Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 11 April 2025
webdunia

వధూవరుల ఇద్దరికీ కుజదోషం వుంటే ఏమవుతుంది?

Advertiesment
Kuja Dosham effects
, మంగళవారం, 4 ఫిబ్రవరి 2020 (20:48 IST)
కుజ దోషం వున్నది అంటే వారికి వివాహం చేసేందుకు నానా తంటాలు పడుతుంటారనేది విశ్వాసం. అసలు కుజగ్రహ లక్షణాలు ఏమిటో తెలుసుకుందాం. కుజుడికి ఆధిక్యం, పరాక్రమం, వీరధీర కార్యాలు, పరిపాలనా బలం, నమ్మకం, ఇతరులకు లొంగకపోవడం, ధర్మం, నీతి, న్యాయం, పురుషాధికం వంటివి లక్షణాలు. ఈ గ్రహ అనుగ్రహంతో  పోలీస్, సైనిక, అగ్నిమాపక సిబ్బంది, ఉన్నతపదవుల్ని అలంకరిస్తారు. 
 
పందేలు, ఆరోగ్యం, సాహస కార్యాల్లో రాణించాలంటే కుజగ్రహ అనుగ్రహం తప్పనిసరి. రియల్ ఎస్టేట్, బిల్డింగ్ కాంట్రాక్ట్, సివిల్ ఇంజనీరింగ్, శస్త్ర చికిత్స చేసే డాక్టర్లు తమ వృత్తుల్లో రాణించాలంటే అది కుజగ్రహ అనుగ్రహంతోనేనని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. 
 
అయితే కుజదోషంతో వివాహ అడ్డంకులు ఏర్పడుతాయని అందరూ అంటుంటే వినే ఉంటాం. పెళ్లి కుదర్చే ముందు.. వధూవరుల జాతకాల పొంతన చూడటం సహజం. మంచి నక్షత్రమా.. ఎన్ని పొంతనలు ఉన్నాయని అడుగుతాం. సాధారణంగా నక్షత్ర పొంతన చూడటం చాలామంది అలవాటు. దశా-దిశలు ఎలా వున్నా.. నక్షత్రాలు పొంతనే వివాహానికి ముఖ్యమని జ్యోతిష్య నిపుణులు కూడా అంటున్నారు. 
 
అయితే మరికొందరు జ్యోతిష్యులు నక్షత్ర పొంతన మాత్రమే వివాహ బంధాన్ని నిర్ణయించదంటున్నారు. జాతక చక్రంలో ఉన్న గదులే ఆ జాతకుల భవిష్యత్తును తీర్మానిస్తుంది. అందుచేత కుజ దోష జాతకులను కుజదోష జాతకులకే వివాహం చేయడం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయి.  
 
అంగారకుడు అనే కుజునిచే ఏర్పడే దోషాల సంగతికి వస్తే.. 
కుజగ్రహ ప్రభావంతో మాంగల్య దోషం, విష్కన్యాదోషం, కళత్ర దోషం, సర్పదోషం, సూర్య దోషం, పునర్పూ దోషం వంటివి ఏర్పడతాయి. ఇందులో కుజదోషం, సర్పదోషం, మాంగల్య దోషం కీలకమైనవి. ఈ దోషాలంటే తప్పక నివారణ చేసి తీరాలంటున్నారు జ్యోతిష్య నిపుణులు. 
 
అయితే శరీరంలో రక్త ప్రవాహానికి ఆధారమైన కుజుడు.. శరీరంలోని ఉష్ణాన్ని వెలివేస్తాడు. పురుష జాతకంలో కుజుని గ్రహాధిపత్యం సాధిస్తే ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. మహిళల జాతకంలో కుజగ్రహ అనుగ్రహం ఆధిపత్యం వహిస్తే.. ఉత్సాహం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. 
 
అందుకే స్త్రీ పురుష జాతకాలను వివాహ బంధంతో ఒక్కటి చేయడం ద్వారా కుజునికి ప్రాధాన్యత పెరుగుతుంది. వివాహ బంధంలో స్త్రీపురుషులు ఒక్కటవడం, వంశావృద్ధికి కుజుడే కారకుడు. అందుకే పెళ్లి బంధం కోసం కుజస్థానానికి జ్యోతిష్య నిపుణులు ప్రాధాన్యత ఇస్తారు. 
 
కుజగ్రహ ప్రభావం ఇరు జాతకులకు ఉంటే ఆ వధూవరులు సుఖభోగాలు అనుభవిస్తారని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. అదే దోషాలుంటే మాత్రం వివాహ అడ్డంకులు, వివాహ బంధంలో సమస్యలు వంటివి తప్పవని, వీటి నుంచి బయటపడాలంటే... తప్పక దోష పరిహారం చేయాల్సిందేనని వారు చెబుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పౌర్ణమి, అమావాస్యకు ఐదో రోజు- పంచభూతాలను ఇలా పూజిస్తే? (video)