ఎంత కష్టపడి సంపాదించిన డబ్బు నిలవట్లేదా.. అప్పు పెరుగుతూనే పోతుందా? అయితే ఈ కథనం చదవండి. ధనప్రాప్తి కోసం ఇంట్లో ఈ పనులు చేస్తే చాలు అదృష్టం తలుపు తడుతుంది. ఈ వస్తువులను ఇంట్లో ఉంచుకుంటే, అప్పుల నుంచి గట్టెక్కవచ్చు. రుణ సమస్యల నుంచి తప్పించుకోవాలంటే కుటుంబాన్ని నిలబెట్టుకుంటే, తొలుత ఇలవేల్పును పూజించాలి. పౌర్ణమి రోజున ఇలవేల్పుకు పూజ చేయాలి. ధూపదీప నైవేద్యాలు సమర్పించడం చేయాలి. ఇలా తొమ్మిది పౌర్ణమిలు చేస్తే, అప్పు తీరిపోతుంది.
అలాగే బుధ, శనివారాల్లో తులసీమాలను నారాయణ స్వామికి సమర్పించడం ద్వారా అప్పుల బాధలుండవ్. అలాగే పెరుమాళ్ల ఆలయంలోని చక్రత్తాళ్వార్ సన్నిధిలో తులసీ మాలను సమర్పించి 12 సార్లు ప్రదక్షణలు చేయాలి. ఇలా 12 వారాల పాటు చేస్తే రుణబాధలుండవు.
అదేవిధంగా ఇంట్లో, ఉత్తర దిశలో పాత లేదా అప్రయోజనకరమైన వస్తువులు ఏమీ లేకుండా చూసుకోవాలి. ఉత్తర దిశలో బరువైన వస్తువులు వుంచకూడదు. ఎప్పుడు ఉత్తర దిశలో శుభ్రంగా ఉండాలి. ఇంటి ప్రవేశ ద్వారం వద్ద వాహనాలు నిలిపివేయకూడదు. చెట్లు ఉండకూడదు.. ఇంటి ప్రధాన ద్వారం శుభ్రంగా వుంటే ఆ ఇంట ధనాదాయం చేకూరుతుంది.
ఇకపోతే.. వినాయకుడి అంశమైన ఏనుగు బొమ్మలను ఇంటి ప్రధాన ద్వారం వద్ద వుంచవచ్చు. కానీ, జంటగా ఉండే ఏనుగులను కొనుగోలు చేసి ఉంచాలి. దీనివలన వాస్తు సమస్యలు తొలగిపోతాయి. అలాగే వెండి లేదా ఇత్తడితో తయారు చేసిన జంటగా వున్న చేప విగ్రహాలను ఇంటికి ఉత్తరం లేదా తూర్పు దిశలో వుంచడం మంచిది.
అలాగే.. ఏకాక్షి కొబ్బరికాయను ఇంట్లో వుంచడం ద్వారా ధన సమస్యలు ఏమాత్రం దరిచేరవు. ఏకాక్షి నారికేళం సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపమని భావిస్తారు. ఏకాక్షి నారికేళం అంటే ఒక కన్ను గల కొబ్బరికాయ అని అర్ధం. సంస్కృతంలో ఏకాక్షి అంటే ఒక కన్ను కొబ్బరి అని అర్థం.
ఇవి దొరకటం చాలా కష్టం. దొరికితే కనుక ఇంటికి తెచ్చుకుని పూజలు చేస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఇంకా మహాలక్ష్మీ పాదాలు, శంఖం, గవ్వలు, కామధేనువు బొమ్మను ఇంట్లో వుంచడం ద్వారా సర్వాభీష్టాలు చేకూరుతాయి.