Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

01-11-2018 నుండి 30-11-2018 వరకు మీ మాస రాశిఫలితాలు

Advertiesment
01-11-2018 నుండి 30-11-2018 వరకు మీ మాస రాశిఫలితాలు
, గురువారం, 1 నవంబరు 2018 (09:49 IST)
6వ తేదీ కుజుడు కుంభం నందు, 16వ తేదీ రవి వృశ్చికం నందు ప్రవేశం. 16వ తేదీ శుక్రునికి వక్రత్యాగం. 17వ తేదీ నుండి బుధునికి వక్రం ప్రారంభం. 6వ తేదీ నరకచతుర్థశి, మాసశివరాత్రి, 7వ తేదీ దీపావళి, కేదార గౌరీవ్రతం. 8వ తేదీ ఆకాశదీపం, 9వ తేదీ భగినీ హస్త భోజనం, 11వ తేదీ నాగుల చవితి, 12వ తేదీ నాగపంచమి, గురుమౌఢ్యమి ప్రారంభం. 20వ తేదీ క్షీరాబ్ది ద్వాదశి, 23వ తేదీ కార్తీక పౌర్ణమి, 26వ తేదీ సంకటహరచతుర్థి.
 
మేషరాశి: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
గృహమార్పు ఏమంత ఫలితాన్నీయదు. మనోధైర్యంతో యత్నాలు సాగించండి. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. ఆర్థికస్థితి సామాన్యం ఏ పురోగతి లేక నిరుత్సాహం చెందుతారు. ఖర్చులు అదుపులో ఉండవు. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి ఉంటుంది. ఆత్మీయుల హితవు మీపై చక్కని ప్రభావం చూపుతుంది. దైవదీక్షలు స్వీకరిస్తారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. సంతానం దూకుడు అదుపు చేయండి. ఊహించని సంఘటన లెదురవుతాయి. అయినవారితో సంప్రదింపులు జరుపుతారు. వ్యాపారులు సామాన్యంగా సాగుతాయి. పెద్దమెుత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రాధానం. అధికారులకు ఒత్తిడి, పనిభారం. వేడుకలు, మనసమారాధనల్లో పాల్గొంటారు.  
 
వృషభరాశి: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
ఈ మాసం ప్రతికూలతలే అధికం. పెట్టుబడులకు తరుణం కాదు. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. కార్యక్రమాలు వాయిదా పడుతాయి. అప్రమత్తంగా వ్యవహరించాలి. సంప్రదింపులు కొత్త పలుపు తిరుగుతాయి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం నిరుత్సాహపరుస్తుంది. ఖర్చులు విపరీతం. రుణాలు, చేబదుళ్లు తప్పవు. ఆరోగ్యంగ జాగ్రత్త. మీ శ్రీమతి వైఖరిలో మార్పు సంభవం. వాయిదా పడుతూ వస్తున్న పనులు పూర్తి కాగలవు. సంతానం విజయం సంతోషాన్నిస్తుంది. దైవకార్యం, వనసమారాధనల్లో పాల్గొంటారు. వ్యాపారులు లాభసాటిగా సాగుతాయి. నష్టాలు భర్తీ చేసుకుంటారు. వృత్తుల వారికి సామాన్యం. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. ఆస్తి వివాదాలు జటిలమవుతాయి. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.  
 
మిధునరాశి: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
శుభకార్యం నిశ్చయమవుతుంది. వివాహ వేదికలు అన్వేషిస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంద. పనులు సానుకూలమవుతాయి. వ్యవహార దక్షతతో రాణిస్తారు. ధనలాభం ఉంది. సన్నిహితులకు చేయూతనిస్తారు. గృహంలో సందడి నెలకొంటుంది. విలాసాలకు వ్యయం చేస్తారు. పెద్దల ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. అనవసర జోక్యం తగదు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. సంతానం భవిష్యత్తుపై దృష్టి సారిస్తారు. పెట్టుబడులకు అనుకూలం. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. యాదృచ్ఛికంగా తప్పిదాలు జరుగవచ్చు. దైవదీక్షల, సభ్యత్వాలు స్వీకరిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వేడుకలు, మనసమారాధనల్లో పాల్గొంటారు.  
 
కర్కాటకరాశి: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఖర్చులు అంచనాలను మించుతాయి. చేతిలో ధనం నిలబడదు. పొదుపు మూలకధనం గ్రహిస్తారు. చెల్లింపుల్లో జాగ్రత్త. వ్యవహారాలు ముందుకు సాగవు. ఓర్పుతో యత్నాలు సాగించండి. అవకాశాలను వదులుకోవద్దు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ శ్రీమతి వైఖరి అసహానం కలిగిస్తుంది. సౌమ్మంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. ఆత్మీయుల సలహా పాటించండి. వ్యాపారాభివృద్ధఇకి ప్రణాళికలు రూపొందిస్తారు. చిరువ్యాపారులకు సామాన్యం. వృత్తుల వారికి జనసంబంధాలు విస్తరిస్తాయి. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆస్తి వివాదాలు కొలిక్కిరాగలవు.  
 
సింహరాశి: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
గృహం ప్రశాంతంగా ఉంటుంది. వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. ఆర్థికంగా బాగుంటుంది. రుణ బాధలు తొలుగుతాయి. తాకట్టు వస్తువులు విడిపించుకుంటారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. పనులు వేగవంతమవుతాయి. పరిచయాలు, వ్యాపకాలు విస్తరిస్తాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. పెట్టుబడులు లాభిస్తాయి. దైవ దీక్షలు స్వీకరిస్తారు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవం. వ్యవహారాలను సమర్థంగా నిర్వహిస్తారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు సాదర వీడ్కోలు పలుకుతారు. విందులు, వినోదాల్లో అత్యుత్సాహం తగదు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. 
 
