Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Garlic: వెల్లుల్లితో చుండ్రు సమస్యకు చెక్.. వెల్లుల్లిని నూనె తయారీ ఎలా?

Advertiesment
garlic

సెల్వి

, బుధవారం, 12 ఫిబ్రవరి 2025 (15:09 IST)
మహిళలు జుట్టు రాలడం, చుండ్రు సమస్యకు చెక్ పెట్టాలంటే.. వెల్లుల్లిని వాడాలని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. వెల్లుల్లి అనేది శరీరానికి దివ్యౌషధం అలాంటిది. వెల్లుల్లిలోని ఔషధ గుణాలు మన ఆరోగ్యానికి వివిధ విధాలుగా మేలు చేస్తాయి. వెల్లుల్లి వంటకే కాదు, జుట్టుకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వెల్లుల్లిని పచ్చిగా ఉపయోగించినా లేదా పొడి చేసి ఉపయోగించినా, అది జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. 
 
వెల్లుల్లిలో విటమిన్ సి, విటమిన్ బి6, జింక్, సెలీనియం, మాంగనీస్ వంటి పోషకాలు ఉంటాయి. అవి జుట్టు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వెల్లుల్లిలోని యాంటీవైరల్, యాంటీ ఫంగల్ లక్షణాలు తలపై వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్లను చికిత్స చేయడంలో సహాయపడతాయి. 
 
వెల్లుల్లి జుట్టు రాలడాన్ని తగ్గించి జుట్టు పెరుగుదలను పెంచుతుందని ఒక అధ్యయనంలో తేలింది. అదేవిధంగా, వెల్లుల్లిలోని సల్ఫర్, సెలీనియం జుట్టు కుదుళ్ల నిర్మాణాన్ని బలోపేతం చేయడంలో సహాయపడతాయని తేలింది.
 
వెల్లుల్లిలోని యాంటీవైరల్, యాంటీ ఫంగల్ లక్షణాలు వైరల్ లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్ల వల్ల కలిగే తల చర్మ సమస్యలకు చికిత్స చేయడంలో చాలా ప్రభావవంతంగా ఉంటాయి. వెల్లుల్లిని దంచి తలకు పట్టించడం వల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది. చుండ్రు సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.
 
వెల్లుల్లిలోని యాంటీఆక్సిడెంట్లు సూర్యుడి అతినీలలోహిత కిరణాల వల్ల జుట్టు దెబ్బతినకుండా కాపాడతాయి. వెల్లుల్లి విటమిన్ సి జుట్టు పెరుగుదలకు ఉపయోగపడుతుంది. జుట్టు సమస్యలను వదిలించుకోవడానికి వెల్లుల్లిని నూనెగా ఉపయోగించవచ్చు. వెల్లుల్లి నూనె అన్ని సమస్యలకు ప్రయోజనకరమైన లక్షణాలను కలిగి ఉంది. వెల్లుల్లి నూనెను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దీని కోసం, కొన్ని వెల్లుల్లి రెబ్బలను పేస్ట్‌గా రుబ్బి, ఆ పేస్ట్‌ను ఒక పాన్‌లో వేసి బాగా వేయించాలి. 
 
దానికి ఒక కప్పు కొబ్బరి నూనె లేదా ఆలివ్ నూనె వేసి తక్కువ మంట మీద బాగా వేడి చేయాలి. తరువాత, నూనెను చల్లబరిచి, ఒక గాజు సీసాలో నిల్వ చేసి వాడాలి. రెండు టేబుల్ స్పూన్ల నూనె తీసుకుని తలకు సున్నితంగా మసాజ్ చేసి, 30 నిమిషాలు అలాగే ఉంచి, ఆపై తేలికపాటి షాంపూతో కడిగేయాలి. ఈ నూనెను వారానికి రెండుసార్లు వాడటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పసుపు కలిపిన ఉసిరి రసం తాగితే?