నాగుల చవితి అక్టోబర్ 25 శనివారం వచ్చింది. నాగుల చవితి, నాగుల పంచమి రోజు నాగేంద్రుడిని పూజించే వారికి సకల రోగాల నుంచి విముక్తి లభిస్తుంది. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. పుట్టతో పోల్చే మనిషి శరీరానికి నవరంధ్రాలుంటాయి. నాడులతో నిండిన వెన్నెముకను వెన్నుపాము అని పిలుస్తారు.
మూలాధారచక్రంలో కుండలినీ శక్తి పాము ఆకారంలో ఉంటుందని యోగశాస్త్రంలో ఉంది. ఇది మనిషిలో కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే విషాన్ని కక్కుతూ సత్వగుణాన్ని హరించేస్తుంది. అందుకే నాగుల చవితి రోజు విష సర్పాన్ని ఆరాధిస్తే మనిషిలో ఈ విషం తొలగిపోతుందని విశ్వాసం.
జ్యోతిష్య శాస్త్రపరంగా కుజుడు, రాహువు దోషాలున్నవారు, సంసారిక బాధలున్నవారు... పుట్టలో పాలు పోస్తే ఆ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని చెబుతారు.
అక్టోబర్ 24 శుక్రవారం రాత్రి 10 గంటల 1 నిముషం నుంచి చవితి ఘడియలు ప్రారంభమయ్యాయి
అక్టోబర్ 25 శనివారం రాత్రి 12 గంటల 3 నిముషాల వరకూ చవితి ఘడియలున్నాయి
నాగులచవితి రోజున ఈ శ్లోకం పఠిస్తే కలిదోష నివారణ అవుతుంది
కర్కోటకస్య నాగస్య దయయంత్యా నలస్య చ |
ఋతుపర్ణస్య రాజర్షే : కీర్తనం కలినాశనమ్ ||