Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

13-06-2019 గురువారం రాశి ఫలితాలు.. దత్తాత్రేయుడిని ఆరాధించినట్లైతే?

Advertiesment
13-06-2019 గురువారం రాశి ఫలితాలు.. దత్తాత్రేయుడిని ఆరాధించినట్లైతే?
, గురువారం, 13 జూన్ 2019 (10:47 IST)
మేషం: టెక్నికల్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. కిరాణా, ఫ్యాన్సీ, మందులు, సుగంధ ద్రవ్య, ఆల్కహాలు వ్యాపారులకు అభివృద్ధి కానవస్తుంది. మీ శ్రీమతి వైఖరిలో ఆశించిన మార్పు, గృహ ప్రశాంతత పొందుతారు. 
 
వృషభం: మీ ఉన్నతిని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. ప్రతిఫలాపేక్ష లేకుండా మీరు చేసిన ఉపకారానికి ప్రశంసలు లభిస్తాయి. తలపెట్టిన పనులు నిర్నిఘ్నంగా పూర్తి చేస్తారు. మీ ఉన్నతిని చాటుకోవడానికి ధనం విరివిగా వ్యయం చేయవలసివస్తుంది. ఉపాధ్యాయులకు నూతన అవకాశాలు లభిస్తాయి. 
 
మిథునం: వస్త్ర, బంగారం, ఫ్యాన్సీ, స్టేషనరీ వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. ప్రతిఫలాపేక్ష లేకుండా మీరు చేసిన ఉపకారానికి ప్రశంసలు లభిస్తాయి. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. శస్త్రచికిత్సల సమయంలో డాక్టర్లకు ఏకాగ్రత ముఖ్యం. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. 
 
కర్కాటకం: బంధువుల రాక వల్ల కొంత అసౌకర్యానికి లోనవుతారు. పారిశ్రామిక రంగాల్లోని వారు కార్మికులతో ఒప్పందానికి వస్తారు. నిబద్ధతతో పనిచేస్తే అంతా విజయమే. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాల్లో మెళకువ అవసరం. అనుకోని వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశను కలిగిస్తాయి. సోదరులతో పట్టింపులు తలెత్తుతాయి. 
 
సింహం: వాతావరణంలో మార్పువల్ల స్త్రీల ఆరోగ్యంలో చిన్న చిన్న సమస్యలు తలెత్తవచ్చు. రాజకీయ నాయకులకు ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఉద్యోగ రీత్యా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. రుణ వాయిదాలు పూర్తిగా చెల్లించి తాకట్టు విడిపించుకుంటారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 
 
కన్య: నిరుద్యోగులు బోగస్ ప్రకటనల వల్ల నష్టపోయే ఆస్కారం వుంది. జాగ్రత్త వహించండి. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. ఉమ్మడి కుటుంబ విషయాల్లో మాటపడవలసి వస్తుంది. స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి అధికమవుతుంది. సంఘంలో మీ కీర్తి, ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. శత్రువులు మిత్రులుగా మారుతారు.
 
తుల: సభ, సమావేశాలు ధనం అధికంగా వ్యయం చేస్తారు. వ్యాపారాభివృద్ధికి మరింతగా శ్రమించాల్సి వుంటుంది. సంఘంలో మంచి గుర్తింపు రాణింపు లభిస్తుంది. విద్యార్థులకు క్రీడా రంగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. స్త్రీలతో మితంగా సంభాషించండి. గృహమునకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. 
 
వృశ్చికం: కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లు, ప్లీడరు గుమాస్తాలకు చికాకులు తప్పవు. ట్రాన్స్‌పోర్ట్, ట్రావెలింగ్, మెకానికల్ రంగాల వారికి అన్ని విధాలా కలిసిరాగలదు. భార్యాభర్తల మధ్య సఖ్యత నెలకొంటుంది. గంతంలో జరిగిన తప్పుల నుంచి మంచిని నేర్చుకోండి. మీరెంత శ్రమించినా గుర్తింపు అంతంత మాత్రంగానే ఉంటుంది. 
 
ధనస్సు: రాజకీయ నాయకులకు ఊహించని అవరోధాలు తలెత్తినా తెలివితో పరిష్కరిస్తారు. మీ అభిప్రాయాన్ని మీ శ్రీమతి ద్వారా తెలియపరచండి. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. విద్యుత్, ఏసీ మెకానికల్ రంగాల్లోని వారికి సంతృప్తి కానవస్తుంది. ఖర్చులు పెరగడంతో రుణ యత్నాలు, చేబదుళ్ళు తప్పవు. 
 
మకరం: బ్యాంకు వ్యవహారాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం. వృత్తి వ్యాపారాల్లో పట్టుదలతో లక్ష్యాలు సాధిస్తారు. దైవ శుభకార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. మీ శ్రీమతి కోసం ధనం అధికంగా వ్యయం చేస్తారు. దూర ప్రయాణాలు ఆకస్మికంగా వాయిదాపడతాయి. 
 
కుంభం: శారీరక శ్రమ, అకాల భోజనం వల్ల స్వల్ప అస్వస్థతకు లోనవుతారు. కాంట్రాక్టర్లకు నిర్మాణ పనుల్లో ఏకాగ్రత ఎంతో ముఖ్యం. ఆదాయవ్యయాలు సరిసమానంగా వుంటాయి. ప్రింట్ రంగాల వారు అచ్చుతప్పులతో మాటపడవలసి వుంటుంది. విద్యార్థుల మొండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. 
 
మీనం: ఉద్యోగ విరమణ చేసిన వారికి తోటివారు సాదరంగా వీడ్కోలు పలుకుతారు. ఉత్సాహంతో శ్రమించండి. అనుకున్నది సాధిస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి వుంటుంది. ఎగుమతి, దిగుమతి వ్యాపారస్తులకు, జాయింట్ వ్యాపారస్తులకు శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

12-06-2019 బుధవారం మీ రాశి ఫలితాలు.. సత్యదేవుని పూజించినట్లైతే?