Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

18-08-2020 మంగళవారం రాశిఫలాలు - లక్ష్మీదేవిని తెల్లని పూలతో పూజించినా...

Advertiesment
18-08-2020 మంగళవారం రాశిఫలాలు - లక్ష్మీదేవిని తెల్లని పూలతో పూజించినా...
, మంగళవారం, 18 ఆగస్టు 2020 (05:00 IST)
మేషం : బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి. ఆకస్మిక ప్రయాణాలు వాయిదాపడతాయి. నిరుద్యోగులు ఒక ప్రకటన పట్ల ఆకర్షితులవుతారు. స్థిరాస్తుల కొనుగోలు యత్నాలు అనుకూలిస్తాయి. స్త్రీలు చీటికి మాటికి అసహనం, చికాకులు అధికమవుతాయి. అయినవారిని, ఆప్తులను విందు భోజనానికి ఆహ్వానిస్తారు. 
 
వృషభం : వైద్యులు ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేస్తారు. ప్రముఖులతో వ్యాపకాలు అధికమవుతాయి. మిత్రులతో కలిసి షాపింగ్ చేస్తారు. ఉద్యోగస్తులు, రాజకీయ నాయకులు సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. కాని వేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. 
 
మిథునం : స్త్రీలతో కలహములు, అన్ని కార్యముల యందు విఘ్నములు ఎదుర్కొంటారు. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. ఏ వ్యక్తికీ అతి చనువు ఇవ్వడం మంచిదికాదు. రుణాలు, పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తారు. 
 
కర్కాటకం : ఆర్థిక లావాదేవీలు, కుటుంబ సమస్యలు సమర్థంగా పరిష్కరిస్తారు. ఉద్యోగస్తులకు అధికారుల తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. ఒక అవసరానికి ఉంచిన ధనం మరో ఖర్చుకు వినియోగించవలసి వస్తుంది. స్త్రీలకు పనివారలతో చికాకులు తప్పవు. ఇతరుల ముందు వ్యక్తిగత విషయాలు వెల్లడించడం మంచిది కాదమని గమనించండి. 
 
సింహం : వైద్య రంగాల్లో వారికి ఆపరేషన్ల సమయంలో ఏకాగ్రత అవసరం. స్త్రీలకు పనివారలతో సమస్యలు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడటం మంచిదికాదు. ప్రైవేటు సంస్థలలోని వారికి యాజమాన్యంతో ఏకీభావం లోపిస్తుంది. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు సమసిపోతాయి. 
 
కన్య : వ్యవసాయ, తోటల రంగాల వారికి నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. ఖర్చులు అధికమవుతాయి. స్త్రీలతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి. ప్రయాణాల్లో అధిక శ్రమ ఎదుర్కొనక తప్పదు. ఫ్లీడర్లకు, ఫ్లీడర్ గుమస్తాలకు వృత్తిపరమైన చికాకులు తప్పవు. పోస్టల్, ఎల్ఐసి, ఏజెంట్లకు పురోభివృద్ధి కానవస్తుంది. 
 
తుల : సిమెంట్, కలప, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారులకు కలిసిరాగలదు. బ్యాంకు రుణాలు తీర్చడంతో పాటు కొంత రుణం తీర్చుకుంటారు. బంధువుల మధ్య సయోధ్య లోపిస్తుంది. ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. స్త్రీలకు అయినవారి రాక సంతోషం కలిగిస్తుంది. 
 
వృశ్చికం : ముక్కుసూటిగా పోయే మీ తీరు ఇబ్బందులకు దారితీస్తుంది. ప్రింటింగ్, స్టేషనరీ రంగంలోని వారికి పనివారలతో చికాకులు ఎదుర్కొంటారు. అరుదైన ఆపరేషన్లను వైద్యులు విజయవంతంగా పూర్తిచేస్తారు. కుటుంబ అవసరాలకు, మీ సంతానం కోసం ఫీజులు, బిల్లులు చెల్లిస్తారు. వృత్తుల్లో వారికి గుర్తింపు లభిస్తుంది.
 
ధనస్సు : దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిత్యావసర వస్తు స్టాకిస్టులకు, వ్యాపారులకు చికాకులు తప్పవు. గృహంలో మార్పులు, చేర్పులు వాయిదాపడతాయి. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు బంధువులకు పెద్ద మొత్తంలో ధన సహాయం చేయునపుడు పునరాలోచన అవసరం. 
 
మకరం : ఒంటెత్తు పోకడ మంచిదికాదని గమనించండి. ఆపత్సమయంలో సన్నిహితులు గుర్తుకు వస్తారు. స్త్రీల అభిప్రాయాలకు ఏమాత్రం స్పందన ఉండదు. ఉపాధ్యాయులకు నూతన వాతావరణం, పరిస్థితులు ఆందోళన కలిగిస్తాయి. సంఘంలో పలుకుబడి గల వ్యక్తుల సహకారంతో మీ పనులు సానుకూలమవుతాయి. 
 
కుంభం : వ్యాపారాల అభివృద్ధికి చేపట్టిన పథకాలు మున్ముందు మంచి ఫలితాలనిస్తాయి. బ్యాంకు చెక్కులు ఇచ్చే విషయంలో పునరాలోచన మంచిది. బంధువులు మీ నుంచి పెద్ద మొత్తంలో ధనసహాయం అర్థిస్తారు. మిత్రుల తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. ఉద్యోగస్తులు అధికారుల తీరును గమనించి మెలగవలసి ఉంటుంది.
 
మీనం : వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు తొలగిపోతాయి. వస్త్ర, బంగారం, వెండి, ఫ్యాన్సీ వ్యాపారాల్లో పోటీతత్వం అధికంగా ఉంటుంది. ఉద్యోగరీత్యా దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్ కంప్యూటర్ రంగాల వారికి ఆశాజనకం. ఇతరులకు వాహనం ఇవ్వడం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏడుకొండలవాడా గోవిందా గోవిందా, బ్రహ్మోత్సవాలు ఆ తేదీల్లోనే...