Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 13 January 2025
webdunia

14-06-2019 శుక్రవారం దినఫలితాలు.. పార్వతీదేవిని పూజించినట్లైతే..?

Advertiesment
14-06-2019 శుక్రవారం దినఫలితాలు.. పార్వతీదేవిని పూజించినట్లైతే..?
, శుక్రవారం, 14 జూన్ 2019 (10:22 IST)
మేషం: విద్యార్థినులకు ఇంజనీరింగ్, మెడికల్, లా కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది. అంతగా పరిచయం లేని వ్యక్తులతో అప్రమత్తంగా వుండాలి. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కొనవలసి వస్తుంది. స్త్రీలు షాపింగ్ విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి. వాహనం నడుపుతున్నప్పుడు మెళకువ అవసరం. 
 
వృషభం: ఆర్థిక లావాదేవీలు, ఒప్పందాల వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. బంధువుల రాకతో గృహంలో చికాకులు, ఖర్చులు అధికమవుతాయి. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. సోదరీ, సోదరుల మధ్య ఆస్తి విషయాల గూర్తి తగాదాలు రావచ్చు. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది.
 
మిథునం: విదేశాల్లో ఉంటున్న ఆత్మీయుల క్షేమ సమాచారాలు సంతృప్తినిస్తాయి. ప్రయాణాలు, ఇతర కార్యక్రమాలు వాయిదా పడతాయి. పూర్తిగా చదవకుండా సంతకాలు చేయకండి. కొంతమంది మీ బలహీనతలను కనిపెట్టి లబ్ధిపొందాలని యత్నిస్తారు. పండ్లు, పూలు, కొబ్బరి, చల్లని పానీయ వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. 
 
కర్కాటకం: విదేశీయానాలకై చేయు యత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికం. పీచు, ఫోమ్, లెదర్ వ్యాపారులకు పురోభివృద్ధి. కుటుంబీకులు, ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. ప్రతి పనీ ఉత్సాహంగా పూర్తి చేస్తారు. మిత్రుల సహాయంతో ఒక సమస్యను సునాయాసంగా పరిష్కరిస్తారు. 
 
సింహం: మీ శ్రీమతి, శ్రీవారి ఆరోగ్యంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగ రీత్యా దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. దైవ కార్యక్రమాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. ఉపాధ్యాయులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ముఖ్యుల కోసం ధనం బాగుగా వెచ్చిస్తారు. కొన్ని సందర్భాల్లో రిస్క్ తీసుకోవాల్సి వచ్చినా చివరికి మంచే జరుగుతుంది. 
 
కన్య: రావలసిన మొండి బాకీలు సైతం వసూలు కాగలవు. మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా మెలగండి. కుటుంబంలో చికాకులు తొలగి ప్రశాంతత నెలకొంటుంది. విద్యుత్, ఏసీ కూలర్లు, మెకానికల్ రంగాల్లో వారికి సంతృప్తి కానవస్తుంది. ప్రేమికులకు ఎడబాటు, ఇతరత్రా చికాకులు తప్పవు. 
 
తుల: గణిత, సైన్స్ రంగాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. దైవ కార్యక్రమాల పట్ల ఆసక్తి అధికం. శ్రమాధిక్యత, అకాల భోజనం వంటి చికాకులు తప్పవు. కళలు, క్రీడల పట్ల ఆసక్తి పెంచుకుంటారు. కొత్త పరిచయాల వల్ల లబ్ధిపొందుతారు. మీ కలల్ని నిజం చేసుకోవడానికి ఇది తగిన సమయం. కష్టించి పనిచేసే వారికి ఫలితం దక్కుతుంది. 
 
వృశ్చికం: వస్త్ర, ఫ్యాన్సీ, స్టేషనరీ వ్యాపారులకు పురోభివృద్ధి. ప్రభుత్వ ఉద్యోగస్తులు అనవసరపు విషయాలకు దూరంగా వుండటం క్షేమదాయకం. సోదరీ, సోదరులతో ఏకీభవించలేకపోతారు. ప్రముఖులను కలుసుకుంటారు. బంధువుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. ఉద్యోగస్తుల ప్రతిభకు గుర్తింపు, రాణింపు లభిస్తుంది. 
 
ధనస్సు: కంది, మినుము, మిర్చి వ్యాపారస్తులకు పురోభివృద్ధి. వైవాహిక జీవితంలో అనుకోని చికాకులు తలెత్తుటకు ఆస్కారం వుంది. దూర ప్రయాణాలకై చేయు ప్రయత్నాలు వాయిదా పడతాయి. మొండి బకాయిలు వసూలు కాగలవు. స్త్రీలకు పనిభారం అధికమవుతుంది. ఆహార వ్యవహారాలలో పరిమితి పాటించండి. 
 
మకరం: ఇతరులకు ధనం ఇచ్చినా తిరిగి రాజాలదు. స్త్రీల మనోవాంఛలు నెరవేరటంలో కొత్త అనుభూతికి లోనవుతారు. క్రయ విక్రయాలు ఊపందుకుంటాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు. వాహనం, విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. దైవ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. 
 
కుంభం: ఉద్యోగ యత్నాలు ముమ్మరం చేస్తారు. భాగస్వామికుల మధ్య అవగాహన లోపిస్తుంది. స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వృత్తి, వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి కొదవ వుండదు. ముఖ్యమైన విషయాలు గోప్యంగా వుంచండి. విద్యార్థులకు కోరుకున్న కోర్సులలో ప్రవేశం లభిస్తుంది. 
 
మీనం: మీ సంతానం ఉన్నతి కోసం బాగా శ్రమిస్తారు. దూర ప్రయాణాల్లో నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఒక వ్యవహారం నిమిత్తం ఒకటికి పదిసార్లు ప్రయత్నించాల్సి వుంటుంది. కోర్టు వ్యవహారాలు ముందుకు సాగవు. స్త్రీలకు ఆరోగ్యపరమైన సమస్యలు ఎదురవుతాయి. కుటుంబీకులతో ఏకీభవించలేకపోతారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అశోకవనంలో మహా తేజస్సుతో వెలుగుతూన్న స్త్రీమూర్తి... అప్పుడు హనుమంతుడు...