Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆ వారాల్లో బల్లులు కింద పడితే.. ఏమవుతుంది..?

ఆ వారాల్లో బల్లులు కింద పడితే.. ఏమవుతుంది..?
, శుక్రవారం, 8 మార్చి 2019 (15:19 IST)
సాధారణంగా ప్రతి ఇంట్లో గోడలపై బల్లులు పాకుతా ఉంటాయి. ఈ బల్లులు గోడలపై ఉండే తినటానికి ప్రాకులాడే బల్లి ఎప్పుడైనా కింద పడటం సహజం. ప్రమాదవశాత్తు బల్లినితాకినా, అది మీదపడినా వెంటనే స్నానం చేస్తే ఆ దోషం పరిహారం కాగలుతుంది.

అలాగే కాంచీపురమనే క్షేత్రంలో గల వెండిబల్లిని, బంగారు బల్లిని పూజించిన వచ్చిన ఆ తర్వాత బల్లి వల్ల కలిగే దోషాలు అంటవంటుంటారు. మరికొందరు బల్లి పడిన వెంటనే ఆ ప్రకారంగా కాంచీపురంలో బల్లుల్ని పూజించి వచ్చిన వారికి తాకుతుంటారని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
ఇంటి మధ్యభాగంలో గురు, శుక్రవారాలు మినహా మిగిలిన ఏ వారంలోనైనా బల్లి క్రిందపడినా, పలికినా చాలా శ్రేయస్కరం కార్యసిద్ధి. ఇంటిలోని తూర్పుభాగంలో ఆది, గురువారాలు మినహా మిగతా అన్ని వారాల్లో బల్లిపడటం, పలకటం శుభప్రదం. ధనలాభం కలుగుతుంది. 
 
ఈ విధంగానే ఆది, సోమవారాలు మినహా ఇంట్లో ఆగ్నేయ భాగంలో ఈ శకునం కలిగిన నూతన వస్తులాభం, బంధువుల రాక, సోమ, మంగళ బుధవారాలు తప్ప మిగిలిన వారాలలో దక్షిణదిక్కునందు కలిగిన సుఖం, భూషణ ప్రాప్తి, సోమ, మంగళ, బుధ, శనివారాలు మినహా వారాల్లో నైరుతి దిక్కుగా శకునం కలిగినట్లైతే సర్వకారకసిద్ధి, బంధు దర్శనం కలుగును. 
 
ఆది, బుధ, గురువారాలు కాక మిగిలిన వారాలలో ఇంట్లో పడమర దిక్కుగా శకునం కలిగిన అనుకూలత్వం, నూతనవస్త్రప్రాప్తి, సోమ, బుధ, శుక్రవారాలు తప్ప మిగిలిన వారాల్లో ఇంట్లో వాయువ్య దిక్కునందు శకునం కలిగినట్లైతే శుభవార్తలు, స్త్రీ సల్లాపం, ఆనందం కలుగును.
 
ఆది, మంగళ, గురు, శుక్రవారాలు కాక మిగిలిన వారాల్లో ఇంట్లో ఉత్తరదిక్కుగా శకునం కలిగిన సుఖము, లాభము, ప్రియవార్తలు వినుట జరుగును. బుధ, శుక్ర, శనివారాలు మినహా మిగిలిన వారాల్లో ఇంట్లోని ఈశాన్య భాగంలో శకునం కలిగిన యెడల లాభము, వాహనప్రాప్తి, కలిసివచ్చుట జరుగును. ఇంటికి పైభాగంలో బల్లి పలుకు వినిపించిన యెడల (సోమ, గురువారాలు కాక) జయము, ప్రయాణము, శుభము అనునవి జరుగగలవని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈ పటాన్ని పూజ గదిలో ఉంచుకోవచ్చా..?