Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చలికాలం: ఆరోగ్యానికి మేలు చేసే నువ్వుల గోంగూర మటన్ ఎలా?

చలికాలంలో ఆరోగ్యానికి నువ్వులు, గోంగూర మేలు చేస్తాయి. గోంగూరలోని విటమిన్ సి శీతాకాలంలో వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. శరీరంలో తెలుపు రక్త కణాలను పెంచుతాయి. తద్వారా బ్యాక్టీరియాతో అవి పోరాడుతాయి. దీం

Advertiesment
చలికాలం: ఆరోగ్యానికి మేలు చేసే నువ్వుల గోంగూర మటన్ ఎలా?
, శుక్రవారం, 8 డిశెంబరు 2017 (16:07 IST)
చలికాలంలో ఆరోగ్యానికి నువ్వులు, గోంగూర మేలు చేస్తాయి. గోంగూరలోని విటమిన్ సి శీతాకాలంలో వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. శరీరంలో తెలుపు రక్త కణాలను పెంచుతాయి. తద్వారా బ్యాక్టీరియాతో అవి పోరాడుతాయి. దీంతో అనారోగ్య సమస్యలు దూరమవుతాయి.

ఇదే విధంగా నువ్వులు కూడా శరీరానికి వేడినిస్తాయి. హృదయ ఆరోగ్యానికి ఇది మేలు చేస్తుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. క్యాన్సర్‌పై పోరాడుతుంది.  హార్మోన్ సమతుల్యతకు తోడ్పడుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తొలగిస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ రెండింటితో మటన్ గ్రేవీ ఎలా చేయాలో చూద్దాం..  
 
కావాల్సిన పదార్థాలు : 
మటన్‌ ముక్కలు-ఒక కేజీ,
గోంగూర తరుగు - మూడు కప్పులు 
వేయించిన నువ్వులు - రెండు స్పూన్లు
అల్లం పేస్టు- ఒక టేబుల్‌స్పూను
వెల్లుల్లి పేస్టు- ఒకటిన్నర టేబుల్‌స్పూను
లవంగాలు-8, గ్రీన్‌ యాలకులు-ఆరు, సోంపు-రెండు టీస్పూన్లు, 
నిమ్మరసం, కొత్తిమీర తరుగు- చెరో రెండు స్పూన్లు
గసగసాలు- టేబుల్‌ స్పూన్
దాల్చినచెక్క- చిన్నముక్క, 
ఆవాలు- ఒక టీస్పూను, 
ఎండుమిర్చి-ఐదు,
కారం-ఒక టీస్పూను, 
పసుపు- అరచెంచా, 
ఉప్పు, నూనె- తగినంత
 
తయారీ విధానం:  
ముందుగా కడిగిన చిన్నపాటి మటన్ ముక్కలకు వెల్లుల్లి, అల్లం పేస్టును, ఉప్పును చేర్చి బాగా పట్టించి అరగంట పాటు పక్కనబెట్టాలి. తర్వాత గసగసాలు, వెల్లుల్లి, యాలకులు, సోంపు, దాల్చినచెక్కలను తవా మీద కాసేపు వేగించి మిక్సీలో రుబ్బుకుని పక్కన బెట్టుకోవాలి. ఆపై బాణలి పెట్టి వేడయ్యాక అందులో నూనె వేసి వేడయ్యాక, ఆవాలు, ఎండుమిర్చి వేగించాలి. తరువాత మటన్‌ వేసి బంగారు రంగులోకి వచ్చే వరకూ వేగించాలి.

ఇందులో శుభ్రం చేసిన గోంగూర తరుగును కూడా చేర్చి బాగా వేపాలి. మటన్‌ వేగాక కారం, పసుపు, అల్లం, గ్రైండ్‌ చేసిపెట్టుకున్న మసాలా వేసి కలపాలి. తగినంత నీళ్లు పోసి బాగా ఉడికించాలి. మటన్ ఉడికాక నువ్వుల పొడిని కర్రీపై చల్లి, నిమ్మరసం కూడా వేసి కలపాలి. అంతే గోంగూర, నువ్వుల మటన్ కర్రీ రెడీ. ఈ కర్రీని రోటీలకు, లేదా అన్నంలోకి సైడిష్‌గా సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెసరట్టు తింటే అందంగా వుంటారట..