నాగదోషం ఎందుకు వస్తుంది? నాగదోషం చెడు ఫలితాలు ఏమిటి?
సర్పాలను హింసించడం వల్ల, చంపడం వల్ల నాగదోషం కలుగుతుంది. నాగ దోషమును ఎవరు ఏవిధంగానూ తీసివేయలేరు. నాగదోషం వల్ల సంక్రమించే చెడు ఫలితాలను కూడా అనుభవించక తప్పదు. ప్రత్యేకించి నాగదోషము వలన దరిద్రము, గర్భస్రావములు, అంగవైకల్య సంతానము, చర్మ రోగములు, తీవ్రమైన
సర్పాలను హింసించడం వల్ల, చంపడం వల్ల నాగదోషం కలుగుతుంది. నాగ దోషమును ఎవరు ఏవిధంగానూ తీసివేయలేరు. నాగదోషం వల్ల సంక్రమించే చెడు ఫలితాలను కూడా అనుభవించక తప్పదు. ప్రత్యేకించి నాగదోషము వలన దరిద్రము, గర్భస్రావములు, అంగవైకల్య సంతానము, చర్మ రోగములు, తీవ్రమైన కోపము, తీవ్ర మానసిక ఆందోళన, వెన్నుపూస, నరాల సంబంధ వ్యాధులు మొదలైన చెడు ఫలితాలు పొందవలసిన అగత్యము కలుగుతుంది.
దోష తీవ్రత తగ్గినప్పుడు చెడు ఫలితాలు కూడా తగ్గుతాయి. ఐతే ఈ దోష తీవ్రతను తగ్గించుకునేందుకు కొన్ని మార్గాలను అవలంభించాలి. శాంతి పూజల కోసం శ్రీశైలము, శ్రీకాళహస్తి వెళ్లవచ్చు. విశేష పూజలకు మాత్రం కర్నాటకలోని కుక్కి సుబ్రహ్మేణ్యేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లాలి.
అక్కడ పిండితో సర్పాకృతిని తయారు చేసి దానికి నాగదోష బాధితులతో పిండప్రదానము, శాంతి పూజలు చేయిస్తారు. ఎంతోమంది నాగదోష బాధితులు విశేష పలితాలు పొందినట్లు చెపుతారు.