మేషరాశి: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
వ్యవహారాలు అనుకూలిస్తాయి. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. గృహం సందడిగా వుంటుంది. ఖర్చులు విపరీతం. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆత్మీయుల రాక సంతోషాన్నిస్తుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. పత్రాలు, నగదు జాగ్రత్త. సంతానం చదువులపై మరింత శ్రద్ధ వహించాలి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. ఉద్యోగస్తులకు పనిభారం. అధికారులకు హోదా మార్పు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. దస్త్రం వేడుకను ఘనంగా చేస్తారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. పుణ్యక్షేత్రాలు, కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు.
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
పరిస్థితులు క్రమంగా చక్కబడతాయి. అనుకున్నది సాధిస్తారు. మీ పట్టుదల మార్గదర్శకమవుతుంది. ఆదాయ వ్యయాలకు పొంతన వుండదు. దుబారా ఖర్చులు విపరీతం. పెట్టుబడులు కలిసిరావు. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. పరిచయాలు, వ్యాపకాలు విస్తరిస్తాయి. పదవులు బాధ్యతలు స్వీకరిస్తారు. సాధ్యం కాని హామీలివ్వవద్దు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. ఆరోగ్యం స్థిరంగా వుంటుంది. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లను దీటుగా ఎదుర్కొంటారు. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. అధికారులకు స్థానంచలనం, హోదామార్పు. వేడుకల్లో పాల్గొంటారు. విద్యార్థుల ఒత్తిడి, ఆందోళన అధికం.
మిధున రాశి: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఈ మాసం ఆశాజనకం. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. రుణ సమస్యలు కొలిక్కి వస్తాయి. ఖర్చులు సామాన్యం. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆలోచింపజేస్తుంది. అయినవారితో సంప్రదింపులు జరుపుతారు. పనులు సానుకూలమవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. పోగొట్టుకున్న పత్రాలు లభ్యమవుతాయి. చిన్ననాటి పరిచయస్తులతో సంభాషిస్తారు. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. సంతానం విషయంలో శుభఫలితాలున్నాయి. పరిచయం లేనివారితో జాగ్రత్త. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. ఉమ్మడి వ్యాపారాలు కలిసివస్తాయి. పెద్దమొత్త సరుకు నిల్వలో మెలకువ వహించండి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. అధికారులకు స్వాగతం, వీడ్కోలు పలుకుతారు. విందులు, వినోదాల్లో అత్యుత్సాహం తగదు.
కర్కాటక రాశి: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
తలపెట్టిన కార్యం సిద్ధిస్తుంది. అందరితో కలుపుగోలుగా వ్యవహరిస్తారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. ఆదాయం సంతృప్తికరం. సన్నిహితులకు సాయం అందిస్తారు. శుభకార్యం నిశ్చయమవుతుంది. పెట్టిపోతల్లో మెలకువ వహించండి. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. పనులు ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. శకునాలను పట్టించుకోవద్దు. మనోధైర్యంతో ముందుకు సాగండి. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. నిర్మాణాలు, మరమ్మతులు చురుకుగా సాగుతాయి. కీలక పత్రాలు అందుకుంటారు. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. మీ పథకాలు మున్ముందు సత్ఫలితాలిస్తాయి. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు.
సింహరాశి: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఈ మాసం ప్రధమార్థం అనుకూలదాయకం. వ్యవహార దక్షతతో నెట్టుకొస్తారు. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. మానసికంగా కుదుటపడతారు. గృహం ప్రశాంతంగా వుంటుంది. సంస్థల స్థాపనలకు అనుకూలం. కొత్త పనులు ప్రారంభిస్తారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. ప్రియతముల ఆరోగ్యం మందగిస్తుంది. కార్యక్రమాలు ముందుకు సాగవు. సోదరీసోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ ఇష్టాయిష్టాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. ఉద్యోగస్తులు అధికారుల ప్రాపకం సంపాదిస్తారు. సహోద్యోగులతో జాగ్రత్త. వ్యాపారాలు ఊపందుకుంటాయి. కార్మికులు, చేతివృత్తుల వారికి పురోభివృద్ధి. ప్రయాణం తలపెడతారు. పందాలు, జూదాల జోలికి పోవద్దు.
కన్యారాశి: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
వ్యవరానుకూలత వుంది. సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. కొత్త పనులు చేపడతారు. పరిచయాలు విస్తరిస్తాయి. శుభకార్యంపై దృష్టిపెడతారు. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. వ్యతిరేకులతో జాగ్రత్త. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. బాధ్యతలు అప్పగించవద్దు. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. అయినవారితో ఉల్లాసంగా గడుపుతారు. వాహనసౌఖ్యం, వస్త్రప్రాప్తి వున్నాయి. సంతానం భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. ఉద్యోగస్తులకు శుభయోగం. అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. దస్త్రం వేడుక నిర్విఘ్నంగా సాగుతుంది.
తులారాశి: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఈ మాసం ప్రతికూలతలు అధికం. రుణ సమస్యలు వేధిస్తాయి. ఆలోచనలతో సతమతమవుతారు. ఏ విషయంపై ఆసక్తి వుండదు. అవసరానికి ఆత్మీయులు సహకరిస్తారు. ఆందోళన తగ్గి కుదుటపడుతుంది. నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. అవకాశాలు చేజారినా ఒకందుకు మంచిదే. త్వరలో పరిస్థితులు చక్కబడతాయి. ఒక ఆహ్వానం సందిగ్ధానికి గురిచేస్తుంది. కుటుంబీకులతో సంప్రదింపులు జరుపుతారు. అవతలివారి అభిప్రాయానికి విలువ ఇవ్వండి. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సాగవు. పాత పరిచయస్తులను కలుసుకుంటారు. సంతానం విషయంలో మంచే జరుగుతుంది. వ్యాపారాలు అంతంతమాత్రంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అధికారుల వైఖరి ఆందోళన కలిగిస్తుంది. వైద్య, న్యాయ, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి.
