Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పచ్చబొట్టు పొడిపించుకున్న వారు అందుకు పనికిరారా?

పచ్చబొట్టు పొడిపించుకున్న వారు అందుకు పనికిరారా?
, శుక్రవారం, 14 జూన్ 2019 (17:01 IST)
ఆరోగ్యంగా ఉన్నప్పుడే చాలా మంది రక్తదానం చేయడానికి అంగీకరిస్తారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అయితే, కొంతమంది అపోహలతో సరిగ్గా అర్థం చేసుకోకుండా రక్తదానం చేయడానికి సంకోచిస్తుంటారు. ఇలా రక్తదానంపై ఉన్న అపోహలు- వాస్తవాలు ఏంటో తెలుసుకుందాం.
 
అపోహ1: శాకాహారులు రక్తదానం చేయొద్దు
శాకాఖాహారులు రక్తదానం చేయోద్దనే అపోహ చాలా మందిలో ఉంది. రక్తంలో అత్యంత ముఖ్యమైన పదార్థం ఐరన్. మాంసం తిననివారిలో ఐరన్ శాతం తక్కువగా ఉంటుంది. కాబటి, శాకాహారులు రక్తందానం చేయొద్దనే అపోహ ఉంది. కానీ, శాకాహారి అయినా, మాంసాహారిఅయినా పౌష్టిక ఆహారం తీసుకుంటే రక్తంలో ఐరన్ మోతాదు తగిన స్థాయిలో ఉంటుంది. ఒకవేళ ఐరన్ శాతం తక్కువగా ఉంటే మీ ఆరోగ్యం దృష్ట్యా మిమ్మల్ని రక్తదానం చేయడానికి అనుమతించరు. చాలా దేశాలు రక్తదానం చేసేవారికి ముందుగా హెమోగ్లోబిన్ పరీక్షను నిర్వహిస్తాయి. ఆ టెస్ట్‌లో ఐరన్ తక్కువగా ఉన్నట్లు తేలితే రక్తదానం చేయడానికి అనుమతించరు.
 
అపోహ2: శరీరంపై పచ్చబొట్లు, కుట్లు ఉంటే రక్తదానం నిషిద్ధం
ఇదీ కూడా అపోహ మాత్రమే. వాస్తవానికి శరీరంపై పచ్చబొట్లు, కుట్లు ఉంటే రక్తదానం చేయడంపై నిషిద్ధం ఏమీ లేదు. డబ్ల్యూహెచ్‌వో మార్గదర్శకాల ప్రకారం పచ్చబొట్టు వేయించుకున్న ఆరు నెలల తర్వాత, కుట్లు వేసుకున్న 12 గంటల తర్వాత రక్తదానం చేయోచ్చు. అలాగే, దంత చికిత్స తీసుకున్నవారు 24 గంటల తర్వాత రక్తం ఇవ్వవచ్చు.
 
అలాంటివారు ఇవ్వకూడదు...
హెచ్‌ఐవీ పాసిటివ్, హెపటైటీస్, సిఫిలిసిస్, ట్యుబరోకొలాసిస్, రక్తమార్పిడి ద్వారా వచ్చే ఇతర అంటువ్యాధులు ఉంటే బ్లడ్ డొనేషన్ చేయోద్దు. అయితే, జలుబు, ఫ్లూ, గొంతునొప్పి, కడుపు నొప్పి లక్షణాలు ఉన్నంత మాత్రాన రక్తం ఇవ్వడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. యాంటీబయోటిక్ మందులు వాడితే రక్తదానం కోసం వారం రోజులు ఆగితే సరిపోతుంది. రక్తదానం నిబంధనలు దేశానిదేశానికి మారుతుంటాయి.
 
గర్భిణీగా ఉన్నప్పుడు, పాలిచ్చే సమయంలో, ప్రసవించిన కొద్దిరోజుల తర్వాత, అబార్షన్ అయిన సందర్భాల్లో కొద్ది రోజుల తర్వాత రక్తదానం చేయోచ్చు. రుతుస్రావం రక్తదానానికి ఎలాంటి అడ్డంకి కాదు. చాలా దేశాలు 16 ఏళ్లు నిండిన వారినే రక్తదానం చేయడానికి అనుమతినిస్తున్నాయి. రక్తదానానికి గరిష్ట వయోపరిమితి అంటూ ఏమీ లేదు. కొన్ని దేశాలు మాత్రం 60-70 ఏళ్లను గరిష్ట వయసుగా నిర్ణయించాయి.
 
'ప్రమాదకర పరిస్థితి'లో ఉన్నవారు
జీవితమంటేనే ప్రమాదాలతో ప్రయాణం. రక్తందానం చేయడంతో అలాంటి ప్రమాదాలను కొన్నింటిని ఆపొచ్చు. డబ్ల్యూహెచ్‌వో చెప్పేదేమంటే, 'అనేకమందితో లైంగిక సంబంధాలున్నవారు, అసహజ సెక్స్ సంబంధాలు కలిగి ఉన్నవారు రక్తదానం చేయకపోవడమే మంచింది. అలా చేస్తే వారి వ్యాధులు ఇతరులకు సోకే ప్రమాదం ఉంది''. మత్తుమందులు తీసుకునేవారి నుంచి రక్తం తీసుకోవడం చివరి ప్రత్యామ్నాయంగా ఉండాలి. అలాగే, మలేరియా, డెంగీ, జికా వైరస్ వ్యాప్తిచెందిన ప్రదేశాల్లో తిరిగి వచ్చినవారిని కూడా ఇదే కోవలో చేర్చాలి.
 
సాధారణంగా మానవుడి శరీరంలో సుమారు ఐదు లీటర్ల రక్తం ఉంటుంది. రక్తదానం చేసినప్పుడు సాధారణంగా 500 మిల్లీ లీటర్ల రక్తం మాత్రమే తీసుకుంటారు. రక్తం ఇచ్చిన ఒకటి రెండు రోజుల్లోనే మీరు పూర్వస్థితికి చేరుకుంటారు.
 
ఇలా ఉంటే రక్తదానం చేయొచ్చు
ఆరోగ్యంగా ఉండాలి.
బరువు 50 కిలోలు మించి ఉండాలి.
వయసు 18 నుంచి 65 ఏళ్ల మధ్య ఉండాలి. (దేశాలను బట్టి ఇది మారుతుంది)

Share this Story:

వెబ్దునియా పై చదవండి

తెలుగు వార్తలు ఆరోగ్యం వినోదం పంచాంగం ట్రెండింగ్..

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైదరాబాద్‌లో కిన్లే వాటర్ బాటిల్ 207 రూపాయలా?