వైశాఖ మాస శుద్ధ తృతీయ రోజు అక్షయ తృతీయ వస్తూ ఉంటుంది. ఈ రోజు పరశురాముడి జయంతి. మరోవైపు సింహాచలంలో అప్పన్న స్వామి నిజ రూప దర్శనం ఇచ్చే రోజు. అక్షయ తృతీయ పవిత్రమైన రోజు. ఈ రోజున రాశుల వారీగా ఏ వస్తువులు కొనాలో చూద్దాం..
మేషం: ఈ రాశుల వారు అక్షయ తృతీయ రోజున వెండి లేదా బంగారు నాణేన్ని కొనుగోలు చేయాలి. దానంగా ఎరుపు దుస్తులు, ధాన్యాలు, బెల్లాన్ని ఇవ్వవచ్చు.
వృషభం: వృషభ రాశి నాడు అక్షయ తృతీయ రోజున అదృష్టం పొందాలంటే బంగారు నాణేన్ని, వెండిలో లక్ష్మీదేవి విగ్రహాన్ని కొనుగోలు చేయాలి. ఆస్తులు కొనుగోలు చేయవచ్చు. దానంగా తెలుపు స్వీట్లు, పాలు, బియ్యంను ఇవ్వాలి.
మిథునం: ఈ రాశుల వారు కొత్త స్మార్ట్ ఫోన్, ల్యాప్ టాప్‌లు, పుస్తకాలు కొనుగోలు చేయవచ్చు. అలాగే మరకత పచ్చతో కూడిన నగలు కొనుగోలు చేయవచ్చు. ఇది అదృష్టాన్నిస్తుంది. విద్యార్థులకు పుస్తకాలు కొనుగోలు చేసిపెట్టవచ్చు.
కర్కాటకం: కర్కాటక రాశి జాతకులు ఈ అక్షయ తృతీయ రోజున వెండి వస్తువులు, గృహాలంకరణ వస్తువులు, బంగారం, స్థలాలు కొనడం వంటివి చేయవచ్చు. దానంగా పాలతో చేసిన స్వీట్లు, దుస్తులు ఇవ్వవచ్చు.
సింహం: ఈ రాశి వారు బంగారు నగలు, దుస్తులు, వ్యాపారం ప్రారంభించవచ్చు. అలాగే బెల్లం, గోధుమలు, విద్యార్థులకు దుస్తులు దానం చేయవచ్చు.
కన్యారాశి: కన్యారాశి జాతకులు అక్షయ తృతీయ రోజున బంగారం, పచ్చని మొక్కలను కొనడం మంచిది. పచ్చని దుస్తులను దానం చేయాలి .
తులా రాశి: అక్షయ తృతీయ రోజున తులారాశి జాతకులు సుగంధ ద్రవ్యాలను కొనడం మంచిది. దానంగా పాలతో చేసిన స్వీట్లను ఇవ్వవచ్చు.
వృశ్చిక రాశి జాతకులు అక్షయ తృతీయ రోజున వంశపారంపర్యంగా వచ్చే ఆస్తులను కొనుగోలు చేయవచ్చు. దానంగా, పెసరపప్పు, కుంకుమ పువ్వును దానం చేయడం మంచిది.
ధనుస్సు: ఈ రాశి వారికి రుద్రాక్షలు, పుస్తకాలు వంటివి కొనవచ్చు. పసిడి పూత రాసిన పెరుమాళ్ల స్వామిని పూజించడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. దానంగా విద్యార్థులకు పుస్తకాలు దానం చేయడం మంచిది.
మకరం: మకర రాశి జాతకులు అక్షయ తృతీయ రోజున కొత్త వ్యాపారం చేయవచ్చు. నువ్వులు దానం చేయవచ్చు.
కుంభరాశి జాతకులు అక్షయ తృతీయ రోజున వెండి నాణేలు, రత్నాలు పొదిగిన ఆభరణాలు కొనడం మంచిది. దానంగా అన్నదానం చేయడం మంచిది.
మీనరాశి: అక్షయతృతీయ రోజున ఈ రాశివారు దేవుని విగ్రహాలు, పటాలు కొనడం మంచిది. దానంగా దేవతా విగ్రహాలు ఇవ్వడం మంచి ఫలితాలను ఇస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.