అమెరికాలో ఇక పేదవారికి గ్రీన్ కార్డు నో.. ధనవంతులే ఉండాలి..

మంగళవారం, 13 ఆగస్టు 2019 (11:26 IST)
అగ్రరాజ్యం అమెరికా క్యాపటలిస్టు కంట్రీ. ఆ దిశగానే అమెరికా వ్యవహారశైలికూడా ఉంది. తమ దేశంలో ధనవంతులే ఉండాలని, పేదలు ఉండకూడదన్న వైఖరిని అవలంభిస్తోంది. వ‌ల‌స వ‌స్తున్న‌వారిపై వ‌రుస‌గా ఆ దేశం కొర‌డా ఝళిపిస్తోంది. ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను ఆస‌రా చేసుకునే పేద‌వారికి గ్రీన్‌కార్డు ఇవ్వ‌కూడ‌ద‌ని అగ్ర‌రాజ్యం నిర్ణ‌యించింది. అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ త‌న తాజా ఉత్త‌ర్వుతో పేద‌ల‌కు అనుహ్య‌మైన షాక్ ఇచ్చారు. 
 
ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌కు అనేక సంక్షేమ కార్య‌క్ర‌మాలు అందిస్తుంది. ఇదే సిద్ధాంతం అమెరికాలోనూ ఉన్నది. కానీ ఆ దేశానికి వ‌ల‌స వ‌స్తున్న‌వారి సంఖ్య అదుపు తుప్పుతున్న‌ది. ఆ ఉప‌ద్ర‌వాన్ని అడ్డుకునేందుకు ట్రంప్ ఎన్నో ప్ర‌య‌త్నాలు చేప‌ట్టారు. ఇప్పుడు తాజాగా పేద వ‌ల‌స‌ల‌కు గ్రీన్‌కార్డు ఇవ్వ‌కూడదని నిర్ణ‌యించారు. ఇది నిజంగా పెద్ద షాక్‌. ఆఫ్రికా, సెంట్ర‌ల్ అమెరికా, క‌రీబియ‌న్ దీవుల ప్ర‌జ‌ల‌కు శ‌రాఘాతం. లీగ‌ల్‌గా వీసా ఉన్నా.. వారి ఆర్థిక ప‌రిస్థితే ఆ దేశంలో బ్ర‌తికేందుకు వీలు క‌ల్పించ‌నున్న‌ది. 
 
ప‌ర్మ‌నెంట్ రెసిడెంట్ స్టాట‌స్ కోసం సాధార‌ణంగా వ‌ల‌స ప్ర‌జ‌లు అమెరికా ప్ర‌భుత్వానికి ద‌ర‌ఖాస్తు చేసుకుంటారు. దాన్నే గ్రీన్‌కార్డు అంటారు. చ‌ట్ట‌ప‌రంగా వీసా ఉన్న వారే ఆ ద‌ర‌ఖాస్తు చేస్తారు. అయితే లీగ‌ల్ వీసా ఉన్నా.. ఇప్పుడు ఆ వ్య‌క్తులు ప్ర‌భుత్వానికి త‌మ ఆర్థిక స్థితిగ‌త‌ులను వెల్ల‌డించాల్సి ఉంటుంది. ప్రభుత్వ పథకాలైన ఆహారం, వైద్యం, గృహవసతి వంటి ప్రయోజనాలను వలసదారులు ఉపయోగించుకున్నట్టు తేలితే వాళ్లకు గ్రీన్‌కార్డు ఇవ్వ‌కూడ‌ద‌ని వైట్‌హౌజ్ ఓ ప్ర‌క‌ట‌న‌లో చెప్పింది. 
 
ప్ర‌స్తుతం గ్రీన్ కార్డు ఉన్న‌వాళ్లు కూడా ఎలాంటి ప్ర‌భుత్వ ప‌థ‌కాన్ని పొంద‌కూడ‌దు. అలా చేస్తే వారి గ్రీన్‌కార్డును వెన‌క్కితీసుకుంటారు. వ‌ల‌స వ‌చ్చిన వారు స్వ‌యం స‌మృద్ధి క‌లిగి ఉండాల‌ని, వాళ్లు దేశ సంప‌ద‌ను నిర్వీర్యం చేస్తున్న‌ట్లుగా ఉండ‌కూడ‌ద‌ని శ్వేత సౌధిం ఇమ్మిగ్రేష‌న్‌ అధికారి ఒక‌రు అభిప్రాయ‌ప‌డ్డారు. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం మణిక్రాంతి హత్య కేసు : స్కూటీలో ప్రదీప్‌తో వెళ్లిన ఆ వ్యక్తి ఎవరు?