Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నాట్స్ ఆరోగ్య అవగాహన సదస్సు... ఆరోగ్యం, జీవనశైలి మార్పులపై సూచనలు

webdunia
శనివారం, 15 జూన్ 2019 (18:22 IST)
టెంపా, ఫ్లోరిడా: అమెరికాలో తెలుగుజాతి కోసం అనేక కార్యక్రమాలతో దూసుకువెళ్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా టెంపాలో తెలుగువారి కోసం ఆరోగ్య అవగాహన సదస్సు నిర్వహించింది. స్థానికంగా ఉండే తెలుగువారు ఈ సదస్సుకు విచ్చేసి తమ ఆరోగ్యం గురించి ఎన్నో విలువైన అంశాలు తెలుసుకున్నారు. ఆరోగ్యంగా పదికాలాల పాటు ఉండాలంటే ఎలా అనే దానిపై స్థానిక ప్రముఖ వైద్యులు ఎన్నో విలువైన సూచనలు చేశారు. 
 
గుండె వైద్య నిపుణులు డాక్టర్ నరేంద్ర శాస్త్రి గుండెను పదిలంగా ఉంచుకోవాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే జీవన శైలిలో ఎలాంటి మార్పులు చేసుకోవాలో సూచించారు. తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవడం వల్ల ప్రమాదకరమైన క్యాన్సర్ లాంటి వ్యాధులను ఆదిలోనే గుర్తించవచ్చని డాక్టర్ అనిత కొల్లి తెలిపారు. 
webdunia
 
ముఖ్యంగా మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్ పైన అవగాహన పెంచుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. డాక్టర్ నవీన వింధ్య చిన్న పిల్లల ఆరోగ్య విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. నాట్స్ టెంపా బే చాప్టర్ కో-ఆర్డినేటర్ రాజేష్ కుండ్రు నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ ఆరోగ్య అవగాహన సదస్సును నాట్స్ వాలంటీర్ల చక్కగా తమ సహాయసహకారాలు అందించి విజయవంతం చేశారు.
webdunia


నాట్స్ బోర్డు సభ్యులు ప్రశాంత్ పిన్నమ్మనేని, బోర్డు చైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సదస్సు నిర్వహణకు కీలక పాత్ర పోషించిన వారిని నాట్స్ ఛైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ ప్రత్యేకంగా అభినందించారు.

Share this Story:

Follow Webdunia Hindi

తర్వాతి కథనం

చేపలను అలా తింటే బరువు ఇలా మాయమవుతుంది..