Hotel style green chicken tikka recipe
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ టిక్కా ఎలా చేయాలంటే...
కావలసిన పదార్థాలు : చికెన్ - 1/2 కేజీ
పచ్చిమిర్చి - 4
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 చెంచా
పుదీనా - 2 పిడికెడు
కొత్తిమీర - 1 పిడికెడు
నిమ్మరసం - సగం
పసుపు పొడి - 1/2 చెంచా
నెయ్యి - 2 చెంచా
ఉప్పు - కావలసినవి
తయారీ విధానం: ముందుగా చికెన్‌ని బాగా శుభ్రం చేసుకోవాలి. పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర అన్నీ మెత్తగా రుబ్బుకోవాలి. చికెన్‌తో రుబ్బిన పేస్ట్, నిమ్మరసం, పసుపు, ఉప్పు కలపాలి. ఈ చికెన్ మిశ్రమాన్ని రిఫ్రిజిరేటర్‌లో 4 గంటల పాటు మ్యారినేట్ చేయాలి. మైక్రోవేవ్ ఓవెన్‌లో మెరినేట్ చేసిన చికెన్‌ను గ్రిల్ చేయాలి. మైక్రోవేవ్ ఓవెన్ లేకపోతే, పాన్‌లో నెయ్యి వేసి, మీడియం వేడి మీద చికెన్ ఉడికించాలి. అంతే రుచికరమైన గ్రీన్ చికెన్ టిక్కా రెడీ.