Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శుభోదయం : రాశిఫలితాలు 29-10-2017

మేషం: పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. స్త్రీల ప్రతిభా పాటవాలకు ప్రోత్సాహం లభిస్తుంది. మిత్రులతో సంభాషించేటప్పుడు సంయమనం పాటించడం మంచిది. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి.

Advertiesment
Daily prediction
, ఆదివారం, 29 అక్టోబరు 2017 (06:02 IST)
మేషం: పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. స్త్రీల ప్రతిభా పాటవాలకు ప్రోత్సాహం లభిస్తుంది. మిత్రులతో సంభాషించేటప్పుడు సంయమనం పాటించడం మంచిది. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. వృత్తి, వ్యాపారాలు ప్రశాంతంగా సాగుతాయి. చిన్ననాటి వ్యక్తుల రాక ఆశ్చర్యం కలిగిస్తుంది.
 
వృషభం: మత్స్య, కోళ్ళ, గొర్రెల వ్యాపారస్తులకు కలిసిరాగలదు. ఆత్మీయులు దూరమవుతున్నారే భావం నిరుత్సాహం కలిగిస్తుంది. విద్యార్థులకు హడావుడి, తొందరపాటు తగదు. ఒప్పందాలు, ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో ఏకాగ్రత అవసరం. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లు అనుకూలించవు.
 
మిథునం: వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. నిరుద్యోగులకు పోటీ పరీక్షల్లో, ఇంటర్వ్యూల్లో నిరాశ తప్పదు. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయు యత్నాలు ఫలిస్తాయి. స్త్రీలకు టీవీ ఛానెళ్ల నుంచి ఆహ్వానం అందుతుంది.
 
కర్కాటకం: నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. సభలు, సమావేశాల్లో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. స్థిరాస్తుల కొనుగోళ్ళపై దృష్టి సారిస్తారు. స్త్రీలకు నరాలు, దంతాలు, రుతు సంబంధిత చికాకులు అధికం.
 
సింహం: కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకం. తొందరపాటు నిర్ణయం వల్ల వ్యవహారం బెడసికొట్టే ఆస్కారం ఉంది. విదేశాల్లోని ఆత్మీయులతో సంభాషిస్తారు. ఏ యత్నం కలిసిరాక నిరుద్యోగులు అనుక్షణం అశాంతికి లోనవుతారు. కళాకారులకు, రచయితలకు పత్రికా రంగాల్లో వారికి అనుకూలమైన కాలం.
 
కన్య: రాజకీయ నాయకులకు పదవీ సమస్యలు అధికమవుతాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. రాబోయే అవసరాలకు కావలసిన ధనం సర్దుబాటు చేసుకుంటారు. హోటల్ వారికి పనిభారం అధికమవుతుంది. అలవాటు లేని పనులు, అవగాహన లేని విషయాలకు దూరంగా ఉండాలి.
 
తుల: రేషన్ డీలర్లకు చికాకులు తప్పవు. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. మీ అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. పాత వస్తువులను కొని  ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. బంధుమిత్రులతో కలిసి ఆలయాలను సందర్శిస్తారు.
 
వృశ్చికం: కుటుంబ సభ్యులతో కలిసి వేడుకల్లో పాల్గొంటారు. ఎవరికైనా ధన సహాయం చేసినా తిరిగిరాజాలదు. రిప్రజెంటటేటివ్‌లు తమ టార్గెట్లను అతికష్టంమీద ఆలస్యంగానైనా పూర్తి చేస్తారు. విందుల్లో పరిమితి పాటించడం చాలా అవసరం. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనల పట్ల అప్రమత్తత అవసరం.
 
ధనస్సు: పరస్త్రీలతో అధికంగా సంభాషించడం మంచిదికాదు. మందుచూపుతో వ్యవహరించడం మంచిది. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. శత్రువులు మిత్రులుగా మారి సహకారం అందిస్తారు. విలువైన కానుకలు అందించి ప్రముఖులను ఆకట్టుకుంటారు. ఎంతటి  పనినైనా పట్టుదలతో పూర్తి చేస్తారు.
 
మకరం: స్త్రీలకు కాళ్లు, తల, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. ఓర్పు, పట్టుదలతో శ్రమించి అనుకున్న పనులు పూర్తి చేస్తారు. వాతావరణంలోని మార్పు వ్యవసాయదారులకు ఆందోళన కలిగిస్తుంది. దూర ప్రయాణాల్లో అసౌకర్యానికి గురవుతారు. విద్యుత్ రంగాల వారికి పనిలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు.
 
కుంభం: ప్రముఖులను కలుసుకుంటారు. ఎదుటివారిని గమనించి ఎత్తుకు పై ఎత్తువేయడం వల్ల గుర్తింపు, రాణింపు లభిస్తుంది. స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. రేపటి కార్యక్రమాల గురించి ఈ రోజే ఆలోచించి క్రియారూపంలో పెట్టండి. ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభమవుతాయి.
 
మీనం: ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. ఆకస్మికంగా ప్రయాణాలు విరమించుకుంటారు. పెద్దల ఆరోగ్యములో మెళకువ అవసరం. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సి వస్తుంది. విద్యార్థులు ఇతరుల వాహనం నడిపి ఇబ్బందులకు గురికాకండి. `

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కార్తీక మాసంలో నదీ స్నానం చేయడంలో ఆంతర్యం ఏమిటో తెలుసా?