సుప్రసిద్ధ మోక్ష క్షేత్రం కాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో భైరవునికి అధిక ప్రాధాన్యత వుంది. కాలభైరవుడే వారణాసికి రక్షకుడిగా వుంటాడు. శనీశ్వరునికి గురువుగా కాలభైరవుడు పరిగణింపబడుతాడు. శనీశ్వరుడు, సూర్యుడి పుత్రునిగా యమధర్మ రాజుచే అవమానించబడి.. అపకీర్తిని మూటగట్టుకున్నాడు.
ఆయన తల్లి ఛాయాదేవి సలహా మేరకు భైరవుడిని ఆరాధించడం ద్వారా, కాలభైరవుడిని పూజించడం ద్వారా నవగ్రహాల్లో శనీశ్వరుని ఒక పదవి లభించింది. అందుచేత కాలభైరవుడు శనీశ్వరునికి గురువుగా పరిగణింపబడుతాడు.
అలాంటి కాలభైరవునికి శివుడు ఇచ్చిన హోదా ఏంటంటే?
శివునిని కొలిచే భక్తులకు కాలభైరవుని అనుగ్రహం లభిస్తుంది. కాలభైరవునిని పూజించే వారికి ఎలాంటి ఈతిబాధలువుండవని పరమేశ్వరుడు వరమిచ్చాడు. పూర్వం శివాలయాలను రాత్రి మూసివేశాక.. ఆ ఆలయ తాళాలను కాలభైరవుని పాదాల చెంత వుంచుతారట. అలా కాలభైరవుడు ఆలయ సంరక్షకుడిగా వుంటాడని విశ్వాసం.
మిరియాల దీప పరిహారం..
కాలభైరవుని ఆలయంలో దీపాన్ని వెలిగించడం ద్వారా దీర్ఘకాలిక ఈతిబాధలు, ఆర్థిక ఇబ్బందులు వుండవు. అలాగే మిరియాలను ఓ తెలుపు బట్టలో కట్టి.. (శనీశ్వరునికి వెలిగించే నువ్వుల దీపంలా).. నువ్వుల నూనెతో దీపమెలిగిస్తే.. సకల దోషాలు తొలగిపోతాయి.
ఇంకా భైరవునికి ఎరుపు రంగుతో కూడిన పుష్పాలను సమర్పించడం ద్వారా ఈతిబాధలుండవు. అసాధ్యమనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. శత్రుభయం వుండదని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.