Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నాట్స్ ఆధ్వర్యంలో మహిళలకు ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన

నాట్స్ ఆధ్వర్యంలో మహిళలకు ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన
, సోమవారం, 31 జనవరి 2022 (23:58 IST)
న్యూ జెర్సీ: అమెరికాలో తెలుగు జాతికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ .. తాజాగా మహిళా సాధికారితపై దృష్టి సారించింది. మహిళలు ఆర్ధిక స్వావలంబన సాధించడం కుటుంబానికి ఎంతో కీలకమనే విషయాన్ని మహిళలకువివరించడంతో పాటు వారిలో ఆర్థిక చైతన్యం తీసుకొచ్చేందుకు వరుస కార్యక్రమాలు చేపట్టేందుకు నాట్స్ బోర్డ్ ఛైర్ పర్సన్ అరుణ గంటి చొరవ తోనడుంబిగించారు.

 
ఈ క్రమంలోనే  మహిళల ఆర్థిక తొలి ఆన్‌లైన్ వెబినార్ నిర్వహించారు. ముఖ్యంగా వివాహితలు పెళ్లయిన దగ్గర నుంచే ఎలా ఆర్థిక అప్రమత్తత కలిగి ఉండాలి. ప్రమాదవశాత్తుఇంటి పెద్ద దిక్కును కోల్పోతే.. కుటుంబాన్ని ఆర్థికంగా ఎలా సురక్షితంగా ఉంచుకోవాలి..? ఆర్థిక అంశాలపై  మహిళలకు అవగాహన ఎందుకు అత్యంత అవసరం అనే విషయాలను సవివరంగా ఈ వెబినార్‌లో వివరించారు. మాధవి దొడ్డి ఈవెబినార్‌‌కు వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

 
ఆర్థిక భద్రత గురించి మహిళలు కచ్చితంగా తెలుసుకోవడంతో పాటు దానిని సాధించడం కోసం పాటించాల్సిన పద్దతులపై కూడా అవగాహన కల్పించడమే తమ లక్ష్యమని నాట్స్ బోర్డ్ ఛైర్ పర్సన్ అరుణ గంటి అన్నారు. మహిళలను ఆర్ధిక అంశాలపై చైతన్యం చేసేందుకు వరుస వెబినార్స్‌తో నాట్స్ తన వంతు కృషిచేస్తుందని ఆమె తెలిపారు.


వందల మంది తెలుగు మహిళలు ఆన్‌లైన్ ద్వారా ఈ వెబినార్‌లో పాల్గొన్నారు. ఆర్ధికఅంశాలపై తమకు తెలియని ఎన్నో విషయాలను తెలుసుకునేలా చేసినందుకు నాట్స్‌కు వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమ నిర్వహణకు సమన్వయం చేసిన జయశ్రీ పెద్దిభొట్ల, లక్ష్మి బొజ్జ, జ్యోతి వనంలను నాట్స్అధ్యక్షుడు శేఖర్ అన్నే ప్రత్యేకంగా అభినందించారు.


మహిళా సాధికారిత సంస్థ వ్యవస్థాపకులు, టెక్నాలజీ సొల్యూషన్స్ అండ్ ఐటీ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ దుర్గా ప్రశాంతి గండి ఈ వెబినార్‌కు ముఖ్య అతిధిగా విచ్చేసి ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరివేపాకు పొడి ఆరోగ్య ప్రయోజనాలు