Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇంటికి వెనుక కలబంద మొక్క.. శివాలయంలో పెరుగన్నం దానం చేస్తే? (video)

Advertiesment
income
, సోమవారం, 21 అక్టోబరు 2019 (14:59 IST)
ఆదాయం వస్తూనే వున్నా.. ఖర్చు మాత్రం దానికి తగ్గట్టుగానే వస్తోందా? ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవట్లేదా? ఆర్థికంగానే కాకుండా, మానసికంగా ఇబ్బందులు వెంటాడుతున్నాయా? అయితే లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోండి అంటున్నారు.. ఆధ్యాత్మిక నిపుణులు. వృత్తిలో రాణించడం కోసం, ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఆందోళనలను దూరం చేసుకోవాలనుకుంటే.. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఈ చిట్కాలు పాటించాలని పంచాంగ నిపుణులు సూచిస్తున్నారు.
 
అవేంటంటే? రోజూ అన్నం వండేందుకు బియ్యం తీస్తున్నప్పుడు.. గుప్పెడు బియ్యాన్ని వేరొక మట్టి కుండలో వేయడం అలవాటు చేసుకోవాలి. ఇలా 21 రోజులు తీసిపెట్టిన గుప్పెడేసి బియ్యంతో పెరుగన్నంగా తయారు చేసి.. ఏదేని శివాలయంలో అన్నదానం చేయాలి. ఇలా వరుసగా చేస్తూ వస్తే.. మీకు తెలియకుండానే ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఆందోళనలు తొలగిపోతాయి. అలాగే ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు తగ్గుతాయి. అప్పులు తీరిపోతాయి. 
 
ఇంకా ఇంటికి ఆగ్నేయ దిశలో ఒక గాజు పాత్రలో లేదా మట్టి పాత్రలో నీరును వుంచి అందులో కొత్తిమీర ఆకులను వేయాలి. ఈ నీటిని రోజూ మారుస్తూ.. వుండాలి. కొత్తిమీరను కూడా మార్చాలి. 
 
అలాగే ఓ పాత్రలో బియ్యం తీసుకుని.. తొలుత కుటుంబ యజమాని చేతి నుంచి రెండు నాణేలను ఆ బియ్యంలో వుంచమనాలి. తర్వాత ఆ కుటుంబంలోని వారంతా తలా ఒక్కో నాణేన్ని అందులో వుంచి పూజ గదిలో వుంచి పూజించాలి. ఇలా చేస్తే ధనార్జన పెరుగుతుంది. ఆహారానికి ఎలాంటి లోటు వుండదు. ఆరు మాసాలకు ఒకసారి ఈ బియ్యాన్ని మారుస్తూ వుండాలి. ఈ బియ్యాన్ని పక్షులకు ఆహారంగా వుంచేసి నాణేలను బీరువాలో భద్రపరుచుకోవాలి. 
 
ఇంటికి వెనుకల వైపు కలబంద మొక్కను పెంచితే అనవసరపు ఖర్చులు తగ్గిపోతాయి. ధనాదాయం పెరుగుతుంది. ఇంట్లోని ఆగ్నేయంలో రెండు మొక్కజొన్న కందులను వేలాడదీయాలి. ఆరునెలలకు ఒకసారి వీటిని మార్చేసి.. ఆ మొక్కజొన్న గింజలను పక్షులను ఇవ్వడం చేయడం ద్వారా ఆ ఇంట సిరిసంపదలు వెల్లివిరుస్తాయి. 
webdunia
 
వీటితో పాటు మంగళవారం, శుక్రవారం పూట ఇంటిని శుభ్రం చేసుకుని మహాలక్ష్మీదేవిని, అమ్మవారిని పూజించడం ద్వారా సకల శుభాలతో పాటు.. అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు సూచిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

21-09-2019 సోమవారం మీ రాశి ఫలితాలు