మేషం : స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి సదవకాశాలు లభించినా సద్వినియోగం చేసుకోలేరు. మీ యత్నాలకు సన్నిహితుల నుంచి సహకారం లభిస్తుంది. వస్త్ర, బంగార, వెండి, లోహ వ్యాపారస్తులకు పురోభివృద్ధి. కొన్ని సమస్యలు చిన్నవే అయినా మనశ్సాంతి దూరం చేస్తారు. ప్రయాణాలలో మెళకువ అవసరం.
వృషభం : కోర్టు వ్యవహారాలు వాయిదా పడటం మంచిది. ఉద్యోగస్తులు అధికారుల తీరును గమనించి మెలగవలసి ఉంటుంది. రావలసిన ధనం వాయిదా పడటంతో ఒకింత ఆందోళన చెందుతారు. విద్యార్థులకు తోటివారి వల్ల సమస్యలు తప్పవు. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో మెళకువ వహించండి.
మిథునం : నూతన దంపతులు మధ్య కలహాలు తలెత్తుతాయి. మీ లక్ష్య సాధనకు నిరంతర కృషి, పట్టుదల అవసరమని గమనించండి. స్థిరాస్తి క్రయ, విక్రయాలకు సంబంధించిన వ్యవహారాల్లో మెళకువ అవసరం. కుటుంబీకుల ఆరోగ్యం విషయంలో మెళకువ వహించండి. బంధువులను కలుసుకుంటారు.
కర్కాటకం : ప్రైవేటు సంస్థలలోని వారి నిర్లక్ష్యం, మతిమరుపు వల్ల యాజమాన్యం కోపతాపాలకు గురికావలసి వస్తుంది. నేడు చేద్దామన్న పనులు రేపటి వాయిదా వస్తారు. ప్రింటింగ్ రంగాల్లో వారికి పనివారితో ఇబ్బందులు తలెత్తుతాయి. హోటల్, క్యాటరింగ్ రంగాల వారికి లాభదాయకంగా ఉంటుంది.
సింహం : ఆర్థింకగా ఎదగలానే మీ ఆశయం నిధానంగా ఫలిస్తుంది. ప్రింటింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు తలెత్తుతాయి. బిల్లులు చెల్లిస్తారు. స్త్రీలు కలుపుగోలుగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. రావలసిన ధనం సకాలంలో అందుటంతో మీలో పలు ఆలోచనలు చోటు చేసుకుంటాయి.
కన్య : నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. గృహ నిర్మాణాలు, మరమ్మత్తులు సంతృప్తికరంగా సాగుతాయి. ఒక్కోసారి మీ జీవితభాగస్వామి మనస్తత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. విదేశీ యత్నాల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కుంటారు. కొన్ని కార్యక్రమాలు అప్రయత్నంగా పూర్తి చేస్తారు.
తుల : మీ ఉన్నతిని చాటుకోవాలనే తాపత్రయంలో ధనం విరివిగా వ్యయం చేస్తారు. పెద్దల సలహాలను పాటించడం మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. ఎప్పటి సమస్యలు అప్పుడే పరిష్కరించుకోవడం మంచిది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్ల విషయంలో పునరాలోచన అవసరం.
వృశ్చికం : ఉపాధ్యాయులకు శ్రమాధిక్యత, ఒత్తిడి తప్పదు. గృహానికి కావలసిన వస్తువులను సమకూర్చుకుంటారు. విద్యార్థులు అధిక ఉత్సాహం ప్రదర్శించడం వల్ల సమస్యలకు లోనవుతారు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లు, ప్లీడరు గుమాస్తాలకు ఊహించని చికాకులు ఎదురవుతాయి. నూతన పరిచయాలు ఏర్పడుతాయి.
ధనస్సు : బంధువుల మధ్య అపోహలు తొలగిపోతాయి ఆప్యాయతలు మరింత బలపడుతాయి. స్త్రీలకు పనివారలతో చికాకులు తప్పవు. పాత మిత్రుల నుండి ఆహ్వానాలు, లేఖలు అందుకుంటారు. ఎదుటివారితో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు. అవకాశవాదులు అధికం కావడం వల్ల ఊహించని ఒత్తిడి లోనవుతారు.
మకరం : వస్త్ర, బంగారం, వెండి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు. సోదరీ, సోదరుల మధ్య సమస్యలు తలెత్తుతాయి. ఆత్మీయులను విమర్శించుట వల్ల చికాకులను ఎదుర్కుంటారు. పత్రిక, మార్కెట్ రంగాల వారికి మార్పులు అనుకూలిస్తాయి.
కుంభం : కుటుంబీకులతో ముభావంగా ఉంటారు. ఉద్యోగ, వ్యాపారులకు అధికారుల నుండి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. రావలసిన ధనం చేతికందుతుంది. వచ్చిన సొమ్మును పొదుపు పథకాల వైపు మళ్లించండి. నమ్మకం పట్టుదలతో యత్నాలు సాధించండి, సత్ఫలితాలు పొందుతారు.
మీనం : హోటల్, క్యాటరింగ్ రంగాల్లో వారు పనివారలతో ఇబ్బందులు ఎదుర్కుంటారు. స్త్రీలు వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టకుంటారు. ప్రతని విషయంలో ఆత్మనిగ్రహం అవసరమని గమనించండి. దూర ప్రయాణాల్లో వస్తువుల జారవిడుచుకునే ఆస్కారం ఉంది, జాగ్రత్త వహించండి.