Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వణికించే కుజదోషం, నివారణకు ఏం చేయాలి? (Video)

వణికించే కుజదోషం, నివారణకు ఏం చేయాలి? (Video)
, సోమవారం, 24 ఫిబ్రవరి 2020 (20:49 IST)
కుజ దోషం వుంటే వివాహానికి అడ్డంకులు ఏర్పడుతుంటాయన్నది విశ్వాసం. అందుకే కుజదోష నివారణకు సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామాళి రోజు 9సార్లు 12 రోజులు పారాయణ చేసి వల్లీ, దేవసేనా అష్టోత్తర శతనామాలు ఒకసారి చదవాలని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. సుబ్రహ్మణ్యమాలా మంత్రము రోజుకొకసారి 40 రోజులు పారాయణ చేయడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. 
 
ఏడు మంగళవారములు ఉదయం ఆరు గంటల నుంచి ఏడుగంటల లోపున శివాలయంలో ఏక రుద్రాభిషేకం చేయించడం ద్వారా కుజదోషాన్ని నివారించవచ్చు. ఏడు మంగళవారములు కుమార స్వామికి గానీ, నాగేంద్రస్వామి పుట్టకుగాని 70 ప్రదక్షిణలు చేస్తే కుజదోషాన్ని పోగొట్టుకోవచ్చంటున్నారు.
 
ఆదివారం రాహుకాలములో సాయంత్రం 4-30 నుంచి ఆరు గంటలోపుగా నిమ్మకాయ డొప్పలో దీపారాధన చేసి సుబ్రహ్మణ్యష్టకం పారాయణం చేయాలి. నాగేంద్ర స్వామి పుట్ట దగ్గరకు వెళ్ళినప్పుడు పుట్టమన్ను చెవికి కచ్చితముగా పెట్టుకోవాలి. పాలుపోయాలి. కొబ్బరికాయ కొట్టాలి. 
 
శనివారం ఉదయం 9-30 నుంచి 11 గంటల వరకు, ఆదివారం సాయంత్రం 4-30 నుంచి ఆరు గంటల వరకు, సోమవారం ఉదయం 7-30 నుంచి 9-00 గంటల వరకు.. రాహుకాలములో అష్టమూలికా తైలంతో సుబ్రహ్మణ్య స్వామికి దీపారాధన ఎర్రటి వత్తులతో చేసినట్లైతే చాలా మంచిది. కృష్ణా జిల్లాలోని మోపిదేవి క్షేత్రమును దర్శించి 70 ప్రదక్షిణములు చేసి వెండి సర్ప పడగను హుండీలో వేసి అభిషేకం చేయించుకొనవలెను.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

24-02-2020 సోమవారం మీ రాశి ఫలితాలు.. మల్లికార్జున స్వామిని?