Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మాస శివరాత్రి, ప్రదోషం ఒకే రోజు వస్తే.. ఇలా పూజ చేయాలట..!

Advertiesment
Lord Shiva
మాస శివరాత్రి ప్రతి నెలా పరమశివుని ఆరాధించడానికి ఒక పవిత్రమైన రోజు. ప్రదోషం కూడా శివారాధనకు అనుకూలమైన రోజు. ఈ రెండూ కలిసిన రోజున శివుని పూజించడం విశేష ఫలితాలను ఇస్తుంది. సమస్త దోషాలను సమస్యలను ఇది దూరం చేస్తుంది. 
 
ప్రతినెలా షష్ఠి, ఏకాదశి లాగా శివరాత్రి వస్తుంది. ఇది పరమశివుని ఆరాధించడానికి అనుకూలమైన రోజు. ఈ రోజున భక్తులు శివరాత్రి ఉపవాసం ఉండి శివుని పూజిస్తారు. శివనామాలు పఠిస్తారు. రేపు అంటే బుధవారం పూట 17.5.2023 మాస శివరాత్రి. ఈ పవిత్రమైన రోజున ఉదయం, సాయంత్రం శివునిని పూజించండి. పాశురాలు చదవండి. 
 
అలాగే ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ప్రదోషం వస్తుంది. ప్రదోష అమావాస్యకు మూడు రోజుల ముందు, పౌర్ణమికి మూడు రోజుల ముందు వస్తుంది. ఈ రోజున ఉపవాసం ఉండి శివుడిని పూజించడం, గోవులకు ఆహారం ఇవ్వడం చాలా మంచిది.
 
బుధవారం శివుడికి అనుకూలమైన శివరాత్రి కావడం, అదే రోజున శివుడికి అనుకూలమైన ప్రదోషం జరగడం అదనపు ప్రత్యేకత. అందుచేత ఆలయాల్లో జరిగే అభిషేకాలు, ఆరాధనలో పాల్గొనాలి. ఇంకా ఈ రోజు నలుగురికీ పెరుగు ప్యాకెట్ దానంగా ఇవ్వండి. 
 
ఇంట్లో దీపం వెలిగించి కుటుంబ సమేతంగా పూజలు చేయండి. చక్కెర పొంగల్ నైవేద్యంగా సమర్పిస్తే ఆర్థిక ఇబ్బందులు, ఈతిబాధలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

16-05-2023 మంగళవారం రాశిఫలాలు - ఆంజనేయస్వామిని ఆరాధించడంవల్ల శుభం