వృశ్చిక రాశి: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట
కొత్త సమస్యలు తలెత్తే సూచనలున్నాయి. అప్రమత్తంగా వుండాలి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. పెద్దల సలహా పాటించండి. మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది. దంపతుల మధ్య అవగాహనా లోపం. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం సకాలంలో చెల్లింపులు జరుపుతారు. రశీదులు, పత్రాలు జాగ్రత్త. పెట్టుబడులకు తరుణం కాదు. సన్నిహితులను కలుసుకుంటారు. సంతానం కదలికలపై దృష్టి సారించండి. చెప్పుడు మాటలు పట్టించుకోవద్దు. ఆరోగ్యం మందగిస్తుంది. విశ్రాంతి అవసరం. గృహమార్పు ఫలితం త్వరలో కనిపిస్తుంది. ఉద్యోగస్తుల సమర్థతకు ఏమంత గుర్తింపు వుండదు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. నూతన వ్యాపారాలలో నిలదొక్కుకుంటారు. దస్త్రం వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. వాహన చోదకులు అప్రమత్తంగా వుండాలి.
ధనుర్ రాశి: మూల, పూర్వాషాడ 1వ పాదం
సర్వత్రా అనుకూలమే. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది వుండదు. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. ప్రముఖులతో పరిచయలేర్పడతాయి. వాహనయోగం, వస్త్రప్రాప్తి వున్నాయి. మీ జోక్యంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం తగదు. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. పెద్దల ఆరోగ్యం మెరగుపడుతుంది. సంతానం దూకుడు అదుపుచేయండి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. ఆలయాలు, సేవా సంస్థలకు విరాళాలు అందిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆటంకాలను దీటుగా ఎదుర్కొంటారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. నిరుద్యోగులకు శుభయోగం.
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట, 1, 2 పాదాలు
ఆర్థికంగా కుదుటపడతారు. సమస్యలు తొలగుతాయి. ఖర్చులు అధికం. సంతృప్తికరం. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. శుభకార్యాలకు హాజరవుతారు. బంధుత్వాలు బలపడతాయి. లౌక్యంగా పనులు చక్కబెట్టుకుంటారు. ఆశించిన పదువులు దక్కకపోవచ్చు. మనోధైర్యంతో ముందుకు సాగండి. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. స్థిరాస్తి క్రయవిక్రయంలో పునరాలోచన మంచిది. పెద్దల సలహా పాటించండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. ఆరోగ్యం స్థిరంగా వుంటుంది. సంతానం చదువులపై దృష్టి పెడతారు. నగదు, విలువైన వస్తువులు ఉద్యోగ బాధ్యతల్లో అలక్ష్యం తగదు. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉమ్మడి వ్యాపారాలకు అనుకూలం. దస్త్రం వేడుక ప్రశాంతంగా సాగుతుంది. ప్రయాణం కలిసి వస్తుంది.
కుంభరాశి: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు
ఆర్థిక లావాదేవీలతో తీరిక వుండదు. ఎంత శ్రమించినా ఫలితం అంతంతమాత్రమే. ఆదాయ వ్యయాలకు పొంతన వుండదు. పెద్ద ఖర్చు తగిలే సూచనలున్నాయి. సాయం చేసేందుకు అయినవారే వెనుకాడతారు. వివాహ యత్నాలు నిరుత్సాహపరుస్తాయి. సంతానం వైఖరి అసహనం కలిగిస్తుంది. ఆత్మీయుల కలయికతో కుదుటపడతారు. మనోధైర్యంతో వ్యవహరించండి. వ్యాపకాలు సృష్టించుకోండి. అతిగా ఆలోచించవద్దు. త్వరలో సమస్యలు సర్దుకుంటాయి. పత్రాలు, ఆహ్వానం అందుకుంటారు. గృహమార్పు ఫలితం నిదానంగా కనిపిస్తుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉపాధి పథకాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. సహోద్యోగులతో వేడుకల్లో పాల్గొంటారు. పందాలు, జూదాలకు పాల్పడవద్దు.
మీనరాశి: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఈ మాసం యోగదాయకమే. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యగా వ్యవహరించాలి. సాధ్యం కాని హామీలివ్వవద్దు. ఖర్చులు విపరీతం. పొదుపు ధనం ముందుగా గ్రహిస్తారు. సందేశాలు, ప్రకటనల పట్ల అప్రమత్తంగా వుండాలి. నమ్మకస్తులే మోసగించే ఆస్కారం వుంది. సంతానం అత్యుత్సాహాన్ని అదుపుచేయండి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. స్థిరాస్తి కొనుగోలు దిశగా ఆలోచనలుంటాయి. ఉద్యోగస్తులు అధికారుల ప్రాపకం సంపాదిస్తారు. సహోద్యోగులతో జాగ్రత్త. వృత్తి ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. భాగస్వామిక ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఆధ్యాత్మిక పెంపొందుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.