నవంబర్ 2025 నెలలో జరగబోయే ముఖ్యమైన గ్రహ సంచారాల కారణంగా ప్రత్యేకించి 5 రాశుల వారికి ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాశుల వారు కొన్ని పరిహారాలు పాటిస్తుంటే సమస్యలు పరిష్కారమవుతాయి. నవంబర్ 2025లో ముఖ్యంగా శుక్రుడు, బుధుడు, సూర్యుడు, కుజ గ్రహాలు రాశి మారడం ద్వారా ప్రధాన ప్రభావం కనిపిస్తుంది.
ఇప్పుడు చెప్పుకోబోయే 5 రాశుల వారికి నవంబర్ నెలలో కొన్ని సవాళ్లు లేదా ప్రతికూలతలు ఎదురుకావచ్చు. మేష రాశి వారికి ప్రత్యేకించి ఆరోగ్య సమస్యలు తలత్తే అవకాశం వుంది. వైవాహిక జీవితంలో చిన్నపాటి విభేదాలు రావచ్చు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఐతే సాధారణ పరిహారాలు పాటించడం ద్వారా గ్రహాల నుంచి వచ్చే ప్రతికూల శక్తిని తగ్గించుకోవచ్చు. ఆరోగ్యం కుదుటపడేందుకు, సంబంధాలు బలపడేందుకు ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసా పఠిస్తుండాలి. సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి.
మిథున రాశి వారికి పనిలో ఒత్తిడి, మానసిక ఆందోళన పెరగవచ్చు. ఆర్థికంగా నిలకడ లోపించవచ్చు. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త అవసరం వుంది. మానసిక ప్రశాంతత కోసం ప్రతి బుధవారం విష్ణు సహస్రనామం పఠించాలి. ఆకుపచ్చ రంగు వస్తువులను దానం చేయాలి. గణపతి పూజ చేయడం శుభకరం.
కన్యా రాశివారికి అదృష్టం అంతగా సహకరించకపోవచ్చు. వృత్తిపరంగా ఎక్కువ కృషి చేయాల్సి వస్తుంది. ఆర్థిక లావాదేవీలలో అప్రమత్తంగా ఉండాలి. విజయం, ఆర్థిక స్థిరత్వం కోసం ప్రతి బుధవారం గోవుకు పచ్చ గడ్డి లేదా ఆహారం పెడుతుండాలి. దుర్గాదేవి స్తోత్రాలు పఠించడం అదృష్టాన్ని పెంచుతుంది.
ధనుస్సు రాశి వారికి నవంబరులో అనవసర ఖర్చులు, నష్టాలు పెరగవచ్చు. దూర ప్రయాణాల వల్ల లాభం ఉండదు. శ్రమకు తగిన ఫలితం లభించకపోవచ్చు. ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రతి గురువారం విష్ణుమూర్తిని పసుపు పువ్వులతో పూజించాలి. పేదలకు పసుపు రంగు వస్త్రాలు, శనగలు దానం చేయాలి.
కుంభ రాశి వారికి వృత్తిపరంగా కొన్ని అడ్డంకులు, పనుల్లో ఆలస్యం కావచ్చు. ఆరోగ్య సమస్యలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి. సహోద్యోగులతో విభేదాలు తలెత్తే అవకాశం వుంది. వృత్తిపరమైన అడ్డంకులను తొలగించుకోవడం కోసం ప్రతి శనివారం శనీశ్వరుడిని ఆరాధిస్తుండాలి. నువ్వుల నూనెతో దీపం వెలిగించి, పేదలకు నల్లని వస్తువులను దానం చేయడం శుభకరం.
కార్తీక మాసం కాబట్టి, ప్రతి ఒక్కరూ ఉదయాన్నే దీపారాధన చేసి, పరమేశ్వరుడిని, విష్ణువులను పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి.
గమనిక: ఈ ఫలితాలు సాధారణ జ్యోతిష్య అంచనాలు మాత్రమే. మీ వ్యక్తిగత జాతకం, ప్రస్తుత గ్రహ స్థితులను బట్టి ఫలితాలు మారవచ్చు.