Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శివునికి, కుమార స్వామికి 11 వారాల పాటు.. ఎర్ర గులాబీలను..?

శివునికి, కుమార స్వామికి 11 వారాల పాటు.. ఎర్ర గులాబీలను..?
, బుధవారం, 9 ఆగస్టు 2023 (13:49 IST)
శివునికి, కుమార స్వామికి 11 వారాల పాటు ఈ పువ్వులను సమర్పించుకుంటే అడ్డంకులు తొలగిపోతాయి. కొందరైతే తాము ఏది ప్రారంభించినా మొదటి అడుగులోనే విజయం సాధించాలని అనుకుంటారు. అయితే ఏ కార్యమైనా మొదటి నుంచీ విజయవంతమవుతుందనే ఆలోచన మనలో పెరగకూడదు. 
 
అపజయం అనే చేదును రుచి చూసినప్పుడే గెలుపులోని మాధుర్యం నిలిచి ఉంటుందనడంలో సందేహం లేదు. దేవుడు కొన్నిసార్లు మన ధైర్యాన్ని పరీక్షించడంలో విఫలం కావచ్చు. అపజయానికి భయపడని వారికి విజయాన్ని అందించాలని భావించవచ్చు. కాబట్టి, అపజయానికి భయపడకుండా, విజయపథం వైపు పయనించే ప్రతి ఒక్కరూ జీవితంలో విజయం సాధిస్తారని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 
 
జీవితంలో గెలుపు పొందాలంటే.. శివునికి, కుమార స్వామికి ప్రీతికరమైన పువ్వులను 11 వారాలు సమర్పించాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. ప్రతి ఒక్కరికీ విజయాన్ని అందించే పువ్వు ఎర్ర గులాబీ. ఈ పువ్వుతో శివుడిని ఏ రోజైనా పూజించవచ్చు. అది మనకు మంచి ఫలితాలనిస్తుంది. 
 
ఇలా 11 వారాల పాటు ఎర్రని గులాబీ పువ్వులతో శివునికి కుమార స్వామికి అర్చన చేసిన వారికి నిర్ధిష్ట వారాల్లో ఫలితం పొందుతారు. సంతానం లేని వారు 11 వారాల పాటు నిరంతరం ఈ పువ్వును కుమార స్వామికి సమర్పించి, సంతానం కోసం ప్రార్థిస్తే, వారు ఖచ్చితంగా సంతానం పొందుతారని విశ్వాసం. ముఖ్యంగా శుక్రవారాల్లో కుమార స్వామికి ఈ పుష్పాన్ని సమర్పించడం చాలా ప్రత్యేకం. 
 
సంతానం కోసమే కాకుండా మనసులో ఏది కోరుకుంటే అది తప్పకుండా నెరవేరాలంటే.. ఎర్రని గులాబీలతో అర్చన చేయాల్సిందే అంటున్నారు ఆధ్యాత్మిక నిపుణులు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

09-08-2023 బుధవారం రాశిఫలాలు - మీ నైపుణ్యతకు, సామార్థ్యానికి తగినటువంటి గుర్తింపు...