Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమావాస్య రోజున.. అవిసె ఆకులు ఆవులకు ఇవ్వడం చేస్తే..?

Advertiesment
అమావాస్య రోజున.. అవిసె ఆకులు ఆవులకు ఇవ్వడం చేస్తే..?
, బుధవారం, 16 సెప్టెంబరు 2020 (19:15 IST)
అమావాస్య రోజున పుణ్య క్షేత్రాలు దర్శించి పవిత్ర స్నానాలు చేసి యాగాలు చేసి ఉపవాసం ఉంటే పాపాల నుంచి విముక్తి కలుగుతుంది. : ఈ అమాస్య నాడు విష్ణుమూర్తి ఆరాధిస్తే మానసిక ప్రశాంతత , శారీరక ఆరోగ్యం, ఆర్ధికంగా మెరుగైన ఫలితాలు కలుగుతాయి. 
 
ఈ రోజున శివుడిని పూజిస్తే సకల పాపాలు తొలగి అదృష్టం, సంపద, ఐశ్వర్యం చేకూరుతాయి. అమావాస్య రోజున పితృదేవతలకు నీటిని నైవేద్యంగా సమర్పిస్తే.. అన్ని దోషాలు తొలగిపోతాయి. ఈ అమావాస్య నాడు పవిత్ర స్నానాలు చేయడంతో పాటుగా దానాలు, పితృపక్షాలు చేస్తే శుభం కలుగుతుంది.
 
ఉత్తరాయణం దేవతల కాలం గనుక ఉత్తమ కాలమని, దక్షిణాయనం పితృకాలం గనుక అశుభమని పూర్వీకుల విశ్వాసం. పితురులను తృప్తి పరచే ఈ కర్మల ద్వారా పితృ రుణం తీర్చుకునే అవకాశం ఇది. స్వర్గుస్తులైన మాతాపితురుల కోసం ప్రతీవారు మహాలయ అమావాస్యలో పితృ కర్మలను ఆచరించాలి. అవిసెఆకులు, పువ్వులే కాకుండా, తామరాకులు, తామర పువ్వులు, నల్ల నవ్వులు, బార్లీలను ఈ కర్మలో ఉపయోగిస్తారు. 
 
ఒక మనిషి జీవితకాలంలో ఈ మహాలయ పక్షంలో గంగ, యమున నదుల సంగమంలో గయలో శ్రాద్ధకర్మ చేయడం మహత్కార్యంగా భావిస్తారు. ఈ రోజు యథావిధిగా శ్రాద్ధకర్మ చేయడానికి వీలుకాని వారు తర్పణం వదలడంతో తృప్తిపడతారు. తర్పణానికి పిండాలు అవసరం లేదు. తిలాంజలితో సరి.
 
మహాలయనాడు అన్నదానం చేస్తే తండ్రి ముత్తాతలకే కాక వారి సంరక్షకులైన శ్రీ మహావిష్ణువులకుకూడా చేరుతాయి. ఈ మహాలయ పక్షానికి ఒక విశేషత ఉంది. వారి వారి జ్ఞాత, బంధువులందరికీ అర్ఘ్యాదులు పిండోదకాలు సమర్పిస్తారు. మహాలయ పక్షంలో చేసే అన్నదానం వల్ల అనంతకోటి యజ్ఞ ఫలం దక్కుతుంది. అవిసె ఆకులు ఆవులకు ఇవ్వడం ద్వారా పితృదేవతలను సంతృప్తిపరిచినట్లవుతుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహాలయ అమావాస్య: వంకాయలను వండటం తినడం కూడదట..