నన్ను మాత్రమే కాదు.. అమ్మను కూడా వేధించాడు.. పొగరు విలన్‌పై మీటూ ఆరోపణలు

గురువారం, 6 జూన్ 2019 (16:51 IST)
విశాల్ నటించిన తిమిరు సినిమాలో విలన్‌గా నటించిన వ్యక్తిపై మీటూ ఆరోపణలు వచ్చాయి. విశాల్, శ్రేయారెడ్డి జంటగా నటించిన పొగరు సినిమాలో కామెడీ కలబోసిన విలన్ పాత్రలో కనిపించిన నటుడే వినాయగన్. ఇతడు మలయాళంలో దుల్కర్ సల్మాన్ కలి, ధనుష్‌తో మరియాన్, చియాన్ విక్రమ్ ధృవ నక్షత్రం వంటి సినిమాల్లో నటించాడు. 
 
గతంలో బీజేపీకి వ్యతిరేకంగా కామెంట్స్ చేసిన వినాయగన్.. ఆరోపణలు ఎదుర్కొన్నారు. తాజాగా అతనిపై సామాజిక కార్యకర్త మృదులా దేవి వినాయగన్‌పై మీటూ ఆరోపణలు లేవనెత్తింది. 
 
కేరళకు చెందిన ఈమె తన ఫేస్ బుక్ పేజీలో వినాయగన్‌పై మీటూ ఆరోపణలు చేసింది. ఓ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా తాను ఫోన్‌లో ఆహ్వానం పలికాను. ఆ సమయంలో వినాయగన్ అభ్యంతరకరంగా మాట్లాడాడని ఆరోపించింది. 
 
ఇంకా మృదులాతో పాటు ఆమె తల్లిని కూడా వినాయగన్ వేధించినట్లు ఆమె ఫేస్‌బుక్‌లో చెప్పుకొచ్చింది. తనకు సహకరించాలని డిమాండ్ చేసినట్లు ఆమె తెలిపింది. ప్రస్తుతం వినాయగన్‌పై మీటూ ఆరోపణలు కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ప్రెగ్నెంట్‌గా ఉండి తెలుగులో సినిమాలు చేస్తానంటున్న హీరోయిన్...ఎవరు..?