సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్రంబకే దేవీ నారాయణి నమోస్తుతే
ప్రతిపదార్థము: సర్వమంగళ మాంగళ్యే = శుభకరమైన వాటన్నింట శుభకరమైనది /మంగళకరమైనది (సర్వమంగళ నామము చేత మంగళ స్వరూపురాలైనది); శివే = శివ సతి అయిన శక్తి లేదా పార్వతి; సర్వ = అన్ని; అర్థ = అర్థములను (ధర్మ+అర్థ+కామ+మోక్ష అను చతుర్విధ పురుషార్థములు); సాధికే = సాధించినది; శరణ్యే = శరణము/ఆశ్రయము కల్పించేది; త్రంబకి = త్రి + అంబకి = మూడు కన్నులు గలవాని దేవేరి, అనగా పార్వతి; దేవి = దేవి/దేవత; నారాయణి = పార్వతి; తే = నీకు; నమః = నమస్కారము/ప్రణామము; అస్తు = అగు గాక.
తాత్పర్యము: మంగళకరమైన వాటన్నిటిలోనూ అతి మంగళకరమై, సర్వ మంగళ నామధేయురాలవై, అన్ని అర్థములను సాధించి, శరణు జొచ్చిన వారికి ఆశ్రయమిచ్చే, ముక్కంటి దేవర అయిన శివుని అర్ధాంగి అయిన ఓ పార్వతీ, ఓ దుర్గాదేవీ, ఓ నారాయణీ, నీకు నమస్కరిస్తున్నాను.