తామరమాల, కమలాగట్ట మాల, పద్మ మాల, లక్ష్మీదేవి అనుగ్రహమాల అను పేర్లతో పిలుస్తారు. తామరలను కలువలు అని కూడా అంటారు. తామరలకు పుత్రజీవి అనే పేరు కలదు.
తామర పూసలను సంతానం లేని వారు ప్రతి నిత్యం ఒకటి లేదా రెండు చొప్పున ప్రాతఃకాలం నందు తింటే చాలా మంచిది. చూర్ణం చేసుకుని కొద్దిగా వేడిచేసిన ఆవు పాలతో తాగవలెను. ఆ విధంగా కొంతకాలం సేవించిన సంతానం కలుగును.
తామరమాల ధరించిన వారిలో మనో నిగ్రహశక్తి, ఏకాగ్రత, సాత్విక గుణాలుంటాయి. ఈ తామరమాల ధరించడం ద్వారా శరీరంలో ఓ విద్యుత్ శక్తి ప్రవహిస్తుంటుంది. దీంతో శారీరకంగా రోగ నిరోధక శక్తి కలుగుతుంది. స్పటికమాల, పగడమాల కంటే ఉన్నత ఫలితాలను తామర మాల ఇస్తుంది.
సరస్సులో తామర నిలకడగా ఉండదు. నీటి ప్రవాహానికి కదులుతూ.. అటూ ఇటూ ఊగుతూ ఉంటుంది. తానూ నిలకడ లేని దానిని అని చెప్పటమే లక్ష్మీదేవి తామర పూవులో కొలువై వుంటుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.