానవస్తుంది. సమయానుకూలంగా మీరు తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. స్త్రీలకు అకాల భోజనం వలన ఆరోగ్యంలో చికాకులు తప్పవు. ముఖ్యుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. రావలసిన బకాయిలు వాయిదా పడతాయి. 
 
మిథునం:
చేసే పనిలో ఏకాగ్రత లోపం వల్ల చికాకులు ఎదుర్కొంటారు. ఆకస్మికంగా ఆరోగ్యంలో చికాకులు తలెత్తుతాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. వాహన చోదకులు, యజమానులు అప్రమత్తంగా ఉండాలి. క్రీడా రంగాల్లో వారికి ఒత్తిడి పెరుగుతుంది. మత్స్యు కోళ్ళ వ్యాపారస్తులకు ఇబ్బందులు వంటివి తలెత్తుతాయి. 
 
కర్కాటకం:
ఖర్చులు, ఇతరాత్రా అవసరాలు అధికంగా ఉంటాయి. వస్త్ర, బంగారు, వెండి లోహ వ్యాపారులకు పురోభివృద్ధి. మీ మాటతీరుతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. స్త్రీలు ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. గత అనుభవాలు జ్ఞప్తికి వస్తాయి. 
 
సింహం:
స్త్రీల అభిప్రాయాలకు స్పందన అంతంత మాత్రంగా ఉండటంతో ఒకింత నిరుత్సాహానికి లోనవుతారు. విద్యార్థులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. కుటుంబీకులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెళకువ అవసరం. మితిమీరిన ఆలోచనలు మీ మనస్సును వ్యాకులపరుస్తాయి. 
 
కన్య:
వృత్తిరీత్యా ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి, చుట్టుపక్కల వారికి ప్రోత్సాహం లభిస్తుంది. కుటుంబీకులతో కలిసి విందు, వినోదాల్లో పాల్గొంటారు. ఎదుటివారితో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు. మీ శ్రీమతి సలహా పాటించడం వల్ల ప్రయోజనం ఉంటుంది. 
 
తుల:
హోటల్, కేటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. పెద్దల ఆశీస్సులు, ప్రముఖుల ప్రశంసలు పొందుతారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో బాగుగా రాణిస్తారు. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయుయత్నాలు ఫలిస్తాయి. ఇప్పటివరకు మిమ్మల్ని అపార్థం చేసుకున్న వ్యక్తులు మీ సహాయం అర్థిస్తారు. 
 
వృశ్చికం:
ఫర్నీచర్ అమరికలకు అవసరమైన నిధులు సమకూర్చుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆత్మీయుల నుంచి అందిన ఆహ్వానం మిమ్మలను సందిగ్దానికి గురిచేస్తుంది. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. సాహస ప్రయత్నాలు విరమించండి. 
 
ధనస్సు:
బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. కొబ్బరి, పండ్లు, పూల, కూరగాయల వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. విద్యార్థులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. సంఘంలో గౌరవం లభిస్తుంది. పాత వస్తువులను కొనుగోలుచేయడం వల్ల ఇబ్బందులు పడతారు. 
 
మకరం:
వ్యాపారాలు, సంస్థల అభివృద్ధికి బాగా శ్రమించాలించాల్సి ఉంటుంది. ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. దీర్ఘకాలిక సమస్యలను నుంచి బయటపడతారు. దూర ప్రయాణాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్త్రీలు, షాపింగ్‌లో దుబారా ఖర్చులు ఎక్కువగా చేస్తారు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. 
 
కుంభం:
భాగస్వామిక సమావేశాల్లో కొత్త వ్యక్తుల పరిచయమవుతారు. స్త్రీలు అందరితో కలుపుగోలుతనంగా వ్యవహరించడం వల్ల సమస్యలు తలెత్తుతాయి. కాళ్లు, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొంటారు. బాల మిత్రులను కలుసుకుంటారు. ప్రయాణాల్లో ఒకింత అసౌకర్యానికి లోనవుతారు. 
 
మీనం:
ప్రేమికుల ఆలోచనలు పెడదారిపట్టే ఆస్కారం ఉంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించే ముందు అన్ని క్షుణ్ణంగా పరిశీలించండి. ఊహించని ఖర్చులు, చెల్లింపుల వల్ల స్వల్ప ఆటుపోట్లు తప్పవు. మీ అభిప్రాయం సున్నితంగా వ్యక్తం చేయడం శ్రేయస్కరం. మీ ప్రయాణం, కార్యక్రమాలు వాయిదా పడతాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాగదోషం ఎందుకు వస్తుంది? నాగదోషం చెడు ఫలితాలు ఏమిటి?