Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Lizard Sound Astrology: బల్లి శబ్ధం- ఫలితాలు.. నైరుతి దిశలో బల్లి శబ్ధం చేస్తే..?

Advertiesment
Lizard Sound

సెల్వి

, గురువారం, 8 జనవరి 2026 (12:13 IST)
Lizard Sound
బల్లిశాస్త్రం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బల్లి పడితే ఎలాంటి ఫలితాలు కలుగుతాయనే అంశాలు ఈ శాస్త్రంలో చెప్పబడివుంది. అలాగే బల్లి మన ఇంట్లో ఏ దిక్కున, ఏ దిశలో శబ్ధం చేస్తుందో.. ఆ దిశకు అనుగుణంగా ఫలితాలు వుంటాయని చెప్తున్నారు పండితులు. 
 
మన ఇంట సంచరించే బల్లి ఇచ్చే శబ్ధం శుభ, అశుభ ఫలితాలను ఇస్తుంది. బల్లి ఇచ్చే శబ్ధాలను బట్టి ఫలితాలను గణించవచ్చు. ఏ దిశలో బల్లి శబ్ధం చేస్తే.. ఏంటి ఫలితం వుంటుందో తెలుసుకుందాం.. ఆగ్నేయ దిశలో బల్లి శబ్ధం చేస్తే.. ఆ ఇంట కలహాలు ఉత్పన్నం అవుతాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. అగ్ని దిశగా చెప్పే ఆగ్నేయంలో బల్లి శబ్ధం చేస్తే ఆ ఇంట వారంలోపు ఏదైనా చెడు వార్తలు వినాల్సి వస్తుంది. 
 
అలాగే నైరుతి దిశలో బల్లి శబ్ధం చేస్తే.. కుబేర దిశగా చెప్పుకునే నైరుతిలో బల్లి శబ్ధం చేస్తే.. బంధువుల రాకపోకలు పెరుగుతాయి. బంధువులు, స్నేహితుల బంధం బలపడుతుంది. తద్వారా మంచి జరుగుతుంది. 
 
ఇకపోతే తూర్పు దిశలో బల్లి శబ్ధం చేస్తే ఏంటి ఫలితమో తెలుసుకుందాం.. ఈ దిశలో బల్లి శబ్ధం చేస్తే అంత మంచిది కాదు. తూర్పు దిశలో బల్లి శబ్ధం చేయడం రాహు గ్రహ సారం. అందుచేత ఆ ఇంట్లో సభ్యులకు భయాందోళనలు ఏర్పడతాయి. అశుభ వార్తలు వినాల్సి వస్తుంది. అందుచేత తూర్పు దిశలో బల్లి శబ్ధం చేయడం మంచిది కాదు అంటున్నారు జ్యోతిష్య నిపుణులు. 
 
అలాగే వాయుదిశగా పేర్కొనే ఉత్తర దిశలో బల్లి శబ్ధం చేస్తే శుభం కలుగుతుంది. త్వరలో శుభవార్తలు వింటారని అర్థం చేసుకోవాలని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

08-01-2026 గురువారం ఫలితాలు - పనులు మొండిగా పూర్తిచేస్తారు...