చాలా మందికి ఇష్టమైన సీఫుడ్ రొయ్యలు. రొయ్యలతో ఆరోగ్యంతో పాటు చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు. రొయ్యలలో విటమిన్ బి 12, విటమిన్ ఏ ఉంటాయి. ఇవి చర్మానికి మంచి నిగారింపును అందిస్తాయి. రొయ్యలలో ఉండే ప్రోటీన్లు శరీరంలోని కండరాల నిర్మాణానికి కొత్త కణజాలం ఏర్పాటుకు సహాయపడతాయి. అలాంటి పోషకాలతో నిండిన రొయ్యలతో 'రొయ్యల బాల్స్' ఎలా చేయాలో చూద్దాం..
కావలసిన పదార్థాలు:
రొయ్యలు - 500 గ్రాముల
మిరియాల పొడి - 1 టేబుల్ స్పూన్
పసుపు పొడి - 1 టేబుల్ స్పూన్
కోడిగుడ్డు - 1 టేబుల్ స్పూన్
సోయా సాస్ - 1 టేబుల్ స్పూన్
మొక్కజొన్న పిండి - 2 టేబుల్ స్పూన్లు
బ్రెడ్ పొడి - 8 టేబుల్ స్పూన్లు
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
పచ్చిమిర్చి - 2
పెద్ద ఉల్లిపాయలు - 1
కొత్తిమీర ఆకు - కొద్దిగా
నూనె - అవసరమైనంత
ఉప్పు - కావలసినంత
తయారీ విధానం
ముందుగా రొయ్యలను బాగా శుభ్రం చేసి పసుపు, ఉప్పు కలిపి 10 నిమిషాలు నానబెట్టాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. నానబెట్టిన రొయ్యలను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక గిన్నెలో మిరియాలు, ఉప్పు, సోయాసాస్, రొయ్యలతో పాటు గ్రైండ్ చేసిన పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఆపై గిలకొట్టిన కోడిగుడ్డు మిశ్రమాన్ని రొయ్యల్లో వేసి కలపాలి. తర్వాత దానికి మొక్కజొన్న పిండి, 4 టీస్పూన్ల బ్రెడ్ పౌడర్ కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి.
ఈ రొయ్యల బాల్స్‌ను మిగిలిన బ్రెడ్‌క్రంబ్స్ లేదా ఫైన్ క్రంబ్స్‌లో మెల్లగా రోల్ చేసి 30 నిమిషాల వరకు ఫ్రిజ్‌లో ఉంచాలి. తర్వాత పొయ్యిపై బాణలిని ఉంచి రొయ్యల బాల్స్ వేసి బంగారు గోధుమ రంగు వచ్చేవరకు నూనెలో వేయించాలి. దానిపై కొన్ని కొత్తిమీర తరుగు చల్లాలి. అంతే క్రంచీ ప్రాన్ బాల్స్ రెడీ. వీటిని చిల్లీ సాస్‌తో కలిపిన మయోనైస్‌ను కలిపి తీసుకుంటే టేస్టు అదిరిపోతుంది.