Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మంగళవారం దినఫలాలు.. ధనం రాకడ.. పోకడ సమానం...

మేషం: కేటరింగ్, హోటల్ తినుబండ వ్యాపారులకు శుభదాకయంగా ఉండగలదు. ధనం రాకడ, పోకడ సరిసమానంగా ఉంటాయి. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు విరమించుకోవడం క్షేమదాయకం. పెద్ద మొత్తంలో చెక్కుల జారీ ఏకాగ్రత వహించాలి. ద

Advertiesment
మంగళవారం దినఫలాలు.. ధనం రాకడ.. పోకడ సమానం...
, మంగళవారం, 14 నవంబరు 2017 (12:10 IST)
మేషం: కేటరింగ్, హోటల్ తినుబండ వ్యాపారులకు శుభదాకయంగా ఉండగలదు. ధనం రాకడ, పోకడ సరిసమానంగా ఉంటాయి. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు విరమించుకోవడం క్షేమదాయకం. పెద్ద మొత్తంలో చెక్కుల జారీ ఏకాగ్రత వహించాలి. దైవ పుణ్య సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 
 
వృషభం: శ్రీవారు, శ్రీమతితో ప్రయాణాలు, సంభాషణలు అనుకూలిస్తాయి. మీ ఉన్నతిని చాటుకోవాలనే తాపత్రయంతో ధనం విచ్చలవిడిగా వ్యయం చేస్తారు. నిరుద్యోగులకు ఆశాజనకం. రవాణా రంగాల్లోని వారికి ఏకాగ్రత చాలా అవసరం. దైవదీక్షలు స్వీకరిస్తారు. మీ గౌరవ ప్రతిష్టకు భంగం కలుగకుండా వ్యవహరించండి. 
 
మిథునం: సినీ కళాకారుల వల్ల రాజకీయాల్లో పెనుమార్పులు చోటుచేసుకుంటాయి. ప్రభుత్వపరంగా రుణమాఫీలు, సబ్సిడీలు అధికంగా ఉంటాయి. ప్లీడర్లు, ప్లీడరు గుమాస్తాలకు పురోభివృద్ధి. పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాల్లోని వారు ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. 
 
కర్కాటకం: విద్యార్థులకు ఉపాధ్యాయులు, తోటివారితో సత్సంబంధాలు నెలకొంటాయి. ప్రతి చిన్న పని మీరే చేసుకోవాల్సి వస్తుంది. ఉద్యోగస్తులు ఒత్తిడి, ప్రలోభాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. శత్రువులు మిత్రులుగా మారి మీకు సహాయం అందిస్తారు. ఖర్చులు ఊహించనవే కావడంతో పెద్దగా ఇబ్బందులు వుండవు.
 
సింహం : బ్యాంకు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. కొబ్బరి, పండ్ల, పూల, చిరు వ్యాపారులకు కలిసివస్తుంది. స్త్రీలతో అతిగా సంభాషించడం వల్ల అపార్ధాలకు గురికావలసి వస్తుంది. మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. రాజకీయాల్లో వారు సంక్షోభాన్ని ఎదుర్కొంటారు. కుటుంబీకులతో కలిసి విందు, వినోదాల్లో పాల్గొంటారు.
 
కన్య: శస్త్ర చికిత్స చేయునప్పుడు వైద్యులకు ఏకాగ్రత, మెళకువ అవసరం. ప్రతి విషయాన్ని ఆప్తులు, కుటుంబీకులకు తెలియజేయటం మంచిది. స్త్రీలకు పనివారలతో చికాకులు, అసహనం తప్పవు. ఉత్తర ప్రత్యుత్తరాలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. నిత్యవసర వస్తు  వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు కలసిరాగలదు.
 
తుల : విరోధులు వేసే  పథకాలు తెలివితో త్రిప్పి గొట్టగలుగుతారు. విదేశీయానం కోసం చేసే యత్నాల్లో సఫలీకృతులవుతారు. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. ప్రముఖుల కలయికతో కొన్ని పనులు అనుకూలంగా ముందుకు సాగుతాయి.
 
వృశ్చికం: ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. విద్యార్థులకు హడావుడి, తొందరపాటు తగదు పెద్దల ఆరోగ్యం మెరుగుపడటంతో మానసికంగా కుదుటపడతారు. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. దైవదర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. మీ సంతానం వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది.
 
ధనస్సు: వైద్యులకు శస్త్రచికిత్సలు చేయునప్పుడు జాగ్రత్త అవసరం. స్త్రీలకు పనివారితో ఇబ్బందులు తప్పవు. దూర ప్రయాణాల్లో వస్తువుల పట్ల మెళకువ అవసరం. ఖర్చులు అధికమవుతాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కోర్టుకు హాజరవుతారు. రాజకీయ నాయకులు సభా సమావేశాల్లో పాల్గొంటారు.
 
మకరం: ఆర్థిక లావాదేవీల్లో ఏకాగ్రత వహించండి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. పాత రుణాలు తీరుస్తారు. బంధువుల రాకతో ఊహించని ఖర్చులు అధికమవుతాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. బ్యాంకు వ్యవహారాలు వాయిదా పడతాయి. స్త్రీలకు పనిభారం అధికమవుతుంది. 
 
కుంభం: ఆర్థికంగా బాగుగా స్థిరపడతారు. మీ శ్రీమతి వైఖరి మీకు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. బ్యాంకు పనుల్లో జాప్యం ఇతర వ్యవహారాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. సోదరి సోదరుల మధ్య మనస్పర్ధలు తలెత్తుతాయి. కోర్టు వ్యవహారాల్లో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి.
 
మీనం : ఆదాయానికి మంచి ఖర్చులు అధికమవ్వడం వల్ల ఆందోళన చెందుతారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. ప్రముఖులను కలుసుకుంటారు. కొబ్బరి, పండ్ల, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈ నెలలో మూడే మూడు ముహూర్తాలు.. లక్షకుపైగా వివాహాలు..