Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

10-06-17 దిన ఫలాలు : వాతావరణ మార్పులతో ఆందోళన

కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి. భార్యాభర్తల మధ్య అవగాహన లేక చికాకులు ఎదుర్కొంటారు. ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాల విషయాల్లో మీ వ్యూహం ఫలిస్తుంది. ప్రేమికుల మధ్య చికాకులు తలెత్తుతాయి. ఉద్య

Advertiesment
Daily Horoscope
మేషం
కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి. భార్యాభర్తల మధ్య అవగాహన లేక చికాకులు ఎదుర్కొంటారు. ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాల విషయాల్లో మీ వ్యూహం ఫలిస్తుంది. ప్రేమికుల మధ్య చికాకులు తలెత్తుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతి, బదిలీ ఉత్తర్వులు చేతికందుతాయి. 
 
వృషభం
ఆర్థికస్థితి ఆశించిన విధంగా మెరుగుపడకపోవడంతో నిరుత్సాహం తప్పదు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. వ్యాపారాల్లో స్వల్ప ఆటంకాలు మినహా ఇబ్బందులు ఉండవు. రాజకీయ, కళలు, సినీ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. రుణాల కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. 
 
మిథునం 
వాతావరణంలోని మార్పు రైతులలో ఆందోళన కలిగిస్తుంది. వైద్య రంగాలలోని వారికి పురోభివృద్ధి. ఆకస్మికంగా ఆరోగ్యంలో చికాకులు తలెత్తుతాయి. స్త్రీల రచనలకు, కళాత్మతకు గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి. సంతానం విద్య విషయాలు, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తారు. దూర ప్రయాణాలపై ఒక నిర్ణయానికి వస్తారు. 
 
కర్కాటకం
పెద్దల ఆరోగ్యంలో మెళకువ వహించండి. ద్విచ్ర వాహనంపై దూర ప్రయాణాలు క్షేమం కాదు. సాహిత్య రంగాలలోని వారికి సంతృప్తికానవస్తుంది. వ్యాపారాల్లో స్వల్ప ఆటంకాలు మినహా ఇబ్బందులువుండవు. క్రయ విక్రయాలు ఊపందుకుంటాయి. రాబోయే ఖర్చులకు తగ్గట్టు ఆదాయం పెంచుకుంటారు. 
 
సింహం 
ప్రియతముల, చిన్నారుల వైఖరి మనస్థాపం కలిగిస్తుంది. వ్యాపారాల్లో స్వల్ప ఆటంకాలు మినహా ఇబ్బందులుండవు. ఉద్యోగస్తులు అధిక కృషి చేసి అధికారుల మెప్పు పొందుతారు. విదేశీయానాలకై చేయు యత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. హోటల్, కేటరింగ్ రంగాల్లోనివారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. 
 
కన్య
ఆడిట్, అకౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికంగా ఉంటాయి. స్త్రీలకు బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. రాజకీయాలలో వారు తొందరపడి వాగ్దానాలు చేయడం వల్ల సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. స్త్రీలు ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆకస్మికంగా ప్రయాణాలు అనుకూలిస్తాయి. 
 
తుల
స్త్రీలకు ఆరోగ్యభంగం, వైద్యసేవలు తప్పకపోవచ్చు. పొదువు పథకాలు, నూతన వ్యాపారాల దిశగా ఆలోచిస్తారు. ప్రేమికులకు మధ్య పెద్దల వల్ల సమస్యలు తలెత్తగలవు. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. మార్కెట్ రంగాల వారికి నిరుద్యోగులకు సదావకాశాలు లభిస్తాయి. 
 
వృశ్చికం
ఉమ్మడి వెంచర్లు, పెట్టుబడుల విషయంలో పునరాలోచన అవసరం. ఒక యత్నం ఫలించడంతో మీలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. ఎదుటివారితో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, ఒప్పందాల్లో మెళకువ వహించండి. దైవదర్శనాలకై చేయుయత్నాలు ఫలిస్తాయి. 
 
ధనస్సు
చిన్నతరహా, కుటీర పరిశ్రమలు, చిరు వ్యాపారులకు సామాన్యం. హామీలు, ఇతరులకు ధన సహాయం చేసే విషయంలో పునరాలోచన చాలా అవసరం. ఇతరుల ముందు మీ ఉన్నతిని చాటుకునే యత్నాలు విరమించండి. స్త్రీలకు అతి ఉత్సాహం వల్ల విలువైన వస్తువులు జారవిడుచుకునే ఆస్కారం ఉంది. 
 
మకరం 
విద్యుత్ వస్తువుల పట్ల ఏకాగ్రత చూపుతారు. ప్రముఖులను కలుసుకుంటారు. మీ కళత్ర మొండివైఖరి వల్ల కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. మిత్రుల ద్వారా సహాయ సహకారాలు అందుకుంటారు. ప్రణాళికాబద్ధంగా పని చేసి సత్ఫలితాలను పొందుతారు. అవివాహితుల్లో నూతనోత్సాహం చోటుచేసుకుంటుంది. 
 
కుంభం 
రాజకీయ రంగాల వారికి విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. మీ ఉన్నతిని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. 
 
మీనం 
ఆర్థిక విషయాల్లో అనుకోని ఇబ్బందులు ఎదురయ్యే సూచనలున్నాయి. కళాకారులకు టీవీ, నాటక రంగాల వారికి అవకాశాలు సద్వినియోగమగును. దైవ, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని అందరినీ ఆకట్టుకుంటారు. ఉద్యోగస్తులకు ప్రయాణాలలో ఎక్కువ చికాకులు ఇబ్బందులను ఎదుర్కొంటారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాలసర్ప దోషం అంటే ఏంటి? ఈ దోషం ఉంటే కలిగే లాభాలేంటి?