కుంభ రాశి : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఆదాయం 8
వ్యయం: 14
రాజపూజ్యం: 7
అవమానం 5
ఈ రాశివారికి గురుప్రభావం వల్ల గతం కంటే మరింత శుభఫలితాలు గోచరిస్తున్నాయి. ఆదాయమార్గాలను అభివృద్ధి చేసుకోవటం ద్వారా ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. రుణసమస్య తొలగి తాకట్టు విడిపించుకుంటారు. కొత్త రుణాల స్వీకరణలో అప్రమత్తంగా ఉండాలి. ఖర్చులు అంచనాలను మించుతాయి. ధనసమస్యలు తలెత్తకుండా జాగ్రత్త వహించండి. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి.
ఆలోచనలను కార్యరూపంలో పెడతారు. ఎవరి సాయం ఆశించవద్దు. మీ ఓర్పు, పట్టుదలే విజయానికి దోహదపడతాయి. అవగాహన లేని విషయాలకు దూరంగా ఉండాలి. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. గృహంలో శుభకార్యం నిశ్చయమవుతుంది. స్నేహసంబంధాలు విస్తరిస్తాయి.
విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. చెల్లింపుల్లో అశ్రద్ధ తగదు. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. తరచు వైద్యపరీక్షలు చేయించుకోవటం ఉత్తమం. సంతానానికి శుభయోగం. వేడుకలు, పుణ్యకార్యాల్లో పాల్గొంటారు. పలుకబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. మీ చొరవతో ఒకరికి మేలు జరుగుతుంది. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి.
విద్యార్థులకు పోటీపరీక్షల్లో "ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. ర్యాంకుల సాధనకు అకుంఠిత దీక్షతో శ్రమించండి. మీ కృషి తప్పక ఫలిస్తుంది. ఉపాధి పథకాలు చేపడతారు. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. హోల్సేల్ వ్యాపారులు, స్టాకిస్టులకు కొత్త సమస్యలెదురవుతాయి.
ఉద్యోగస్తులకు ప్రమోషన్‌తో కూడిన బదిలీ. ఉన్నతాధికారులకు అప్రాధాన్యతా రంగాలకు మార్పు. కళ, క్రీడాపోటీల్లో రాణిస్తారు. పుణ్యక్షేత్రాలు, విదేశాలు సందర్శిస్తారు. తోటి ప్రయాణికులతో అప్రమత్తంగా ఉండాలి. ఈ రాశివారికి శ్రీమన్నారాయణ స్తోత్రపారాయణం, అమ్మవారికి కుంకుమార్చనలు శుభం, జయం.