శుభోదయం : ఈ రోజు రాశి ఫలితాలు 15-10-17
మేషం : ఈ రోజు నమ్మి మోసపోయే ఆస్కారం ఉంది. దైవదీక్షలు స్వీకరిస్తారు. సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయండి. ప్రయాణం కలిసివస్తుంది. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. ఉద్యోగ, వ్యాపారులకు
మేషం : ఈ రోజు నమ్మి మోసపోయే ఆస్కారం ఉంది. దైవదీక్షలు స్వీకరిస్తారు. సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయండి. ప్రయాణం కలిసివస్తుంది. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. ఉద్యోగ, వ్యాపారులకు అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. మిమ్మలను పొగిడే వారే కానీ సహకరించే వారుండరు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవం.
వృషభం : ఈ రోజు ప్రస్తుత వ్యాపారాలే కొనసాగించండి. వృత్తుల వారికి ప్రజాసంబంధాలు బలపడతాయి. ఉద్యోగబాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి.కొన్ని సమస్యలు చిన్నవే అయినా మనశ్శాంతి దూరం చేస్తారు. రుణ యత్నాలలో ఆటంకాలు తొలగిపోయి రావలసిన ధనం చేతికందుతుంది. దుబారా ఖర్చులు విపరీతం. పొదుపు చేయాలన్న ఆలోచన ఫలించదు.
మిథునం : ఈ రోజు ఒక వ్యవహారంలో ధనం అందుతుంది. ఖర్చులు భారమనిపించవు. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. వేడుకలను ఘనంగా చేస్తారు. మీ అతిథి మర్యాదలు ఆకట్టుకుంటాయి. జూదాల్లో ధననష్టం, చికాకులు ఎదుర్కొంటారు. అత్యవసరంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార వర్గాల వారి మాటతీరు, స్కీములు కొనుగోలుదార్లను ఆకట్టుకుంటాయి.
కర్కాటకం : ఈ రోజు వాగ్వాదాలకు దూరంగా ఉండాలి. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు ఆశాదృక్పథంతో యత్నాలు సాగించండి. మీ కృషి త్వలోనే ఫలిస్తుంది. ప్రశంసలు, సత్కారాలు అందుకుంటారు. అధికారులకు ధన ప్రలోభం తగదు. నిరుత్సాహం వీడి ఉద్యోగయత్నం సాగించండి. ప్రకటనలను విశ్వసించవద్దు. ప్రత్యర్థులతో జాగ్రత్త. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు.
సింహం : ఈ రోజు పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. అనుకున్న పనులు ఆలస్యమైనా కంగారు పడకండి. స్త్రీలు, దైవ దర్శనాల్లో చురుకుగా పాల్గొంటారు. సాధ్యంకాని హమీలివ్వొద్దు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఆర్థిక లావాదేవీలతో తీరిక ఉండదు. ధనమూలక సమస్యలెదుర్కొంటారు. ఒక సంఘటన ఆందోళన కలిగిస్తుంది. ప్రకటనల పట్ల అవగాహన ప్రధానం.
కన్య : ఈ రోజు మీరంటే అందరికీ గౌరవం ఏర్పడతుంది. ఎదుటివారి తీరును గమనించి మెలగవలసి ఉంటుంది. కష్టసమయంలో సన్నిహితులకు అండగా నిలుస్తారు. వ్యాపారాల్లో నిలదొక్కుకుంటారు. పెట్టుబడులకు అనుకూలం. వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. రుణ విమక్తులవుతారు. యత్నాలకు పరిస్థితులు అనుకూలిస్తాయి.
తుల : ఈ రోజు ఆరోగ్యం, సంతానం భవిష్యత్ పట్ల శ్రద్ధ అవసరం. విమర్శలకు ధీటుగా స్పందిస్తారు. కొత్త సమస్యలు తలెత్తే సూచనలున్నాయి. అప్రమత్తంగా వ్యవహరించాలి. స్థిరాస్తి క్రయవిక్రయాలు అనుకూలిస్తాయి. కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు చేపట్టిన పనులలో ఏకాగ్రత అవసరం. ప్రతి విషయంలోనూ బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. అధికారులకు హోదాలో మార్పు.
వృశ్చికం : ఈ రోజు రవాణా, ఎగుమతి, ట్రాన్స్‌పోర్ట్ రంగాల వారికి సామాన్యం. స్త్రీల స్వీయ అర్జన పట్ల ఆసక్తి పెరుగుతుంది. దూర ప్రయాణాలలో వస్తువుల పట్ల మెళకువ అవసరం. వస్త్ర, బంగారం, వెండి, వ్యాపారులకు పురోభివృద్ధి. శ్రీవారు, శ్రీమతి గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించే పరిణామాలు ఎదుర్కొంటారు. ఆపత్సమయంలో మిత్రులకు అండగా నిలుస్తారు.
ధనస్సు : ఈ రోజు ఆర్థికంగా పురోగమిస్తారు. రుణబాధలు తొలగుతాయి. ఖర్చులు అధికం. ప్రయోజనకరం. వేడుకల్లో పాల్గొంటారు. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. విద్యార్థుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. బ్యాంకింగ్ వ్యవహారాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల మెలకువ వహించండి. రిప్రజెంటేటివ్‌లు, ఏజెంట్ల శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది.
మకరం : ఈ రోజు శంకుస్థాపనలకు అనుకూలం. పనుల సానుకూలతకు మరింతగా శ్రమించాలి. ఆహ్వానం కీలక పత్రాలు అందుకుంటారు. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి నెలకొంటుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. భాగస్వామిక చర్చల్లో పాల్గొంటారు. దంపతుల మధ్య పలు విషయాలు చర్చకు వస్తాయి. చిరు వ్యాపారులకు కలిసిరాగలదు.
కుంభం : ఈ రోజు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. వ్యాపారాభివృద్ధికి మరింతగా శ్రమించాలి. మీ పథకాలు, ప్రణాళికలు సామాన్య ఫలితాలే ఇస్తాయి. ప్రముఖుల ఇంటర్వ్యూ అనుకూలించి మీ పనులు సానుకూలమవుతాయి. పెద్దమొత్తం నగదు సాయం క్షేమం కాదు. ఆత్మీయుల సలహా పాటించండి. మీ తప్పిదాలను సరిదిద్దుకోండి. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. ఆదాయం సంతృప్తికరం.
మీనం : ఈ రోజు ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వృత్తుల వారికి ప్రజా సంబంధాలు బలపడతాయి. అధికారులకు ధనప్రలోభం తగదు. ఒక సంఘటన ఆందోళన కలిగిస్తుంది. సౌమ్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. వ్యాపారాల్లో ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు. పెట్టుబడుల విషయంలో తొందరపాటుతగదు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుటారు. పెద్దమొత్తం సరకు నిల్వలో జాగ్రత్త.