ఆధ్యాత్మికంలో స్ఫటిక లింగానికి ప్రాధాన్యత వుంది. స్ఫటిక వినాయకుడు, స్ఫటిక లింగానికి పూజ చేయడం ద్వారా అపారమైన సానుకూల శక్తి లభిస్తుంది. అలాంటి స్ఫటిక లింగానికి మాసానికి రెండుసార్లు నీటితోనైనా అభిషేకం చేస్తే.. శుభఫలితాలుంటాయి. స్ఫటిక లింగానికి ప్రతికూల ప్రభావాన్ని తనలోకి తీసుకునే శక్తి వుంటుంది. ఇంకా సానుకూల శక్తిని వ్యాపింప చేసే శక్తి వుంటుంది.
స్ఫటిక లింగం గృహంలో వుంటే.. మానసిక ఆందోళనలు, భయాందోళనలు, ఈతిబాధలు తొలగిపోతాయి. ఇంకా మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఇంకా స్ఫటిక మాలను ధరించడం ద్వారా శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించుకోవచ్చు. రక్తపోటు వున్నవారు స్ఫటిక మాలను ధరించడం మెరుగైన ఆరోగ్య ఫలితాన్నిస్తుంది. స్నానం చేసేటప్పుడు స్ఫటిక మాలతో స్నానమాచరించడం మంచిది.
స్ఫటిక మాలను చేతిలో వుంచి.. శివుని నామాన్ని ఉచ్ఛరించి ధ్యానించడం ద్వారా కోరిక కోరికలు నెరవేరుతాయి. స్ఫటిక మాలను ధరించేందుకు ముందు ఆ మాలను 3 గంటల సేపు నీటిలో నానబెట్టి ధరించడం మంచిది. ఒకరు ధరించిన స్ఫటిక మాలను మరొకరు ధరించడం కూడదు. రోజంతా స్ఫటిక మాలను ధరించడం ద్వారా ఒకరి శరీరంలోని ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరిస్తుంది. ఇంకా మానసిక ఒత్తిడిని దూరం చేస్తుందని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.