Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అప్పు చెల్లించలేదనీ... యువకుడిని బైకుకు కట్టి 3 కిమీ పరుగెత్తించిన వైనం...

Advertiesment
cuttack youth
, మంగళవారం, 18 అక్టోబరు 2022 (10:35 IST)
ఒడిషా రాష్ట్రంలో కటక్‌లో దారుణం జరిగింది. ఓ యువకుడు తీసుకున్న రుణం చెల్లించలేక పోయాడు. దీంతో ఆ యువకుడిని ద్విచక్రవాహనానికి కట్టి మూడు కిలోమీటర్ల మేరకు లాక్కెళ్లారు. అందరూ చూస్తుండగానే బైకుకు తాడు కట్టి పరుగెత్తించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసు కేసు నమోదు చేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కటక్‌కు చెందిన ఓ యువకుడు తన తాత చనిపోవడంతో ఖర్చుల కోసం బాధిత యువకుడు జగన్నాథ్ కొన్ని రోజుల క్రితం నిందితుల వద్ద రూ.1500 మొత్తాన్ని అప్పుగా తీసుకున్నాడు. 
 
దీన్ని సకాలంలో తిరిగి చెల్లించలేకపోయాడు. పలుమార్లు బ్రతిమిలాడినప్పటికీ ఈ రుణాన్ని చెల్లించలేక పోయాడు. దీంతో ఆదివారం రాత్రి మరో ఐదుగురు స్నేహితులతో కలిసి వచ్చిన అప్పిచ్చిన వ్యక్తి.. యువకుడితో గొడవకు దిగాడు. అతడిని చితకబాదిన అనంతరం రెండు చేతులను తాళ్లతో కట్టి తాడు చివరను తన బైక్‌ వెనక కట్టాడు. 
 
అనంతరం బైక్‌ను రద్దీ రోడ్డుపై వేగంగా పోనిచ్చాడు. దీంతో బాధితుడు మూడు కిలోమీటర్ల పాటు బైక్ వెనక పరుగులు తీయాల్సి వచ్చింది. ఈ ఘటనను అందరూ చూస్తున్నా ఎవరూ జోక్యం చేసుకోకపోవడం గమనార్హం. ట్రాఫిక్ పోలీసులు చూసి కూడా అడ్డుకోకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. 
 
దీనికి సంబంధించిన వీడియో ఒకటి వెలుగులోకి రావడంతో స్పందించిన పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్టు చెప్పారు. ఇద్దరు నిందితులను గుర్తించామని, మిగతా వారి కోసం గాలిస్తున్నట్టు చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నైజీరియాను కుదిపిస్తున్న వరదలు - ఇప్పటికే 600 మంది మృతి