పాదరసలింగాన్ని ఎర్రని వస్త్రంపై వుంచి పూజ చేస్తే?

పాదరసలింగార్చనతో అనుకున్న కోరికలు దిగ్విజయంగా పూర్తవుతాయి. పాదరస శివలింగాన్ని తేజోలింగమని, రసలింగమని పిలుస్తారు. వేదాల ప్రకారం పాదరసము శివుని బీజము నుంచి ఉద్భవించిందని చెప్తారు. ఈ లింగము స్వచ్ఛమైనది,

మంగళవారం, 31 జులై 2018 (10:44 IST)
పాదరసలింగార్చనతో అనుకున్న కోరికలు దిగ్విజయంగా పూర్తవుతాయి. పాదరస శివలింగాన్ని తేజోలింగమని, రసలింగమని పిలుస్తారు. వేదాల ప్రకారం పాదరసము శివుని బీజము నుంచి ఉద్భవించిందని చెప్తారు. ఈ లింగము స్వచ్ఛమైనది, శుభకరమైనది. పాదరస లింగాన్ని సేవించడం ద్వారా ముక్తిని పొందవచ్చు. బ్రహ్మహత్యాపాతకము కూడా పాదరసలింగాన్ని పూజించడం ద్వారా నశిస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 
 
అలాగే పాదరస లింగాన్ని ఇంట వుంచి పూజించేవారు ఎర్రని వస్త్రంపై వుంచి పూజ చేయాలి. పాదరస శివలింగాన్ని పూజిస్తే మృత్యువుని జయించవచ్చు. పాదరస శివలింగాన్ని శాస్త్రయుక్తంగా మంత్రాలతో విధి విధానాలతో పూజిస్తే ఈతిబాధలు తొలగిపోతాయి. పాదరసలింగాన్ని సోమవారం పూట గానీ, కార్తీకమాసంలో గాని ప్రతిష్ఠించి పాలతో అభిషేకించాలి. 
 
''ఓం ఐం శ్రీం క్లీమ్ హ్రీం పాదరసాంకుసాయనమః'' అనే ద్వాదశ మంత్రాన్ని ఉచ్చరిస్తూ గంధ పుష్పాలతో అలంకరించి ధ్యానావహనాది షోడోపచారములతో పూజించిన వారికి కోటి శివలింగాలను పూజించిన ఫలము లభిస్తుంది. పాదరస శివలింగాన్ని పూజించడానికి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అనే వర్ణ బేధం లేదు. 
 
స్త్రీ పురుష అనే వ్యత్యాసం లేదు. దారిద్ర్యాలు తొలగిపోయి, సుఖసంతోషాలతో జీవించాలంటే... పాదరస లింగాన్ని నిష్ఠగా పూజిస్తే సరిపోతుందని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. మనిషిలోని నెగటివ్ ఎనర్జీ తగ్గించే శక్తి ఈ లింగానికి వుంది. ఈ శివ లింగానికి కొంతసేపు తల ఆన్చితే తలలో నరాలకు సంబంధించిన వ్యాధులు దూరమవుతాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం తిరుచానూరులో ఇక తిరుమల తరహా దర్శనం