కన్యరాశి: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
అన్నిరంగాల వారికీ యోగదాయకమే. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. సంస్థల స్థాపనలకు వనరులు సర్దుబాటవుతాయి. ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. దీక్షలు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. ఆదాయం సంతృప్తికరం. ఖర్చులు భారమనిపించవు. విలువైన వస్తువులు అమర్చుకుంటారు. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు. అవివాహితుల్లో ఉత్సాహం నెలకొంటుంది. సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయండి. వేడుకలకు హాజరవుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. న్యాయ, వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. కళా, క్రీడాకారులకు ప్రోత్సాహకరం. 
 
తులారాశి: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. సన్నిహితులకు సాయం అందిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్పురిస్తాయి. సంప్రదింపులకు అనుకూలం. వ్యవహార దక్షతతో రాణిస్తారు. అనుకూల పరిస్థితులున్నాయి. పదవులు, బాధ్యతలు స్వీకరిస్తారు. గృహం సందడిగా ఉంటుంది. పరిచయస్తుల రాకపోకలు అధికమవుతాయి. స్థిరాస్తి కొనుగోలు దిశగా యత్నాలు సాగిస్తారు. దళారులలో జాగ్రత్త. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. ఉద్యోగులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వ్యాపారాభివృద్ధికి పథకాలు అమలు చేస్తారు. సరుకు నిల్వలో జాగ్రత్త. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. ఒక ఆహ్వనం ఆశ్చర్యం కలిగిస్తుంది. వాహనం ఇతరులకివ్వడం క్షేమం కాదు. 
 
వృశ్చికరాశి: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట
ఆరోగ్యం సంతృప్తికరం. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు ఏమంత స్పందన ఉండదు. లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం. నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. త్వరలో మీ కృషి ఫలిస్తుంది. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. దుబారా ఖర్చులు విపరీతం. రాబడిపై దృష్టి పెడతారు. సాయం అడిగేందుకు మనసు అంగీకరించదు. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. కార్యక్రమాలు, పనులు వాయిదా పడుతాయి. గృహమార్పు అనివార్యం. సంతానం విజయం సంతోషాన్నిస్తుంది. వేడుకలు, పన సమారాధనల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. దైవదీక్షలు స్వీకరిస్తారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది. 
 
ధనర్‌రాశి: మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం
ఈ మాసం అనూకూలదాయకమే. వ్యవహారాలను సమర్థంగా నిర్వహిస్తారు. ప్రేమానుబంధాలు బలపడుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. శుభకార్యం నిశ్చయమవుతుంది. వివాహ వేదికలు అన్వేషిస్తారు. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఖర్చులు అధికం, సంతృప్తికరం. ఆలయాలు, సేవా సంస్థలకు సాయం అందిస్తారు. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. మీ పథకాలు మంచి ఫలితాలిస్తాయి. పెట్టుబడులకు అనుకూలం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు స్థానచలనం. సహోద్యోగులతో విందుల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. జూదాల జోలికి పోవద్దు.  
 
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
శుభకార్యానికి తీవ్రంగా యత్నాలు సాగిస్తారు. ఒక సంబంధం కలిసివస్తుంది. నిశ్చితార్థాలకు అనుకూలం. మీ ఇష్టాయిష్టాలను మధ్యవర్తుల ద్వారా తెలియజేయండి. ఆర్థికంగా బాగుంటుంది. కొన్ని సమస్యల నుండి బయడపడుతారు. ఆందోళన తొలగుతుంది. కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఖర్చులు విపరీతం. ధనానికి ఇబ్బంది ఉండదు. దంపతుల మధ్యా దాపరికరం తగదు. పెద్దల ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. పనులు సానుకూలమవుతాయి. సంతానం దూకుడు అదుపు చేయండి. కొత్త సమస్యలెదురయ్యే సూచనలున్నాయి. అప్రమత్తంగా వ్యవహరించాలి. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. దైవ దీక్షలు స్వీకరిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఉద్యోగస్తులకు పదవీయోగం. వృత్తి ఉపాధి పథకాల్లో రాణిస్తారు. 
 
కుంభరాశి: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఈ మాసం శుభదాయకమే. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. బంధుత్వాలు, ప్రేమానుబంధాలు బలపడుతాయి. సమర్థతను చాటుకుంటారు. బాధ్యతలు అధికమవుతాయి. ఆదాయాభివృద్ధి, ప్రశాంతత పొందుతారు. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. పనులు సాఫీగా సాగుతాయి. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను కచ్చితంగా వ్యక్తం చేయండి. అనవసర జోక్యం తగదు. సంతానం విజయం సంతోషపరుస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు.  
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆర్థికంగా పురోగమిస్తారు. రుణ బాధలు తొలగుతాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడుతాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. వేడుకల్లో పాల్గొంటారు. ఊహించిన ఖర్చులే ఉంటాయి. ధనానికి ఇబ్బంది ఉండదు. పరిచయస్తులు ధనసహాయం అర్థిస్తారు. పెద్దమెుత్తం సహాయం తగదు. మీ నిర్ణయాలను సున్నితంగా వ్యక్తం చేయండి. ఎవరినీ నొప్పించవద్దు. పెట్టుబడులపై దృష్టి సారిస్తారు. దైవ దీక్షలు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులకు ధనప్రలోభం తగదు. వ్యాపారాల్ల లాభనష్టాలు సమీక్షించుకుంటారు. మీ పథకాలు మంచి ఫలితాలిస్తాయి. క్రీడా పోటీల్లో రాణిస్తారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

01-11-2018 గురువారం దినఫలాలు - ఆర్థిక సంతృప్తి...